
కోల్‌కతా: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పిచ్ పేసర్స్‌కు అనుకూలిస్తుండటంతో కెప్టెన్ విరాట్ కోహ్లి స్పిన్నర్లను బౌలింగ్‌కు దూరంగా ఉంచాడు. అయితే టెస్టుల్లో నెం2 ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా బౌలింగ్ ఇవ్వకున్న అదరగొట్టె ఫీల్డింగ్‌కు నేను ఎప్పుడూ రెడీ అని నిరూపించాడు.
కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన జడేజా నాలుగో రోజు మార్నింగ్ సెషన్‌లో అదరగొట్టె ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో లంక ప్లేయర్ రంగనా హెరాత్ ఆడిన ఓ షాట్ బౌండరీ హద్దును సమీపిస్తుండగా లాంగ్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా సూపర్ డైవ్‌తో అడ్డుకున్నాడు. అంతేగాకుండా బంతిని అంతే వేగంతో వికెట్ల వైపు విసిరాడు. కానీ బంతి కొద్దీలో వికెట్‌ను మిస్ అయి రనౌట్ చేజారింది. ఈ ఫీల్డింగ్‌కు కెప్టెన్ కోహ్లితో పాటు ప్లేయర్లంతా జడ్డూను అభినందిస్తూ.. హో జస్ట్ మిస్ అనే హవాభావాలు ప్రదర్శించారు.
ఇక లంక తొలి ఇన్నింగ్స్ 294 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. నాలుగో రోజు ఆటముగిసే సరికి భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 171/1. క్రీజులో రాహుల్(73 నాటౌట్),పుజారా(2 నాటౌట్)లు ఉన్నారు.
ఫీల్డింగ్‌తో అదరగొట్టిన జడేజా