పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో జట్టులోని మిగితా ఆటగాళ్లకు విభేధాలు తలెత్తున్నట్లు సమాచారం. ఆసియాకప్-2023 లీగ్ దశలో అదరగొట్టిన పాకిస్తాన్.. సూపర్-4లో ఓటమి పాలై టోర్నీ అనుహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ టోర్నీ అంతటా కెప్టెన్‌గా బాబర్ ఆజం తీసుకున్న నిర్ణయాలపై కొంతమంది ఆటగాళ్ళు ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి.
అదేవిధంగా పాకిస్తాన్ డ్రెసింగ్ రూమ్‌లో రెండు వర్గాలు ఉన్నాయని, కొంతమంది ఆటగాళ్ళు బాబర్ ఆజం నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా బాబర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా బాబర్ ఆజంపై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా కీలక వాఖ్యలు చేశాడు. "ఫీల్డ్‌లో బాబర్ ఆజంతో అంత ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అతడు మైదానంలో పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ ఆఫ్‌ది ఫీల్డ్ మాత్రం అతడితో మేము మంచిగా ఎంజాయ్ చేస్తామని షాదాబ్ పేర్కొన్నాడు.
షాదాబ్ ఖాన్‌పై వేటు..
కాగా బాబర్‌పై షాదాబ్ బహిరంగంగా చేసిన వాఖ్యలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్సీ పదవి నుంచి షాదాబ్‌ను తప్పించాలని పీసీబీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న పీసీబీ బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియోన్యూస్ తమ రిపోర్టులో వెల్లడించింది.
చదవండి: Asia Cup 2023: 'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
Comments
Please login to add a commentAdd a comment