
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే వ్యవహరించనున్నాడు. శుక్రవారం ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషిని నియమించారు. విండీస్ దిగ్గజ మాజీ బౌలర్ కొట్నీ వాల్‡్షకు ప్రతిభాన్వేషణ బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురే కాకుండా ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మేటి జాంటీ రోడ్స్, బ్యాటింగ్ కోచ్‌గా జార్జి బెయిలీ (ఆ్రస్టేలియా)లను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైంది. 2016, 2017లలో భారత జట్టు కోచ్‌గా వ్యవహరించిన 48 ఏళ్ల కుంబ్లే వచ్చే ఐపీఎల్‌లో ఏకైక స్వదేశీ హెడ్ కోచ్‌గా ఉండబోతున్నాడు. మిగతా ఫ్రాంచైజీ జట్లకు విదేశీ క్రికెటర్లే కోచ్‌లుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment