డైలమాలో టీమిండియా సెలెక్టర్లు.. | India Face Selection Dilemma After Huge Galle Victory | Sakshi
Sakshi News home page

డైలమాలో టీమిండియా సెలెక్టర్లు..

Published Sun, Jul 30 2017 12:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

డైలమాలో టీమిండియా సెలెక్టర్లు..

డైలమాలో టీమిండియా సెలెక్టర్లు..

గాలె టెస్టు విజయానంతరం రెండో టెస్టుకు భారత జట్టు కూర్పు సెలక్టర్లకు కత్తి మీద సాములా మారింది. నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉండటం.. గాలే మ్యాచ్‌లో అందరూ రాణించడంతో టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీలకు పెద్ద సమస్యగా మారింది. జ్వరంతో లోకెశ్‌ రాహుల్‌ తొలి టెస్టుకు దూరం కాగా అతని స్థానంలో అభినవ్‌ ముకుంద్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అభినవ్‌ నిరాశపరిచనప్పటికి రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి కెప్టెన్‌ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. 
 
మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలుత జట్టులో చోటు దక్కకపోవడంతో హాంకాంగ్‌లో హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు. అనంతరం మెల్‌బోర్న్‌ వెళ్లి వన్డేలకు సిద్దమవ్వాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. కానీ టెస్టు రెగ్యులర్‌ ఓపెనర్‌ మురళీ విజయ్‌ గాయంతో సిరీస్‌ మొత్తానికి దూరం కావడంతో అనూహ్యంగా ధావన్‌కు చోటు దక్కింది. టెస్టుల్లో మళ్లీ ఆడాలనే ధృడ సంకల్పంతో ఉన్న ధావన్‌ అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగాడు. తొలిఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో(190) అజెయ సెంచరీ సాధించాడు.
 
గతేడాది న్యూజిలాండ్‌ సిరీస్‌లో గాయపడి జట్టుకు దూరమైన రోహిత్‌ శర్మ..  చాంపియన్స్‌ ట్రోఫీలో చోటు దక్కించుకొని అదరగొట్టడంతో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టులో అవకాశం లభించలేదు. రెండో టెస్టులోనైనా చోటు దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానే, పాండ్యాలు కూడా రాణించడంతో జట్టు కూర్పు పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న రహానేను నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తుండగా.. నలుగురు ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఎవరికీ అవకాశం ఇవ్వాలో అర్థం కాగా కోచ్‌, కెప్టెన్‌లు తల బాదుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement