ఆగస్టు 5 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | birthday celebration on August 5 Celebrities | Sakshi
Sakshi News home page

ఆగస్టు 5 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Tue, Aug 4 2015 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

ఆగస్టు  5 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఆగస్టు 5 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
కాజోల్ (నటి), వెంకటేశ్ ప్రసాద్ (మాజీ క్రికెటర్)

 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువు బృహస్పతికి చెందిన సంఖ్య. దీనివల్ల వీరికి సహజంగానే విద్య, వినయం, వాక్చాతుర్యం అలవ డి, అందరితోటీ మంచివారిగా మన్ననలందుకుంటారు. వీరు పుట్టిన తేదీ 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య. గురు, బుధుల కలయిక వల్ల ఈ సంవత్సరం విద్యార్థులు చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షలలో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. 30 సంవత్సరాలు దాటిన వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంగీతం, నాట్యం వంటి లలిత కళలను నేర్చుకోవాలన్న కోరిక కలిగి, వాటిని అభ్యసించడం వల్ల సంఘగౌరవం లభిస్తుంది.

సృజనాత్మక, మీడియా రంగాలలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతో వారి వారి రంగాలలో కొత్త ఉరవడిని సృష్టించగలుగుతారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. వీరికి చర్మవ్యాధులు, నరాల సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,3,5,9; లక్కీ కలర్స్: గ్రీన్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, మార్చి, మే, జులై, నవంబర్; లక్కీ డేస్: ఆది, మంగళ, బుధ, గురువారాలు. సూచనలు:దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను సన్మానించడం, వేదపాఠశాలలకు, మిషనరీలకు, మదరసాలకు సాయం చేయడంమంచిది.                     - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement