India-Srilanka Test series
-
పుజారా సెంచరీ.. కోహ్లి హాఫ్ సెంచరీ
నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీమిండియా ఓపెనర్ మురళి విజయ్, నయావాల్ పుజారాలు శతకాలకు కెప్టెన్ కోహ్లి అర్ధ శతకం తోడవ్వడంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్‌కు 107 పరుగుల ఆధిక్యం లభించింది. తొలిరోజు సింగిల్ డిజిట్‌కే రాహుల్ వికెట్ కొల్పోయినా భారత్‌కు మరో ఓపెనర్ విజయ్, పుజారాలు అండగా నిలిచారు. సెంచరీలతో లంక బౌలర్లను చెడుగుడు ఆడారు. రెండో రోజు 11/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌కు విజయ్, పుజారాలు బలమైన పునాది వేశారు. అసలైన టెస్టుమ్యాచ్ మజాను క్రికెట్ అభిమానులకు రుచి చూపించారు. తొలుత మురళి విజయ్ 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో కెరీర్లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో అధిక సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌గా విజయ్ గుర్తింపు పొందాడు. పటిష్టంగా క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని రంగనా హెరాత్ విడగొట్టాడు. జట్టు స్కోరు 216 పరుగుల వద్ద అనవసర షాట్‌కు ప్రయత్నించిన విజయ్ 128(221 బంతులు; 11 ఫోర్లు, ఒక సిక్సు) క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పుజారా తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించగా కోహ్లి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ దశలో 246 బంతులు ఎదుర్కొన్న పుజారా కెరీర్లో 14 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత వేగం పెంచిన కోహ్లి 66 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్లో 15 హాఫ్ సెంచరీ సాధించాడు. రెండోరోజు ఆటముగిసే సమయానికి క్రీజులో పుజారా 121 (284 బంతులు, 13 ఫోర్లు), కోహ్లి 54 (70 బంతులు, 6 ఫోర్లు)లు ఉన్నారు. -
విజయ్ సెంచరీ.. మరో వికెట్ కోల్పోయిన భారత్
నాగ్‌పూర్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీతో రాణించిన మురళి విజయ్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి తో పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విజయ్ తిరిగి తన ఫామ్‌ను సాధించాడు. 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో కెరీర్లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో అధిక సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌గా విజయ్ గుర్తింపు పొందాడు. వీరి అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ సునాయసంగా 200 పరుగులు చేయగలిగింది. పటిష్టంగా క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని రంగనా హెరాత్ విడగొట్టాడు. జట్టు స్కోరు 216 పరుగుల వద్ద అనవసర షాట్‌కు ప్రయత్నించిన విజయ్ 128(218 బంతులు; 11 ఫోర్లు, ఒక సిక్సు) క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. పుజారా 88(225 బంతులు, 10 ఫోర్లు), కోహ్లి 4 (7 బంతులు) క్రీజులో ఉన్నారు. ఇక భారత్‌కు 24 పరుగుల ఆధిక్యం లభించింది. -
మ్యాచ్ డ్రా కోసం లంక తొండాట.! కోహ్లి ఫైర్
కోల్‌కతా: భారత్- శ్రీలంకతో మధ్య జరిగిన తొలి టెస్టులో లంక ఆటగాళ్లు క్రీడాస్పూర్తిని మరిచారు. చివరి రోజు ఆటలో ఓటమి తప్పదని భావించిన లంక బ్యాట్స్‌మెన్స్ డ్రా కోసం డ్రామా ప్లే చేశారు. భారత బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక తొండాట ఆడారు. ఒక వైపు టపటపా వికెట్లు పడుతుండటంతో చేసేదేమి లేక ఓటమి నుంచి గట్టెక్కేందుకు క్రీజులో టైంపాస్ చేయడం మెదలుపెట్టారు. దీంతో విసుగెత్తిన భారత బౌలర్లు, కెప్టెన్ కోహ్లి లంక బ్యాట్స్‌మెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మైదానంలో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అంపైర్లు జోక్యంతో సద్దుమణిగింది. ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ 352/8 స్కోరు వద్ద డిక్లేర్ ఇచ్చి లంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక భారత్ బౌలర్ల దాటికి ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 18 ఓవర్లో క్రీజులో ఉన్న నిరోషన్ డిక్వెల్లా, చండీమల్‌లు పదేపదే బౌలర్‌ను బంతులు వేయకుండా అడ్డుచెప్పాడు. దీంతో షమీ కోపాద్రిక్తుడయ్యాడు. చివరికి బ్యాడ్‌లైట్‌తో అంపైర్లు మ్యాచ్ త్వరగా ముగించారు. దీంతో లంక బతికి బట్టగట్టింది. కీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన లంక బ్యాట్స్‌మెన్ తీరుపై అభిమానులు, క్రికెట్ విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డ్రా కోసం లంక బ్యాట్స్‌మెన్స్ డ్రామా
-
ఫీల్డింగ్‌తో అదరగొట్టిన జడేజా
-
బౌలింగ్ ఇవ్వకున్నా.. అదరగొట్టె ఫీల్డింగ్‌కు నేను రెడీ!
కోల్‌కతా: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పిచ్ పేసర్స్‌కు అనుకూలిస్తుండటంతో కెప్టెన్ విరాట్ కోహ్లి స్పిన్నర్లను బౌలింగ్‌కు దూరంగా ఉంచాడు. అయితే టెస్టుల్లో నెం2 ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా బౌలింగ్ ఇవ్వకున్న అదరగొట్టె ఫీల్డింగ్‌కు నేను ఎప్పుడూ రెడీ అని నిరూపించాడు. కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన జడేజా నాలుగో రోజు మార్నింగ్ సెషన్లో అదరగొట్టె ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో లంక ప్లేయర్ రంగనా హెరాత్ ఆడిన ఓ షాట్ బౌండరీ హద్దును సమీపిస్తుండగా లాంగ్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా సూపర్ డైవ్‌తో అడ్డుకున్నాడు. అంతేగాకుండా బంతిని అంతే వేగంతో వికెట్ల వైపు విసిరాడు. కానీ బంతి కొద్దీలో వికెట్‌ను మిస్ అయి రనౌట్ చేజారింది. ఈ ఫీల్డింగ్‌కు కెప్టెన్ కోహ్లితో పాటు ప్లేయర్లంతా జడ్డూను అభినందిస్తూ.. హో జస్ట్ మిస్ అనే హవాభావాలు ప్రదర్శించారు. ఇక లంక తొలి ఇన్నింగ్స్ 294 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. నాలుగో రోజు ఆటముగిసే సరికి భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 171/1. క్రీజులో రాహుల్(73 నాటౌట్),పుజారా(2 నాటౌట్)లు ఉన్నారు. ఫీల్డింగ్‌తో అదరగొట్టిన జడేజా -
కదం తొక్కిన ఓపెనర్లు..
కోల్‌కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఓపెనర్లు కదం తొక్కారు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన ఈ జోడీ రెండో ఇన్నింగ్స్‌లో లంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. తొలుత రాహుల్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై ధావన్ సైతం అర్థ శతకం నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ ఆడిన గత తొమ్మిది ఇన్నింగ్స్ ల్లో ఎనిమిదో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో అర్థ శతకంతో చెలరేగాడు. ఇది రాహుల్ కు టెస్టుల్లో 10వ హాఫ్ సెంచరీ. జట్టు స్కోర్ 166 పరుగుల వద్ద శిఖర్ ధావన్ 94 ( 116 బంతులు 11ఫోర్లు, 2 సిక్సులు) దాసున్ షనక బౌలింగ్‌లో క్యాచ్ అవుటై తృటిలో శతకం చేజార్చుకున్నాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన166 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన చతేశ్వర పుజారాతో రాహుల్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్‌ను 15 నిమిషాల ముందే ముగించారు. ఇక నాలుగో రోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టపోయి భారత్ 171 పరుగుల చేసి 49 పరుగుల ఆధిక్యం సాధించింది. క్రీజులో రాహుల్(73 నాటౌట్),పుజారా(2 నాటౌట్)లు ఉన్నారు. అంతకుముందు శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 83.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. 165/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. మరో 35 పరుగులు జోడించిన తరువాత డిక్ వెల్లా(35) వికెట్ ను కోల్పోయింది. అటు స్వల్ప వ్యవధిలో ఆపై దాసున్ షనక(0), చండిమాల్ (28)సైతం అవుటయ్యారు ఈ మూడు వికెట్లు పరుగు వ్యవధిలో కోల్పోవడంతో అప్పటి వరకూ పటిష్ట స్థితిలో కనిపించిన లంక ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఈ తరుణంలో రంగనా హెరాత్ బాధ్యతాయుతంగా ఆడాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో 67 పరుగులు జోడించాడు. తొమ్మిదో వికెట్ కు 46 పరుగులు జోడించిన తరువాత హెరాత్ పెవిలియన్ చేరాడు. భారత బౌలింగ్‌లో భువనేశ్వర్, షమీలకు నాలుగు వికెట్లు దక్కగా.. ఉమేశ్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
ఈడెన్‌లో ఆ మైలు రాయి అందుకుంటాడా.?
సాక్షి, కోల్‌కతా: శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టులోకి తిరిగొచ్చిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇక గురువారం నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కనుక ఈ సీనియర్ స్పిన్నర్ 8 వికెట్లు పడగొడితే.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గుర్తింపు పొందనున్నాడు. ఇప్పటికే 52 మ్యాచుల్లో 292 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. అంతకు ముందు 56 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించి తొలిస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నీస్ లిల్లీ రికార్డు బ్రేక్ చేయనున్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళిధరన్ 58 మ్యాచుల్లో ఈ మైలు రాయి అందుకున్నాడు. ఆ తరువాతి స్థానాల్లో ఉన్న హడ్లీ(న్యూజిలాండ్), మార్షల్( వెస్టిండీస్), స్టేయిన్(దక్షిణాఫ్రికాలు) 61 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 66 టెస్టులో ఈ మైలురాయి అందుకున్నాడు. అశ్విన్‌కు అచ్చిరానీ ఈడెన్.. కానీ శ్రీలంకతో జరిగే టెస్టుల్లో ఈ రికార్డు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఈడెన్ మైదానంలో జరిగిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే అశ్విన్ రికార్డు అంతంత మాత్రమే. ఈ మైదానంలో అశ్విన్ యావరేజ్ (34.05)గా ఉంది. ఇక్కడ రెండు టెస్టులు ఆడిన అశ్విన్ రెండింట్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక మరో 6 వికెట్లు పడగొడితే వరుసగా మూడేళ్లలో 50కి పైగా వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా అశ్విన్ గుర్తింపు పొందనున్నాడు. 2016లో 12 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీసిన అశ్విన్..2015లో 9 మ్యాచుల్లో 62 వికెట్లు పడగొట్టాడు. -
డైలమాలో టీమిండియా సెలెక్టర్లు..
గాలె టెస్టు విజయానంతరం రెండో టెస్టుకు భారత జట్టు కూర్పు సెలక్టర్లకు కత్తి మీద సాములా మారింది. నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉండటం.. గాలే మ్యాచ్‌లో అందరూ రాణించడంతో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలకు పెద్ద సమస్యగా మారింది. జ్వరంతో లోకెశ్ రాహుల్ తొలి టెస్టుకు దూరం కాగా అతని స్థానంలో అభినవ్ ముకుంద్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అభినవ్ నిరాశపరిచనప్పటికి రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి కెప్టెన్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తొలుత జట్టులో చోటు దక్కకపోవడంతో హాంకాంగ్‌లో హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు. అనంతరం మెల్బోర్న్ వెళ్లి వన్డేలకు సిద్దమవ్వాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. కానీ టెస్టు రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అనూహ్యంగా ధావన్‌కు చోటు దక్కింది. టెస్టుల్లో మళ్లీ ఆడాలనే ధృడ సంకల్పంతో ఉన్న ధావన్ అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగాడు. తొలిఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో(190) అజెయ సెంచరీ సాధించాడు. గతేడాది న్యూజిలాండ్ సిరీస్‌లో గాయపడి జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకొని అదరగొట్టడంతో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టులో అవకాశం లభించలేదు. రెండో టెస్టులోనైనా చోటు దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా, రహానే, పాండ్యాలు కూడా రాణించడంతో జట్టు కూర్పు పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న రహానేను నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తుండగా.. నలుగురు ఓపెనర్ బ్యాట్స్మెన్లలో ఎవరికీ అవకాశం ఇవ్వాలో అర్థం కాగా కోచ్, కెప్టెన్లు తల బాదుకుంటున్నారు. -
భారత్ స్టోక్స్.. పాండ్యానే..
ఆడిన తొలి టెస్టులోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత ఆటగాడు హార్ధిక్ పాండ్యాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భారత్ స్టోక్స్‌గా అభివర్ణించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రపంచ గొప్ప ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌తో పాండ్యాను పోల్చుతూ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం మాట్లాడిన కోహ్లీ.. పాండ్యా స్టోక్స్‌లా రాణిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ అవకాశం తక్కువగా వచ్చినా రెండో ఇన్నింగ్స్‌లో దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని కొనియాడాడు. వేగంతో కూడిన షార్ట్ పిచ్ బంతులు అద్భుతంగా వేయడం ఆకట్టుకుందని కోహ్లి చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 540-550 మధ్యలోనే భారత్ ఇన్నింగ్స్ ముగుస్తుందని భావించామని.. కానీ పాండ్యా హాఫ్ సెంచరీతో భారీ స్కోరు నమోదైందని పేర్కొన్నాడు. గత రెండు సంవత్సరాలుగా భారత బౌలర్లు స్థిరంగా రాణిస్తున్నారని కోహ్లి వ్యాఖ్యానించాడు. సెంచరీపై స్పందిస్తూ.. గత ఆస్ట్రేలియా సిరీస్, తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంపై మాట్లాడుతూ.. వైఫల్యాలను టార్గెట్ చేస్తూ వేలిత్తి చూపేవారిని పట్టించుకోనని.. పరిస్థితుల తగ్గట్టు ఆడడమే తన కర్తవ్యమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మేము కొంత ఆడాల్సిన అవసరం ఏర్పడింది. ఆ పరిస్థితిని అభినవ్‌తో అందిపుచ్చుకున్నానని కోహ్లి తెలిపాడు. ఎన్ని మ్యాచుల్లో విఫలమయ్యానని ఎప్పుడూ లెక్కించుకోనని, అన్ని ఫార్మట్లు ఆడుతున్నప్పుడు ఏ ఫార్మట్‌లో ఎన్ని ఇన్నింగ్స్‌లు ఆడలేదని లెక్కించుకోవడం కష్టమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 304 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ(103 నాటౌట్) కెరీర్లో 17 వ సెంచరీ నమోదు చేశాడు. హార్ధిక్ పాండ్యా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో పాటు ఒక వికెట్ పడగొట్టాడు.