nysa
-
Nysa Devgan Latest Photos: కాజోల్ కూతుర్ని చూశారా? హీరోయిన్ కన్నా తక్కువేం కాదు (ఫోటోలు)
-
తప్పతాగిన స్టార్ హీరో కూతురు.. నెటిజన్ల దారుణ ట్రోల్స్
బాలీవుడ్ సెలబ్రిటీలు వారాంతం వచ్చిందంటే ఎంజాయ్ చేయడం మామూలే. పబ్‌లు, నైట్ పార్టీలకు కొదవే లేదు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుల పిల్లలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సుహానా ఖాన్, ఖుషి కపూర్ ఓ పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ దేవగణ్ కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో ముంబైలో పార్టీకి వెళ్లిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఎందుకంటే వారిద్దరూ వీడియోలో తప్పతాగి కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్కిడ్లు కూడా పార్టీలో కనిపించారు. నైసా దేవగణ్, ఓర్రీ చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ తప్ప తాగి ఉన్నారంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఓ నెటిజన్ తల్లిదండ్రులు కష్టపడి పేరు సంపాదిస్తే.. వారి పిల్లలు వాటిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నెటిజన్ నైసా దేవగణ్ ఫుల్‌గా తాగి ఉందంటూ పేర్కొన్నాడు. దుస్తులు, మేకప్, ఓపెన్ హెయిర్, బోల్డ్ మేకప్‌తో ఆమె తన రూపాన్ని మార్చేసిందని కామెంట్స్ చేశారు .నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా ఉన్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన కనికా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్లో బాలీవుడ్ స్టార్ కిడ్ సందడి చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ ముద్దుల తనయ నైసా దేవగన్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైంది. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొన్న నైసా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బాడీకాన్ పింగ్ డ్రెస్‌లో లైట్ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్, తండ్రి అజయ్ దేవగన్‌లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్‌లో డిగ్రీ చదువుతోంది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry1) -
ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ?
Unknown Facts About Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల విడుదలైన దర్శక ధీరుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి రన్‌వే 34 సినిమాలో అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. 1969, ఏప్రిల్ 2న జన్మించిన అజయ్ దేవగణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్ సినీ తారలు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే 53వ పడిలోకి అడుగు పెడుతున్న ఈ బాలీవుడ్ హీరో 5 రహస్యాలు ఏంటో తెలుసుకుందామా ! 1. ట్రావెలర్ అజయ్ దేవగణ్ మంచి నటుడే కాకుండా ట్రావెల్ లవర్ కూడా. అతని కుటుంబంతో ప్రయాణించడం కంటే ఆయనకు ఏది గొప్ప ఆనందాన్ని ఇవ్వదట. అజయ్ తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, ఇద్దరు సోదరీమణులు, వారి భర్తలు, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తుంటాడని సమాచారం. సెలవుల్లో 25 మంది కుటుంబ సభ్యుల బృందం కలిసి టూర్‌కు వెళ్తాడట. ఇందుకోసం బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి స్టే చేసేందుకు సాధ్యమైతే ఏకంగా ఒక ఐలాండ్నే బుక్ చేస్తాడని సమాచారం. 2. శివ భక్తుడు అజయ్ దేవగణ్ గొప్ప శివ భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని ఛాతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన 'శివాయ్' మూవీని శివుడికి అంకితం ఇచ్చాడు. 3. టాలెంటెడ్ కుక్ అద్భుతంగా వండటంలోనూ అజయ్ దేవగణ్ సిద్ధహస్తుడు. భారతీయ, కాంటినెంటల్ డిషెస్‌ను సూపర్‌గా చేయగలడని టాక్. 4. కుటుంబమంటే అమితమైన ప్రేమ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టే అజయ్ దేవగణ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఆయనకు మొదటగా పుట్టిన కూతురు నైసా.. అజయ్ దేవగణ్ బలహీనత. కనీసం రోజులో కొన్నిసార్లు అయినా ఆమెతో మాట్లాడలేకపోతే అజయ్‌కు రోజు గడవదట. అలాగే కుమారుడు యుగ్ అన్న అజయ్‌కి అమితమైన ప్రేమ. 5. పోలో గ్రీన్ కొలోన్ అంటే ఇష్టం అజయ్ దేవగణ్ గత మూడు దశాబ్దాలుగా రాల్ఫ్ లారెన్ తయారు చేసిన పోలో గ్రీన్ అనే కొలోన్నే ధరిస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. -
స్టార్ హీరో కూతురు అదిరే స్టెప్లు చూశారా!
సాక్షి, ముంబై: బాలీవుడ్ ‘సింగం’ అజయ్ దేవగణ్-కాజోల్ దంపతుల గారాల పట్టి నైసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నైసా తన స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నైసా తన ఇద్దరు స్నేహితులకు సులభంగా డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో నేర్పిస్తుంది. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే అనేకమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా ‘డ్యాన్స్ మెలుకువలు నేర్పుతూ ఎంతైనా నటుడి కుమార్తె అనిపించుకుంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్) కాగా నైసా స్టార్ సెలబ్రిటీ కూతురు అయినప్పటికీ ఆమె చాలా సాధారణంగా ఉంటారు. ఇతర సెలబ్రిటీల్లా లాగా సోషల్ మీడియాలో కూడా ఎక్కవ కనిపించరు. తన విషయాలు, ఫోటోలు అందరికి కనిపించకుండా గోప్యంగా ఉంచుతారు. ఇక కాజోల్, అజయ్ దేవగణ్ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2003లో కూతురు నైసా, 2010లో కుమారుడు యుగ్ దేవగణ్ జన్మించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో నెపోటిజంపై చర్చలు, స్టార్ కిడ్స్ పై ట్రోలింగ్ చర్చ సందర్భంగా నైసా దేవగణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘.స్టార్ హీరోల పిల్లలగా ఉండటం స్టార్డమ్ తో పాటు ఒక్కోసారి ఇబ్బందులు తెస్తాయి. తాము ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు సమాజంలో చాలా మంది ఉంటార’ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. (చదవండి: క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్ సింగర్) View this post on Instagram oh @nysadevgan girl hmu and I’ll teach u how to twerk...for free! • #nysadevgan A post shared by ♡ (@nysadevganx) on Nov 11, 2020 at 10:34am PST -
'సంపాదన' ఆడవాళ్ల పని కూడా
బాలీవుడ్ నటి కాజోల్ కూతురు నైసా. పదహారేళ్లు. కొడుకు యుగ్. తొమ్మిదేళ్లు. ఇక చూడండి. ఈ ఏజ్ పిల్లలు ఇంట్లో ఉంటే.. అదీ అక్కా తమ్ముడో, అన్నా చెల్లెలో అయి ఉంటే.. ఇంట్లో ప్రతి క్షణమూ ఒక కోర్టు సీనే. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తల్లే న్యాయమూర్తి. తండ్రి.. కేసు వదిలేసుకున్న జడ్జిలా మౌనంగా బయటికి వెళ్లిపోతాడు. కాజోల్ ఇంట్లో తమ్ముడి మీద అక్క ఫిర్యాదులు తక్కువే. అక్కను ఏదో ఒకటి అని విసిగించడం మాత్రం తమ్ముడికి డైలీ రొటీన్. ‘అక్కరా.. నీకన్నా పెద్దదిరా..’ అన్నా.. వింటాడా యుగ్! ‘ఆడవాళ్లు ఆడవాళ్లలా ఉండాలి’ అంటాడు! ‘ఆడా మగా ఏంట్రా.. అక్క చేసే పనులన్నీ నువ్వూ చెయ్యాల్సిందే’ అంటారు కాజోల్. అంతే.. ముఖం మాడ్చుకుని వెళ్లిపోతాడు. కాజోల్ నిన్న ఒక ఇంటర్వ్యూలో.. ఈ సంగతే చెప్తూ.. ఇంటి పని ఎలాగైతే ఆడవాళ్ల పని మాత్రమే కాదో, అలాగే బయటికి వెళ్లి సంపాదించడం కేవలం మగాళ్ల పని మాత్రమే కాదు’ అన్నారు. పేరెంట్స్ ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే.. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం దానంతట అదే వచ్చేస్తుందని అని కూడా చెప్పారు. -
బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తే చంపేస్తాడు: కాజోల్
సాధారణంగా అబ్బాయిలు తల్లికి అతుక్కుపోతే అమ్మాయిలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవ్గన్, కాజోల్ జోడీ విషయంలో ఇది కాస్త తారుమారైనట్టు కనిపిస్తోంది. తాజాగా కాజోల్ ఓ షోలో మాట్లాడుతూ.. తన పదహారేళ్ల కూతురు నైసా ఏ విషయాన్నైనా తనతో చెప్పుకోడానికే ఇష్టపడుతుందని తెలిపింది. తనకు ఎదురయ్యే సమస్యలను కానీ, బాయ్‌ఫ్రెండ్స్ గురించి కానీ తండ్రి దగ్గర అసలు ప్రస్తావించదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ మరుక్షణమే అజయ్ తుపాకీ పట్టుకుని బయలుదేరుతాడంది. కొడుకు యగ్ మాత్రం చిన్న సలహాకైనా తండ్రి దగ్గరికే పరుగెత్తుకెళ్తాడని పేర్కొంది. అజయ్ ఆవేశపడుతాడు కానీ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడంది. ఇక పేరెంటింగ్ గురించి మాట్లాడుతూ తాను పిల్లలను ఎప్పుడూ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూడలేదని, ఓ పరిధి మేరకు వారే స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తానంది. కాగా ‘గూండా రాజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో అజయ్ దేవ్గన్, కాజోల్ మధ్య ప్రేమ చిగురించగా 1999లో ఫిబ్రవరి 24న పెళ్లిబంధంతో వాళ్లిద్దరూ ఒక్కటైన విషయం తెలిసిందే. -
వారంతా పనీపాటా లేనివారే
పనీపాటా లేక ఖాళీగా ఉన్న వారే చెత్త వాగుడు వాగుతారు. అలాంటి వాటిని నేను కానీ నా కూతురు కానీ పట్టించుకోం అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. కాజోల్ - అజయ్ దేవగన్‌ల కూతురు నైసా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి పాపులారిటీ మాత్ర విపరీతంగా ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వార్తలు ఇంటర్నెట్లో తెగ వైరలవుతుంటాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుంటారు. విమర్శలు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కూతరురిపై వచ్చే విమర్శలపై స్పందించారు అజయ్ దేవగణ్. ‘ఇలాంటి పనులు చేసే వారికి బుర్ర ఉండదు. పనీపాటా లేక ఖాళీగా ఉండి ఇలాంటి కామెంట్లు చేస్తుంటారు. అది కూడా నకిలీ ఖాతాల నుంచి. ఇలాంటి పిరికి వారి మాటలను నేను కానీ.. నా కూతురు కానీ పట్టించుకోం. వాటికి అసలు ప్రాధాన్యమే ఇవ్వం’ అని తెలిపారు. అంతేకాక తమ పిల్లలు చాలా చిన్నవారని.. ప్రస్తుతం చదువు గురించి తప్ప వారికి మరే ఇతర ఆలోచనలు లేవని వెల్లడించారు అజయ్. ఒక వేళ వారు సినిమాలోకి రావాలనుకుంటే.. అది వారి ఇష్టమని.. తన బలవంతం ఏం ఉండదని స్పష్టం చేశారు. ‘ఈ కాలం పిల్లలు అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఇంటర్నెట్, టీవీల ద్వారా వారికి సంబంధించిన అన్ని విషయాల గురించి చాలా సులభంగా తెలుసుకుంటున్నారు. టెక్నాలజీని వాడటంలో కూడా వారు చాలా ముందన్నారు. ఎప్పుడైనా నా ఫోన్ సరిగా పని చేయకపోతే.. నా కొడుకు యగ్ దగ్గరకు తీసుకెళ్తాను. వాడు చాలా సులభంగా దాన్ని రిపేర్ చేస్తాడు’ అని తెలిపారు అజయ్ దేవగన్. -
‘ఎప్పటికి నువ్వే నా హృదయ స్పందన’
కాజోల్ - అజయ్ దేవగణ్‌ల గారాల తనయ నైసా నేటితో 16వ ఏట అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా కూతుర్ని ఉద్దేశిస్తూ కాజోల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నా ప్రియమైన కూతురికి.. 16వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న మధురమైన క్షణాల్ని.. అప్పటి నీ బరువును నేను ఎన్నటికి మర్చిపోలేను. ఎంత ఎదిగినా నువ్వే నా హృదయ స్పందన’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు కాజోల్. దాంతో పాటు కూతురుతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. Happy 16th birthday to my sweet sweet baby. I still feel the weight of you in my arms and I don't think that will ever change. However old you grow know that you will always be my heartbeat. ❤always pic.twitter.com/oalYwv2ok8 — Kajol (@KajolAtUN) April 20, 2019 ప్రస్తుతం నైసా విద్యాభ్యాసం నిమిత్తం సింగపూర్‌లో ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం నైసా పేరు ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అయ్యింది. నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ని తెగ ట్రోల్ చేశారు. ఈ విషయం గురించి అజయ్ దేవగణ్ మాట్లాడుతూ.. ‘తొలుత ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు నైసా చాలా బాధపడేది. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేసింది. ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కొవాలో తనకు ఇప్పుడు బాగా తెలిసింది. కొందరు పని పాటలేని వారు ప్రతిదాన్ని జడ్జ్ చేస్తూంటారనే విషయాన్ని తాను గ్రహించింది. ఇక అప్పటి నుంచి వాటిని పట్టించుకోవడం మానేసింద’ని తెలిపారు. -
కూతురికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ కపుల్
బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవగన్, కాజోల్‌లు తమ కూతురు నీసా దేవగన్‌ను కాస్ట్లీ గిప్ట్‌తో సర్ప్రైజ్ చేశారు. కొంత కాలంగా ఉన్నత చదువుల కోసం సింగపూర్‌లో ఉంటున్న నీసాకు ఓ లగ్జరీ ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం సింగపూర్‌లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్‌లో చదువుతోంది నీసా. ఆమె కోసం సింగపూర్‌లోని కాస్ట్లీ ఏరియా ఆర్చర్డ్ రోడ్లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నారు అజయ్, కాజోల్. ప్రస్తుతం చదువుతున్న కాలేజ్‌లో బోర్డింగ్ ఫెసిలిటీ ఉన్నా తమ కూతురు సొంత అపార్ట్మెంట్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. వచ్చే ఏడాది జనవరిలో నీసా అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ కానుంది. -
కాజోల్కు అన్ని గట్స్ లేవు
బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవ్గన్, అద్భుతమైన నటన పనితీరును కనబరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటనకు వంకలు కూడా పెట్టక్కర్లేదు. కానీ అజయ్ నటనను కూడా విమర్శించే వారు ఒకరున్నారట. ఎవరో తెలుసా? ఆమెనే నైసా. తన కూతురు నైసానే తనకు పెద్ద విమర్శకురాలంటూ డీఎన్ఏ ఇంటర్వ్యూలో అజయ్ తెలిపారు. ఇదే సమయంలో భార్య కాజోల్‌పై ఛలోక్తులు కూడా విసిరారు. తన సినిమాలను విమర్శించేంత గట్స్ కాజోల్కు లేవంటూ చెప్పుకొచ్చారు. ''కాజోల్కు నా సినిమాలను విమర్శించేంత గట్స్ లేవు. కానీ నా కూతురు నైసాకు ఉన్నాయి. నైసానే నాకు పెద్ద విమర్శకురాలు. నైసా నన్ను అసలు విడిచిపెట్టదు'' అంటూ అజయ్ కూతురు నైసా గురించి ముచ్చటించారు. ప్రస్తుతం నైసా సింగపూర్‌లోని ఆగ్నేయాసియాలో యూనిటెడ్ కాలేజీలో చదువుకుంటోంది. అజయ్ దేవ్గన్ కూడా ప్రస్తుతం రాజ్‌కుమార్ గుప్తా రైడ్‌లో నటించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 16న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో ఇలియానా డి క్రజ్ కూడా ముఖ్య పాత్రలో నటించింది. -
ఎక్స్‌ట్రాలెందుకు? కాజోల్కు కూతురు కౌంటర్
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్‌పై ఆమె కూతురు కౌంటర్లు వేస్తోంది. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రమ్లో వివిధ హావభావాలతో కూడిన ఫొటోను కాజోల్ పెట్టినందుకు తన 13 ఏళ్ల కూతురు నిసా కామెంట్ చేసింది. ‘మామ్.. ఎందుకు నువ్వు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు? అంటూ తన ఫొటోకు కామెంట్‌పెట్టి కాజోల్‌ను అవాక్కయ్యేలా చేసింది. అయితే, నిసా ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు తల్లి ఫొటోకు ప్రతిస్పందనగా పెట్టింది. కాజోల్ (42), అజయ్ దేవగన్ (47) 1999లో వివాహం చేసుకున్నారు. వారికి నిసా(13), యుగ్ అనే ఆరేళ్ల బాబు ఉన్నారు. నిసా తల్లితో చాలా చనువుగా ఉంటుంది. ఈ మధ్య తన ఇద్దరు పిల్లలను చూస్తు సంబరాల్లో మునిగిన సమయంలో తన మొఖంలో ఏర్పడిన హావభావాలతో కూడిన ఫొటోను ఇన్ స్టాగ్రమ్లో పెట్టింది. అందులో ట్యాగ్‌లైన్‌గా నా పిల్లలను జతగా చూసినప్పుడు.. అంటూ పెట్టింది. దీనికే పై విధంగా నిసా బదులిచ్చింది. గతంలో కాజల్ దివాళీ పండుగకు సంబంధించిన తన ఫొటో ఒకటి పెట్టినప్పుడు కూడా నిసా ఇలాగే స్పందించి ‘ఇదేం ఫొటో.. నాకు చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది’ అంటూ కామెంట్ పెట్టి అందరినీ ఆకర్షించింది. అయితే, తల్లికూతుర్ల మధ్య చనువుకొద్దే తనలా స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేయగలుగుతుందని ఆమె మురిసిపోతుందట.