ఈడెన్‌లో ఆ మైలు రా​యి అందుకుంటాడా.? | R Ashwin Hopes to Break Eden Jinx as Fastest to 300 Feat Beckons | Sakshi
Sakshi News home page

ఈడెన్‌లో ఆ మైలు రా​యి అందుకుంటాడా.?

Published Wed, Nov 15 2017 6:14 PM | Last Updated on Wed, Nov 15 2017 6:14 PM

R Ashwin Hopes to Break Eden Jinx as Fastest to 300 Feat Beckons - Sakshi

సాక్షి, కోల్‌కతా: శ్రీలంకతో టెస్టు సిరీస్‌ సందర్భంగా జట్టులోకి తిరిగొచ్చిన టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇక గురువారం నుంచి భారత్‌-శ్రీలంక తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కనుక ఈ సీనియర్‌ స్పిన్నర్‌ 8 వికెట్లు పడగొడితే.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గుర్తింపు పొందనున్నాడు.

ఇప్పటికే 52 మ్యాచుల్లో 292 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. అంతకు ముందు 56 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించి తొలిస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ డెన్నీస్‌ లిల్లీ రికార్డు బ్రేక్‌ చేయనున్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళిధరన్‌ 58 మ్యాచుల్లో ఈ మైలు రాయి అందుకున్నాడు. ఆ తరువాతి స్థానాల్లో ఉన్న హడ్లీ(న్యూజిలాండ్‌), మార్షల్‌( వెస్టిండీస్‌), స్టేయిన్‌(దక్షిణాఫ్రికాలు) 61 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు. భారత మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే తన 66 టెస్టులో ఈ మైలురాయి అందుకున్నాడు. 

అశ్విన్‌కు అచ్చిరానీ ఈడెన్‌..
కానీ శ్రీలంకతో జరిగే టెస్టుల్లో ఈ రికార్డు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు.  ఈడెన్‌ మైదానంలో జరిగిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే అశ్విన్‌ రికార్డు అంతంత మాత్రమే. ఈ మైదానంలో అశ్విన్‌ యావరేజ్‌ (34.05)గా ఉంది. ఇక్కడ రెండు టెస్టులు ఆడిన అశ్విన్‌ రెండింట్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక మరో 6 వికెట్లు పడగొడితే వరుసగా మూడేళ్లలో 50కి పైగా వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా అశ్విన్‌ గుర్తింపు పొందనున్నాడు. 2016లో 12 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీసిన అశ్విన్‌..2015లో 9 మ్యాచుల్లో 62 వికెట్లు పడగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement