నాగ్‌పూర్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీతో రాణించిన మురళి విజయ్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి తో పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విజయ్ తిరిగి తన ఫామ్‌ను సాధించాడు. 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో అధిక సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌గా విజయ్ గుర్తింపు పొందాడు. వీరి అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ సునాయసంగా 200 పరుగులు చేయగలిగింది. పటిష్టంగా క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని రంగనా హెరాత్ విడగొట్టాడు. జట్టు స్కోరు 216 పరుగుల వద్ద అనవసర షాట్‌కు ప్రయత్నించిన విజయ్ 128(218 బంతులు; 11 ఫోర్లు, ఒక సిక్సు) క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. పుజారా 88(225 బంతులు, 10 ఫోర్లు), కోహ్లి 4 (7 బంతులు) క్రీజులో ఉన్నారు. ఇక భారత్‌కు 24 పరుగుల ఆధిక్యం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment