అది నిజంగా సిగ్గుచేటు.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేపై టీమిండియా లెజెండ్‌ ఫైర్‌ | Absolute Shamelessness: Venkatesh Prasad | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: అది నిజంగా సిగ్గుచేటు.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేపై టీమిండియా లెజెండ్‌ ఫైర్‌

Published Sun, Sep 10 2023 10:32 AM | Last Updated on Sun, Sep 10 2023 11:19 AM

Absolute Shamelessness: Venkatesh Prasad - Sakshi

ఆసియాకప్‌-2023లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. సూపర్‌-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్‌-పాక​్‌ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్‌డే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా సూపర్‌-లో మిగితా మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్‌డేను ఏసీసీ కేటాయించలేదు.

ఈ నేపథ్యంలో కేవలం భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మాత్రమే రిజర్వ్‌ డేను పెట్టడాన్ని భారత మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ తప్పుబట్టాడు. ఈ నిర్ణయం తీసుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై వెంకటేశ్‌ ప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం నిజంగా సిగ్గు చేటు. నిర్వాహకులు ఈ టోర్నీని అపహస్యం చేశారు.

ఇతర రెండు జట్లకు వేర్వేరు నిబంధనలతో టోర్నమెంట్ నిర్వహించడం అనైతికం.  అన్ని జట్లకు ఒకే రూల్‌, ఒకే న్యాయం ఉండాలి. షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ జరిగితే జరిగింది లేకపోతే ఆ రోజే రద్దు చేయాలి. అంతేగాని ఈ పనికిమాలిన నిర్ణయాలు ఎందుకు?  రెండో రోజైన రిజర్వ్ డేలో కూడా వర్షం పడితే ఏం చేస్తారు?

ఇటువంటి దురుద్దేశపూరితమైన ప్లాన్స్‌ విజయవంతం కావు" అని ట్విటర్‌(ఎక్స్‌)లో వెంకటేశ్‌ ప్రసాద్‌ రాసుకొచ్చాడు. కాగా అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చండికా హతురుసింఘ ఏసీసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మాత్రం  రిజర్వ్ డే ఉండటం సరైన నిర్ణయం కాదని హతురుసింఘ అన్నాడు.
చదవండిODI World cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement