అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక, ఆలయ నిర్మాణం ఎంతో సంతృప్తికరంగా సాగుతున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర తెలిపింది. ఇక, అయోధ్యలో వచ్చే ఏడాది జనవరిలో భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధమవుతుందని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. రామ మందిరం కోసం గంటను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మందిరంలోకి అష్టధాతువుతో తయారు చేసిన 2,100 కిలోల గంటను తయారు చేశారు. 6' X 5' పొడువు, వెడెల్పుతో ఉన్న గంటను మందిరంలో ప్రతిష్టించేందుకు ట్యూటికోరిన్ నుంచి అయోధ్యకు తీసుకువెళ్తున్నారు. కాగా, ఈ గంట స్పెషాలిటీ ఎంటంటే.. ఒక్కసారిగా బెల్‌ను వాయిస్తే గంట శబ్ధం దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందట. ఇక, గంటను జేసీబీ సాయంతో అయోధ్యకు తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The 2100 kgs and 6’ X 5’ Bell made of "Ashtadhatu" for Ram Mandir enroute Ayodhya from tuticorin.
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 16, 2023
This Bell can be heard upto 15 kms. pic.twitter.com/6A0rtj3lPj
Comments
Please login to add a commentAdd a comment