
టాలీవుడ్ హీరో వెంకటేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో వెంకటేశ్‌కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియంలో అలా వాలిపోతారు. ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు మద్దతుగా ఉంటారు.
కాగా.. వెంకటేశ్ కొత్త ఏడాదిలో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది.
Happy Birthday Hitman @ImRo45!
Have an amazing one 🤗 pic.twitter.com/TF7Kv2qfwR— Venkatesh Daggubati (@VenkyMama) April 30, 2024