ఆసియాకప్-2023లో పాకిస్తాన్ తొలి ఓటమి చవిచూసింది. సూపర్-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పాకిస్తాన్ విఫలమైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దాటికి పాకిస్తాన్ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ 5 వికెట్లు పడగొట్టాడు.
పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మ్యాచ్ అనంతరం స్పందించాడు. "వాతావరణ పరిస్ధితుల్లో మా చేతుల్లో లేవు. మేము మా వంతు ప్రయత్నం చేశాము. అయితే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలమయ్యాం. మా బౌలర్లను ఎదుర్కోవడానికి భారత ఓపెనర్లు ముందే ప్రణాళికలను రచించుకున్నారు. వారు అద్భుతైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత విరాట్, రాహుల్ మంచి స్కోర్‌ను జట్టుకు అందించారు.
అదే విధంగా బౌలింగ్‌లో కూడా జస్ప్రీత్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మొదటి 10 ఓవర్లలో బాగా బౌలింగ్ చేసి బంతిని రెండు వైపులా స్వింగ్ చేసారు. మా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. మా తర్వాతి మ్యాచ్‌లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బాబర్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: Asia Cup 2023: ఇదేమి బంతిరా బాబు.. దెబ్బకు బాబర్ ఆజం ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment