"India's Greatest Moment...": టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టంలో తాను భాగం కాబోతున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప అదృష్టం ఇదేనంటూ మురిసిపోతున్నాడు. ఇందుకు గల కారణం ఏమిటంటే..
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టానికి జనవరి 22న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో గల ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఆరోజే జరుగనుంది. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు భవ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు.
ఇంటింటా రామజ్యోతి..
ఈ నేపథ్యంలో జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. అదే విధంగా.. ఆలయ ట్రస్టు అక్షతల పంపిణీకి ఏర్పాట్లు చేయడంతో పాటు.. ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వానితులకు పిలుపులు అందజేస్తోంది.
ఆహ్వానం అందింది
ఆ ఆహ్వానితుల జాబితాలో వెంకటేశ్ ప్రసాద్ పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు ఈ మాజీ ఫాస్ట్ బౌలర్. ‘‘రామ మందిర ప్రతిష్టాపన చూడాలనేది నా జీవితాశయం. ఆ అద్భుతమైన క్షణం రానే వచ్చింది.
జనవరి 22న కేవలం ప్రతిష్టాపనను చూడటం మాత్రమే కాదు.. అక్కడికి వెళ్లి ఆ దేవుడి ఆశీసులు తీసుకునే గొప్ప అవకాశం దక్కింది. భారతదేశ చరిత్రలోని గొప్ప క్షణంలో భాగమయ్యే వరం. ఆహ్వానం అందించినందుకు ధన్యవాదాలు. జై శ్రీరాం’’ అని వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
అదే విధంగా.. రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన సందర్భంగా.. తాను ఆహ్వానం అందుకుంటున్న ఫొటోను ఇందుకు జతచేశాడు. కాగా టీమిండియా తరఫున 33 టెస్టులు, 161 వన్డేలు ఆడిన కర్ణాటక బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 96, 196 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: కెప్టెన్‌గా అజింక్య రహానే.. పృథ్వీ షాకు నో ఛాన్స్.. కారణమిదే
It was a hope and a desire, that in my lifetime Ram Mandir consecration happens.
— Venkatesh Prasad (@venkateshprasad) January 2, 2024
And what a moment, not only is the consecration happening on 22nd January, but have the great fortune and blessings to be able to attend India’s greatest moment in my lifetime.
Thank you for the… pic.twitter.com/Sq1bjEZUxE
Comments
Please login to add a commentAdd a comment