అయోధ్యకు చేరుకున్న ‘హనుమంతుడు’.. | Ayodhya Ram Mandir Pran Pratishtha, Hanuman Special Rath Reached Kishkindha To Ayodhya, Details Inside - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న ‘హనుమంతుడు’..

Published Thu, Jan 18 2024 11:34 AM | Last Updated on Sat, Jan 20 2024 5:08 PM

Hanuman Special Rath Reached Kishkindha to Ayodhya - Sakshi

అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో అయోధ్యలో  భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇదిలావుండగా హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధ నుండి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది అలాగే ప్రపంచం నలుమూలల నుండి అయోధ్యకు విలువైన కానుకలు చేరుతున్నాయి. ఈ రథం మూడేళ్లుగా దేశమంతటా తిరుగుతోంది. ఈ ప్రత్యేక రథం సీతామాత జన్మస్థలమైన బీహార్‌లోని సీతామర్హి గుండా అయోధ్యకు  చేరుకుంది. 

ఈ రథంతోపాటు పర్యటనలు సాగిస్తున్న స్వామి గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న తరహాలోనే కిష్కింధలో కూడా   హనుమంతుని ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. శ్రీరాముని భక్తుడైన హనుమంతుని రాకకు చిహ్నంగా ఈ రథాన్ని అయోధ్యకు తీసుకువచ్చారు. ఈ రథం ద్వారా రామభక్తిని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. ఈ రథాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కిష్కింధ ప్రాంతం కర్ణాటకలోని కొప్పల్ విజయనగర జిల్లాలో ఉంది. ఇది తుంగభద్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న హంపి కంటే పురాతనమైన ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆనెగుండి అని పిలుస్తున్నారు. కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవుడు తన సలహాదారు హనుమంతుని సహాయంతో పరిపాలించాడు.

ఆనెగుండి గ్రామంలో రామాయణానికి సంబంధించిన పలు ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతమంతా రాళ్లు, పర్వతాలతో కూడి ఉంటుంది. రామాయణంలో ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన వినిపిస్తుంది. అనెగుండి గ్రామంలో పలు పురాతన గుహలు కూడా కనిపించాయి. ఇక్కడి రాళ్లపై కోతుల చిత్రాలను కనుగొన్నారు.
ఇది కూడా చదవండి:  రామ్‌లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement