'ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా' | R Ashwin Says Hyderabad Track Will Help Him vs Bangladesh | Sakshi
Sakshi News home page

'ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా'

Published Tue, Feb 7 2017 9:51 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

'ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా'

'ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా'

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బౌలింగ్ చేయడాన్ని తాను ఎంజాయ్ చేస్తానని టీమిండియా  ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. గురువారం నుంచి బంగ్లాదేశ్తో ఇక్కడ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో అశ్విన్ స్పందించాడు. 'ఈ పిచ్పై బౌన్స్ బాగుంటుంది. దాంతో పాటు ఇదొక పెద్ద గ్రౌండ్ కూడా. ఈ తరహా పిచ్ నాకు లాభిస్తుందనే ఆశిస్తున్నా. ఇక్కడ బంతి పెద్దగా టర్న్ కాకపోయినా, ఊహించని బౌన్స్ వస్తుంది. అది స్పిన్నర్లకు అనుకూలమనే చెప్పొచ్చు'అని అశ్విన్ తెలిపాడు.

ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నాడు. బంగ్లాదేశ్ జట్టు ఒక మెరుగైన క్రికెట్ జట్టు అనే సంగతి మరువకుండా పూర్తిస్థాయి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement