ఎక్స్‌ట్రాలెందుకు? కాజోల్‌కు కూతురు కౌంటర్‌ | Kajol Trolled By Daughter Nysa on Instagram not only now | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రాలెందుకు? కాజోల్‌కు కూతురు కౌంటర్‌

Published Wed, Feb 1 2017 4:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

Kajol Trolled By Daughter Nysa on Instagram not only now

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌పై ఆమె కూతురు కౌంటర్లు వేస్తోంది. సోషల్‌ మీడియా ఇన్‌ స్టాగ్రమ్‌లో వివిధ హావభావాలతో కూడిన ఫొటోను కాజోల్‌ పెట్టినందుకు తన 13 ఏళ్ల కూతురు నిసా కామెంట్‌ చేసింది. ‘మామ్‌.. ఎందుకు నువ్వు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు? అంటూ తన ఫొటోకు కామెంట్‌పెట్టి కాజోల్‌ను అవాక్కయ్యేలా చేసింది. అయితే, నిసా ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి షాకింగ్‌ వ్యాఖ్యలు తల్లి ఫొటోకు ప్రతిస్పందనగా పెట్టింది. కాజోల్‌ (42), అజయ్‌ దేవగన్‌ (47) 1999లో వివాహం చేసుకున్నారు. వారికి నిసా(13), యుగ్ అనే ఆరేళ్ల బాబు ఉన్నారు.

నిసా తల్లితో చాలా చనువుగా ఉంటుంది. ఈ మధ్య తన ఇద్దరు పిల్లలను చూస్తు సంబరాల్లో మునిగిన సమయంలో తన మొఖంలో ఏర్పడిన హావభావాలతో కూడిన ఫొటోను ఇన్‌ స్టాగ్రమ్‌లో పెట్టింది. అందులో ట్యాగ్‌లైన్‌గా నా పిల్లలను జతగా చూసినప్పుడు.. అంటూ పెట్టింది. దీనికే పై విధంగా నిసా బదులిచ్చింది. గతంలో కాజల్‌ దివాళీ పండుగకు సంబంధించిన తన ఫొటో ఒకటి పెట్టినప్పుడు కూడా నిసా ఇలాగే స్పందించి ‘ఇదేం ఫొటో.. నాకు చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది’ అంటూ కామెంట్ పెట్టి అందరినీ ఆకర్షించింది. అయితే, తల్లికూతుర్ల మధ్య చనువుకొద్దే తనలా స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేయగలుగుతుందని ఆమె మురిసిపోతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement