హిందీ మాస్టర్‌గా మారిన షమీ | Mohammed Shami Teaches Nicholas Pooran Hindi Lessons | Sakshi
Sakshi News home page

హిందీ మాస్టర్‌గా మారిన షమీ

Published Thu, Jul 16 2020 3:11 PM | Last Updated on Thu, Jul 16 2020 3:45 PM

 Mohammed Shami Teaches Nicholas Pooran Hindi Lessons - Sakshi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడనున్న మహ్మద్ షమీ, నికోలస్ పూరన్ ఉన్న ఒక ఫన్నీ  వీడియోని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ, నికోలస్ పూరన్‌కు హిందీ నేర్పిస్తున్నాడు. ఇందులో మహ‍మ్మద్‌ షమీ ‘ఆప్ కహాన్ జా రహే హో’(మీరు ఎక్కడికి వెళుతున్నారు) అనే పదాన్ని చెబితే, దాన్ని నికోలస్‌ తిరిగి చెపుతున్నాడు. చాలా సేపటి తరువాత నికోలస్‌ దాన్ని సరిగ్గా ఉచ్చరించాడు.  ఈ ట్వీట్  శీర్షికలో "హిందీ పాఠాలకు అడుగులు. నిక్కీ ప్రా!" అని రాశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు లైక్‌ కొడుతూ, షేర్‌ చేస్తున్నారు. 

చదవండి: సరిగ్గా ఏడాది క్రితం.. వరల్డ్‌కప్‌లో

నికోలస్ పూరన్‌ను 2018 ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ .4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్  2019లో నికోలస్ పూరన్ ఫ్రాంచైజ్ కోసం 7 ఆటలను ఆడి, 28.00 సగటుతో మరియు 157.00 స్ట్రైక్ రేట్‌తో 168 పరుగులు చేయగలిగాడు. మహమ్మద్ షమీని కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2018 లో రూ .4.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019లో మహమ్మద్ షమీ 14 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.

చదవండి: ‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement