'సంపాదన' ఆడవాళ్ల పని కూడా | Kajol Shares Her Daughter Nysa And Son Yug Home Fight Story | Sakshi
Sakshi News home page

'సంపాదన' ఆడవాళ్ల పని కూడా

Mar 18 2020 8:29 AM | Updated on Mar 18 2020 8:29 AM

Kajol Shares Her Daughter Nysa And Son Yug Home Fight Story - Sakshi

నటి కాజోల్‌

బాలీవుడ్‌ నటి కాజోల్‌ కూతురు నైసా. పదహారేళ్లు. కొడుకు యుగ్‌. తొమ్మిదేళ్లు. ఇక చూడండి. ఈ ఏజ్‌ పిల్లలు ఇంట్లో ఉంటే.. అదీ అక్కా తమ్ముడో, అన్నా చెల్లెలో అయి ఉంటే.. ఇంట్లో ప్రతి క్షణమూ ఒక కోర్టు సీనే. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తల్లే న్యాయమూర్తి. తండ్రి.. కేసు వదిలేసుకున్న జడ్జిలా మౌనంగా బయటికి వెళ్లిపోతాడు. కాజోల్‌ ఇంట్లో తమ్ముడి మీద అక్క ఫిర్యాదులు తక్కువే. అక్కను ఏదో ఒకటి అని విసిగించడం మాత్రం తమ్ముడికి డైలీ రొటీన్‌. ‘అక్కరా.. నీకన్నా పెద్దదిరా..’ అన్నా.. వింటాడా యుగ్‌! ‘ఆడవాళ్లు ఆడవాళ్లలా ఉండాలి’ అంటాడు! ‘ఆడా మగా ఏంట్రా.. అక్క చేసే పనులన్నీ నువ్వూ చెయ్యాల్సిందే’ అంటారు కాజోల్‌. అంతే.. ముఖం మాడ్చుకుని వెళ్లిపోతాడు. కాజోల్‌ నిన్న ఒక ఇంటర్వ్యూలో.. ఈ సంగతే చెప్తూ.. ఇంటి పని ఎలాగైతే ఆడవాళ్ల పని మాత్రమే కాదో, అలాగే బయటికి వెళ్లి సంపాదించడం కేవలం మగాళ్ల పని మాత్రమే కాదు’ అన్నారు. పేరెంట్స్‌ ఈ విషయం పిల్లలకు  అర్థమయ్యేలా చెప్పగలిగితే.. సమాజంలో  స్త్రీ పురుష సమానత్వం దానంతట అదే వచ్చేస్తుందని అని కూడా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement