‘ఎప్పటికి నువ్వే నా హృదయ స్పందన’ | Kajol Tweet Emotional Note For Daughter Nysa On Her 16th Birthday | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న కాజోల్‌ ట్వీట్‌

Published Sat, Apr 20 2019 2:59 PM | Last Updated on Sat, Apr 20 2019 3:02 PM

Kajol Tweet Emotional Note For Daughter Nysa On Her 16th Birthday - Sakshi

కాజోల్‌ - అజయ్‌ దేవగణ్‌ల గారాల తనయ నైసా నేటితో 16వ ఏట అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా కూతుర్ని ఉద్దేశిస్తూ కాజోల్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నా ప్రియమైన కూతురికి.. 16వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న మధురమైన క్షణాల్ని.. అప్పటి నీ బరువును నేను ఎన్నటికి మర్చిపోలేను. ఎంత ఎదిగినా నువ్వే నా హృదయ స్పందన’ అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు కాజోల్‌. దాంతో పాటు కూతురుతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్‌ చేశారు.

ప్రస్తుతం నైసా విద్యాభ్యాసం నిమిత్తం సింగపూర్‌లో ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం నైసా పేరు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్‌ అయ్యింది. నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ని తెగ ట్రోల్‌ చేశారు. ఈ విషయం గురించి అజయ్‌ దేవగణ్‌ మాట్లాడుతూ.. ‘తొలుత ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు నైసా చాలా బాధపడేది. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేసింది. ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కొవాలో తనకు ఇప్పుడు బాగా తెలిసింది. కొందరు పని పాటలేని వారు ప్రతిదాన్ని జడ్జ్‌ చేస్తూంటారనే విషయాన్ని తాను గ్రహించింది. ఇక అప్పటి నుంచి వాటిని పట్టించుకోవడం మానేసింద’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement