working
-
పని గంటలా..? పని నాణ్యతా..?
పని గంటలపై ప్రముఖులు స్పందిస్తుండడంతో దీనిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ముకేశ్ అంబానీ తనయుడు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ అధిక పని గంటలపై తన అభిప్రాయం వెల్లడించారు. ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు.. చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలంటూ దాని గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. ఇటీవల ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఎల్అండ్టీ ఛైర్మన్ సుబ్రహ్మణియన్..వంటి ప్రముఖులు ఈ పని గంటలపై స్పందిస్తూ ఆఫీస్‌లో ఎక్కువసేపు పని చేయాలని చెప్పారు. పని గంటలు, పని నాణ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిపుణులు అందులోని విభిన్న అంశాలను విశ్లేషిస్తున్నారు.పని గంటలునిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తి: సరైన పని గంటలు ఉండడం వల్ల ఉద్యోగులు క్రమశిక్షణతో, ఫోకస్‌గా పని చేసేందుకు వీలవుతుంది. నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఉత్పాదకతకు దోహదం చేస్తుంది.సమన్వయం, సహకారం: టీమ్ సభ్యుల మధ్య సమన్వయం, సహకారాన్ని సులభతరం చేయడానికి పని గంటలు తోడ్పడుతాయి. అందరూ ఒకేసారి అందుబాటులో ఉన్నప్పుడు సమావేశాలను షెడ్యూల్ చేయడం, ప్రాజెక్టులను చర్చించడం, సమష్టి నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్: నిర్దిష్ట పని గంటలు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల మధ్య స్పష్టమైన సరిహద్దును సృష్టించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించడానికి కీలకం అవుతాయి.పని నాణ్యతక్లయింట్లు సంతృప్తి: పని నాణ్యతపై దృష్టి పెట్టడం వల్ల ఉద్యోగులు మెరుగైన ఫలితాలు అందించే అవకాశం ఉంది. దీనివల్ల క్లయింట్లు సంతృప్తి చెందుతారు.ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ: క్వాలిటీ ఆధారిత పని ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. కఠినమైన పనిగంటలకు పరిమితం కాని ఉద్యోగులు కొత్త ఆలోచనలు, విభిన్న విధానాలను అన్వేషించవచ్చు.ఉద్యోగుల సంతృప్తి: పనిలో నిత్యం అధిక నాణ్యమైన అవుట్‌పుట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు సంతృప్తి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఇది సానుకూల పని వాతావరణానికి దారితీస్తుంది.పని గంటలు, పని నాణ్యత ప్రాముఖ్యంఉత్పాదకత పెంచడానికి పని గంటలు, పని నాణ్యత రెండూ చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం కొన్ని విధానాలను సూచిస్తున్నారు.ఫ్లెక్సిబుల్ పని వేళలు: ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూళ్లలో పని చేసేందుకు వీలుగా ఉద్యోగులకు అవకాశం కల్పించాలి. దానివల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా అధిక నాణ్యత కలిగిన అవుట్ పుట్ వస్తుంది.అవుట్ పుట్‌పై దృష్టి: పని గంటల సంఖ్యకు బదులుగా అవుట్ పుట్ నాణ్యతపై దృష్టి కేంద్రీకరించాలి. అందుకోసం సంస్థలు స్పష్టమైన లక్ష్యాలు, అంచనాలను నిర్ణయించాలి. సహేతుకమైన కాలపరిమితిలో అధిక నాణ్యత పనిని అందిస్తే కలిగే ప్రయోజనాలను నొక్కి చెప్పాలి.విరామాలు: క్రమం తప్పకుండా విరామాలు, డౌన్‌టైమ్‌ను ప్రోత్సహించడం సృజనాత్మకతను పెంచుతుంది. కొంతమంది ఉద్యోగులు పని సమయాల్లో కాసేపు రిలాక్స్ అవ్వలనుకుంటారు. అలాంటివారికి రీఛార్జ్ అయ్యేందుకు కొంత సమయం ఇస్తే నాణ్యమైన అవుట్‌పుట్ అందించే అవకాశం ఉంటుంది.నైపుణ్యాలు అభివృద్ధి: ఉద్యోగులకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలను అందించాలి. దాంతో వారి పని నాణ్యత మెరుగుపడుతుంది. నిరంతర అభ్యాసం సృజనాత్మకతకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదనపని గంటలు, పని నాణ్యత రెండూ ముఖ్యమైనవే. అయినప్పటికీ ఒకదాని కంటే మరొకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అసమతుల్యతకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకుంటూ ఉద్యోగులు అధిక నాణ్యమైన పనిని అందించడానికి కృషి చేయాలి. -
పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..
ఎంత ఏఐ టెక్నాలజీ, చాటీజీపీటి వంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చినా కొన్ని విషయాల్లో సమాజం తీరు విశాలంగా ఉండటం లేదు. సమాన అవకాశాలు, లింగ సమానత్వం అంటారే గానీ వర్కింగ్ మహిళలు అమ్మగా మారాక ఇవ్వాల్సిన వెసులుబాటు అటుంచి కనీస మద్దతు లేకపోవడం బాధకరం. ఇంకా చాలామంది తల్లలు తమ చిన్నారులకు పాలిచ్చేందుకు జంకే పరిస్థితులే ఎదురవ్వుతున్నాయి. ముఖ్యంగా పనిచేసే తల్లలు ఆరునెలల మెటర్నీటి సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అలా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్రెస్ట్ పంపింగ్ మిషన్ల సాయంతో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పని ప్రదేశాల్లో సహ ఉద్యోగుల మద్దుతు గానీ అందుకోసం ప్రత్యేక ప్రదేశం గానీ అందుబాటు లేక విలవిలలాడుతున్నారు అతివలు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సైతం వెల్లడించింది. అలాంటి పరిస్థితులను కాబయే తల్లులు ఎలా అధిగమించాలి..? దీని గురించి నిపుణుల ఏమంటున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా.ప్రతిష్టాత్మకమైన BAFTA అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అందమైన డిజైనర్ వేర్‌తో సందడి చేసింది. ఓ పక్కన తల్లిగా తన బ్రెస్ట్ పంపింగ్ షెడ్యూల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఈవెంట్లో పాల్గొంది. ఆ విషయాన్నే రాధికా ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. పని ప్రేదేశంలో నాలాంటి కొత్త తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బుందులు పడుతుంటారు. అందులోనూ సినీ పరిశ్రమలో అస్సలు మద్దతు ఉండదు. కానీ నాకు సపోర్ట్ లభించడమే గాక హ్యపీగా తన రొమ్ము పాల పంపింగ్ షెడ్యూల్‌కి ఆటంకం లేకుండా ప్రముఖ మోడల్ నటాష తనకెంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా రాధికా వంటి వాళ్లకు కూడా పనిప్రదేశాల్లో ఇలాంటి సమయంలో ఇబ్బందుల తప్పవనే విషయం స్పష్టమవుతోంది. ఇక సామాన్య మహిళలైతే అంతకు మించి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందరో మహిళలు ఈ విషయమై ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నారు కూడా . నిపుణులు ఏమంటున్నారంటే..తల్లిపాలు సరఫరా-డిమాండ్ ప్రాతిపదికన పనిచేస్తుందని చెబుతున్నారు గైనకాలజీ నిపుణులు. కొత్త తల్లులకు పాలివ్వడం లేదా రొమ్ము పంపింగ్ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే దీని అర్థం పాలను టైం ప్రకారం పంపింగ్ లేదా ఫీడ్ చేస్తే శరీరం ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుందట, లేదంటే మానవ శరీరం తక్కువ పాలను ఉత్పత్తి చేయాలనే సంకేతాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా శిశువుకు దీర్ఘకాలం పాలను కొనసాగించే సామార్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలు..తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ కేన్సరలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట. అదీగాక తల్లిపాలు శిశువు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలు, యాంటీబాడీలు, ఎంజైమ్‌లు ఉంటాయి. తల్లిపాలను తాగే పిలలలకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయట. అలాగే తల్లి పాలిచ్చే సమయంలో శిశువుకి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, భావోద్వేగ సంబంధం భద్రతను అందిస్తుందట. ఉద్యోగినులు ఆరోగ్యాన్ని, పాల సరఫరాను కాపాడుకోవాలంటే..పని ప్రదేశాల్లో సహజంగా కొత్త తల్లులు ఇలాంటి విషయంలో అసౌకర్యంగా సిగ్గుగా ఫీలవ్వుతుంటారు. ముందు అలాంటి వాటిని పక్కన పెట్టి..విరామ సమయంలో పంపింగ్ సెషన్ ప్లాన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే గోప్యత కోసం కార్యాలయంలో సరైన సౌకర్యం లేదా ప్రదేశం గురించి కార్యాలయం యజమానులతో మాట్లాడండి. అసౌకర్యం ఏర్పడకుండా ఎవ్వరినీ లోపలకి రానివ్వకుండా చేసుకోండి. ముఖ్యంగా పాలను సరిగా నిల్వ చేయండి. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండేలా బాగా తినండి, తాగండి. అందుకోసం సహోద్యోగి, లేదా భాగస్వామి మద్దతు తోపాటు ఆఫీస్ హెడ్ సహాయం కూడా తీసుకోండి. ఆఫీస్ నిర్వాహకులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం ఇచ్చేలా లేదా వెసులబాలు కల్పించమని కోరండి.(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
సాఫ్ట్వేర్.. కేరాఫ్ హైదరాబాద్..
దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1990లో, దేశంలో తన మొదటి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుండి విండోస్ సృష్టికర్త, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన పాదముద్రను వేగంగా విస్తరిస్తోంది. నగరంతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, కోల్‌కతా, ముంబై, పూణేతో సహా 10 నగరాల్లో ఉన్నప్పటికీ.. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపుగా సగం మంది నగరంలోనే ఉండడం గమనార్హం. ఐటీ ఉద్యోగాలు, కార్యకలాపాలపైనే ఈ కథనం.. ఉద్యోగుల సంఖ్యలో మాత్రమే కాదు, హైదరాబాద్ చాలా కాలంగా మైక్రోసాఫ్ట్ ఇష్టపడే నగరంగా ముందంజలో ఉంది. నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రయాణం 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) స్థాపనతో ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికాకు ఆవల మైక్రోసాఫ్ట్‌కి ఉన్న అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రం ఏదంటే.. అది 54 ఎకరాలలో విస్తరించిన ఐడీసీ హైదరాబాద్ మాత్రమే. అడ్వాంటేజ్ తెలంగాణ ఒప్పందం.. తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ గత ఏడాది జరిగిన తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో అడ్వాంటేజ్ తెలంగాణను ప్రారంభిస్తూ అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రోగ్రామ్ 2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన విస్తరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు భారత పర్యటనలో భాగంగా ఇటీవలే హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ డెవలప్మెంట్తో సహా రాష్ట్ర సాంకేతిక ప్రాధాన్యతలపై చర్చించారు. ఏడాది వ్యవధిలో భారత్‌కు ఆయన రావడం ఇది వరుసగా రెండోసారి. దేశంలోని మొదటి మైక్రోసాఫ్ట్ తన ఓపెన్ ఏఐ కార్యాలయాన్ని కూడా నగరంలోనే ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.మేకగూడలోనూ మైక్రోసాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ తన మౌలిక సదుపాయాలను విస్తరించడానికి నగరాన్ని కేంద్రంగా మార్చుకుంది. దేశంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల నగరానికి సమీపంలోని మేకగూడలో 181.25 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గత సంవత్సరం, కూడా నగరంలో దాదాపు 267 కోట్ల రూపాయలతో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ ప్రదేశాల్లో కొత్త డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది.అనుకూల వాతావరణం.. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నగరంలో, పూణెలో నిర్వహిస్తున్న రెండు డేటా సెంటర్లలో ప్రస్తుతం 90 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2026 చివరి నాటికి ఈ సంఖ్య 289 మంది కావచ్చని సమాచారం. ‘హైదరాబాద్, పూణేలలో ఐటీకి మంచి మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధాన వాతావరణాలు ఉన్నాయి. అలాగే డేటా సెంటర్ పెట్టుబడులకు అనువుగా ఉండే టాలెంట్ కారిడార్లకు ఇవి సమీపంలో ఉన్నాయి’ అని అనరాక్లోని ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ డేటా సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవి శంకర్ అంటున్నారు. ఇటీవలి తన భారత పర్యటన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ బెంగళూరు హైదరాబాద్ కార్యకలాపాలు తమ కంపెనీకి బలం అని పేర్కొన్నారు. -
తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై మూర్తి వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో పని గంటలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.ప్రతి ఒక్కరూ వారంలో దాదాపు 70 గంటలపాటు పని చేయాలని నారాయణ మూర్తి గతంలో కామెంట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని తాజాగా అడిగిన ప్రశ్నలకు మూర్తి స్పందించారు. ‘నన్ను క్షమించండి. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నా తుదిశ్యాస వరకు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ వారంలో 100 గంటలపాటు పని చేస్తున్నారు. మనం కూడా కష్టపడి చేయడమే తనకు ఇచ్చే ప్రశంస. ఇది దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడంతో ఫలితం ఉండదు. వారంలో ఆరు రోజుల పని దినాలను ఐదు రోజులకు మార్చినప్పుడు తీవ్ర నిరాశ చెందాను. నా జీవితంలో చాలాకాలంపాటు రోజులో 14 గంటలు, వారంలో ఆరున్నర రోజులు పనిచేశాను. ఉదయం 6:30 గంటలకు కార్యాలయానికి చేరుకుని రాత్రి 8:40 గంటల వరకు పని చేసేవాడిని. కష్టపడి పనిచేసేతత్వం భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది’ అని అన్నారు.ఇదీ చదవండి: నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!ప్రపంచంలోనే అధికారికంగా వారంలో అధిక పని గంటలున్న దేశాలుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 52.6 గంటలు(సరాసరి)గాంబియా: 50.8 గంటలుభూటాన్: 50.7 గంటలులెసోతో: 49.8 గంటలుకాంగో: 48.6 గంటలుఖతార్: 48 గంటలుఇండియా: 47.7 గంటలుమౌరిటానియా: 47.5 గంటలులైబీరియా: 47.2 గంటలుబంగ్లాదేశ్: 46.9 గంటలు -
104 రోజుల డ్యూటీ.. ఒక్క రోజే లీవు!
బీజింగ్: ఏకంగా 104 రోజులపాటు డ్యూటీ చేసిన చైనా వాసి, మధ్యలో ఒక్కటంటే ఒక్క రోజే సెలవు తీసుకున్నాడు. ఆపై, తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆయన కుటుంబానికి పరిహారంగా రూ.48 లక్షలు చెల్లించాలంటూ సంస్థ యజమానిని కోర్టు ఆదేశించింది. జెఝియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ ప్రాంతానికి చెందిన ఎబావో (30) వృత్తిరీత్యా పెయింటర్. గతేడాది ఓ కంపెనీతో ఆయన కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఆ మేరకు ఫిబ్రవరి నుంచి మే వరకు ఎక్కడా విరామం లేకుండా పనిచేశాడు. మధ్యలో ఏప్రిల్ 6వ తేదీన మాత్రమే సెలవు తీసుకున్నాడు. మే 25వ తేదీ నుంచి ఎబావో ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మే 28వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జూన్ ఒకటో తేదీన మృతి చెందాడు. కుటుంబసభ్యులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. రోజుకు గరిష్టంగా 8 గంటల చొప్పున వారానికి 44 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ పనిచేయించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఇందుకుగాను రూ.47.46 లక్షలు, ఎబావో కుటుంబానికి మానసిక వేదన కలిగించినందుకు అదనంగా మరో రూ.1.17 లక్షలివ్వాలని కంపెనీని ఆదేశించింది. -
104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి
30 ఏళ్ల చైనీస్ వ్యక్తి ఒకే ఒక్క రోజు సెలవుతో వరుసగా 104 రోజులు పనిచేసిన తర్వాత అవయవ వైఫల్యంతో బాధపడుతూ మరణించాడు. తరువాత, అతని మరణానికి 20 శాతం యజమాని యజమాని కారణమని కోర్టు తీర్పు చెప్పింది.ఓ వ్యక్తి సెలవు తీసుకోకుండా, కనీసం ఆఫ్ కూడా వినియోగించకుండా 100 రోజులకు పైగా నిరంతరం పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. వృత్యిరీత్యా పెయింటర్ అయిన అబావో అనే 30 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ పని ప్రాజెక్టు కోసం ఒప్పందంపై సంతకం చేశాడు.ఫిబ్రవరి నుంచి మేరకు ప్రతిరోజు పనిచేశాడు. కేవతం ఏప్రిల్ 6న ఒకరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు.ఈ క్రమంలో మే 25న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అబావోకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు. చివరికి చికిత్స పొందుతూ జూన్ 2023లో ప్రాణాలు విడిచాడు. అయితే పని ఒత్తిడి, ఎక్కువ సమయం పనిచేయడం వల్లే అబావో మరణించాడని, ఇందుకు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం కోర్టును ఆశ్రయించిందికానీ అతడి యజమాని మాత్రం తన చర్యలను సమర్థించుకున్నాడు. అబావో కేవలం సమయానుసారమే పనిచేసినట్లు తెలిపాడు. తనే స్వచ్చందంగా అదనంగా పని చేశాడని, ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నాడు.కానీ యజమాని వ్యాఖ్యలతో న్యాయస్థౠనం ఏకీభవించలేదు. అబావో మరణానికి కంపెనీ 20 శాతం బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. 104 రోజులు నిరంతరం పనిచేయడం అనేది చైనీస్ లేబర్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘగించినట్లేనని పేర్కొంది. చట్టం ప్రకారం రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు, వారానికి సగటున 44 గంటలు మాత్రమే పనిచేయాలని తెలిపింది. అనంతరంఅబావో కుటుంబానికి 4,00,000 యువాన్లు (సుమారు రూ. 47,46,000), అతడి మానసిక క్షోభకు సంబంధించి 10,000 యువాన్లను (సుమారు రూ. 1,17,000) పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. -
విదేశాల్లో చదువు : ఫన్ అన్నారు, అంట్లు కడిగితే తప్పేంటి?
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం ఒకప్పుడు కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది.అది గొప్పోళ్లకే సొంతం అన్నట్టు ఉండేది. కానీ చాలామంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ చదువు కోవడానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇలా పలుదేశాలకి ఎగిరిపోతున్నారు. తీరా అక్కడికెళ్లాక చాలామంది విద్యార్థులు కల్చర్ పరంగా, ఆర్థికంగా ఇలా రక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్వతంత్రంగా, భద్రంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అన్ని నిబంధనలూ, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేస్తూ కష్టపడాలి. మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. కానీ అపుడు మాత్రమే, అక్కడి ఖర్చులు లోన్లు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు విద్యార్థులు. కొందరు చదువుతున్న కాలేజీల్లోనే అసిస్టెంట్లుగా పనిచేస్తారు. పనికొందరు మాత్రం వంట చేయడం, గిన్నెలు కడగటం, పిల్లల సంరక్షణా కేంద్రాలు, మొదలు పెట్రోలు బంక్, ఇతర దుకాణాల్లో పనిచేస్తారు. తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు ఇలా అంట్లు కడుగుతున్న వీడియో నొక దాన్ని ఒకరు షేర్ చేశారు. విద్యార్థి నాన్-స్టిక్ పాన్‌ను కడుగుతున్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశాడు. ‘‘విదేశాలకి స్టడీకోసంవెళ్లండి, సరదాగా ఉంటుంది అన్నారు." క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను సానుకూలంగా అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం అంట్లు కడిగితే తప్పేంటి, చిన్న చిన్న పనులైనా నేర్చుకుని ఉండాలి అంటూ మండి పడ్డారు. విదేశాల్లో అయినా ఇండియాలో అయినా ఎవరో ఒకరు అంట్లు కడగాల్సిందే.. వాటంతట అవి శుభ్రపడవు. కాకపోతే నువ్వు ఇంటికొచ్చాక ఇంకొకరు చేస్తారు. లేదా పెళ్లి అయ్యాక నీకోసం ఆ పనులు మరొకరు చేయాలని భావిస్తావ్.. అంతే తేడా. దీన్ని ఫన్‌గా అనుకోకుండా, జీవితమంతా ప్రతిరోజూ మీకోసం మీరు పనులు చేసుకోవాలని అర్థం చేసుకోండి అని కమెంట్ చేయడం గమనార్హం. go study abroad it’ll be fun they said pic.twitter.com/3yoj19uKyC — Dew (@itmedew) March 19, 2024 -
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైలు టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదు చేయడం... ఇలా అన్ని సేవలను ఒకే చోట ప్రయాణికులకు అందించేందుకు భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రైల్వే విభాగం అందించే అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. ఇన్నాళ్ల మాదిరిగా ప్రయాణికులు వేర్వేరు యాప్‌లపై అధారపడనవసరం లేదు. ఈ యాప్ ప్రాజెక్టును రైల్వే ఐటి వింగ్, సీర్ఐఎస్ పర్యవేక్షిస్తున్నదని రైల్వే విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. రైల్ మదద్, యూటీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, పోర్ట్రెయిట్, విజిలెంట్ తనిఖీ కార్యకలాపాల టీఎంఎస్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్, ఐఆర్సీటీసీ ఎయిర్ మొదలైన సేవలన్నీ కొత్త సూపర్ యాప్‌లో విలీనం కానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కోట్లాది మంది రైల్వే వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. రైల్వేకు సంబంధించిన అనేక పనులు ఇక వినియోగదారులకు సులభతరం కానున్నాయి. రైల్వే విభాగానికి ఈ సూపర్ యాప్ తయారీకి దాదాపు రూ. 90 కోట్ల ఖర్చు కానుంది. మూడు సంవత్సరాలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు అందుకున్న మొత్తం బుకింగ్‌లలో దాదాపు 5,60,000 బుకింగ్‌లు (సగానికి పైగా) ఐఆర్సీటీసీ యాప్ ద్వారా అందాయి. -
బిట్స్ పిలానీ విల్ప్తో గ్రీన్కో ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనర్జీ స్టోరేజి సంస్థ గ్రీన్కో తాజాగా బిట్స్ పిలానీలో భాగమైన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (విల్ప్) విభాగంతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం బిట్స్ పిలానీ అందించే వివిధ డిగ్రీ/సరి్టఫికేషన్ ప్రోగ్రామ్‌లలో గ్రీన్కో గ్రూప్ సిబ్బంది చేరవచ్చు. ఇంజినీరింగ్, టెక్నికల్, ఫంక్షనల్, మేనేజ్మెంట్ మొదలైనవి వీటిలో ఉంటాయి. ఎంప్లాయీ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ విధానంలో భాగంగా తమ ఉద్యోగులను గ్రీన్కో స్పాన్సర్ చేస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే బిట్స్ పిలానీతో భాగస్వామ్యం .. తమ సిబ్బంది నైపుణ్యాలు మరింతగా మెరుగుపడేందుకు తోడ్పడగలదని గ్రీన్కో వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి తెలిపారు. గ్రీన్కో సిబ్బందికి ఉపయుక్తమైన విద్యా కార్యక్రమాలను రూపొందించడంపై దృష్టి పెడుతున్నట్లు బిట్స్ పిలానీ ఆఫ్–క్యాంపస్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ జి. సుందర్ తెలిపారు. -
ఐదు రోజులు ఆన్లైన్ గేమ్స్ ఆడి..
బీజింగ్: తాను పనిచేసే మీడియా కంపెనీ కోసం లైవ్–స్ట్రీమింగ్‌లో ఏకధాటిగా గేమ్ ఆడుతూ ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. నవంబర్ 10నాటి దుర్ఘటన వివరాలను ‘ది పేపర్’వార్తాసంస్థ తన కథనం ప్రచురించింది. లీ హావో అనే విద్యార్థి హెనాన్ రాష్ట్రంలోని పింగ్డింగ్షాన్ వొకేషన్, ట్రైనింగ్ కళాశాలలో వచ్చే ఏడాది జూన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయనున్నాడు. కోర్సు ముగిసేలోపు కాలేజీ నిబంధనల ప్రకారం ఏదైనా గేమ్స్ సంబంధ మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలి. అందుకోసం క్విన్యీ కల్చర్ అండ్ మీడియా కంపెనీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరి ఆన్లైన్లో గేమ్స్ ఆడే లైవ్–స్ట్రీమర్‌గా విధుల్లో చేరాడు. మొదట్లో ఉదయ సమయంలో పనిచేసిన ఇతను తర్వాత కంపెనీ ఆదేశాల మేరకు రాత్రిళ్లు గేమ్స్ ఆడేవాడు. 3,000 యువాన్ల జీతం రావాలంటే 26 రోజుల్లో 240 గంటలపాటు ఆన్లైన్ గేమ్స్ ఆడాలి. నెలకు 15 చొప్పున షార్ట్ వీడియోలను అప్లోడ్ చేయాలి. ప్రతి రోజూ రాత్రి తొమ్మిదింటి నుంచి ఉదయం ఆరింటిదాకా ఏకధాటిగా ఆన్లైన్ గేమ్స్ ఆడాలి. దీంతో లీ హావో గత ఐదు రోజులుగా ఏకధాటిగా గేమ్స్ ఆడుతూ శ్వాస పీల్చుకోవడం ఇబ్బందై కుప్పకూలిపోయాడు. ఇతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కంపెనీ మాత్రం తమకేం సంబంధం లేదని స్పష్టంచేసింది. ‘‘ బాధితుని కుటుంబానికి 5,000 యువాన్లు(దాదాపు రూ.58,750) నగదు సాయం అందిస్తాం’’అని కంపెనీ చేతులు దులిపేసుకుంది. -
ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే..
గత కొన్ని రోజులకు ముందు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నారాయణ మూర్తి' చేసిన వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు ఈ వ్యాఖ్యలను సమర్దిస్తే.. మరి కొందరు వ్యతిరేకించారు. ఇప్పుడు ఏ దేశంలో ఎక్కువ పనిగంటలు ఉన్నాయనే వివరాలను 'ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్' వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం.. భారతదేశంలో ప్రతి ఉద్యోగి వారానికి సగటున 47.7 గంటలు పనిచేస్తాడు. ప్రపంచంలో ఎక్కువ కష్టపడే ఉద్యోగులలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఈ డేటా స్పష్టం చేస్తోంది. చైనాలోని ఉద్యోగులు వారానికి 46.1 గంటలు పనిచేస్తూ జాబితాలో రెండవ స్థానం పొందారు. ఫ్రాన్స్ ఉద్యోగులు వారానికి కేవలం 30.1 గంటలు మాత్రమే అని డేటా చెబుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఇటీవల సూచించిన వారానికి 70 గంటల పని.. భారతదేశాన్ని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోటీపడేలా చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపనీయులు అదనపు పనిగంటలు చేయడం ప్రారంభించారని మూర్తి వెల్లడించారు. జిందాల్, భవిష్ అగర్వాల్ వంటి ప్రముఖులు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. సుదీర్ఘ పని గంటలను గురించి ప్రస్తావించిన మొదటి వ్యక్తి నారాయణ మూర్తి కాదు, గతంలో ఒక సారి బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌పాండే కూడా ఇదే విషయం మీద తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అతని మాటలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలవడంతో చివరకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. -
కొందరికే ‘గృహలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది. ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. ఎన్నికలు ముగిసి కోడ్ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
మెరుగైన పోర్ట్‌ఫోలియోకు 8 సూత్రాలు..
ఇన్వెస్ట్ చేసి వదిలేయడం కాకుండా మధ్య మధ్యలో మన పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ కూడా ఉండాలి. అవసరమైతే రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే, ఎన్నాళ్లకు ఈ ప్రక్రియ చేపట్టాలంటే.. ఐదేళ్లకోసారి అనేది నా సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే జీవిత గమనంలో ఈ అయిదేళ్ల వ్యవధిలో లక్ష్యాలు, పరిస్థితులు, అవసరాలు మారిపోతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న పెట్టుబడులు, సాధనాలు, వాటి పనితీరును మదింపు చేసుకోవడానికి కూడా ఈమాత్రం సమయం అవసరం. నా అనుభవం మేరకు ఫండ్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి సంబంధించిన ఎనిమిది కీలక అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవేమిటంటే.. ఫండ్/ఏఎంసీ ఎంపిక .. ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ సావర్ధ్యాలు ప్రాతిపదికగా ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి ఏఎంసీకి ఒక స్పె షాలిటీ అంటూ ఉంటుంది. మిడ్‌క్యాప్, వేల్యూ లేదా గ్రోత్ అంటూ వివిధ సెగ్మెంట్లలో ప్రత్యేకానుభవం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఏఎంసీ/ఫండ్ పరిమాణం.. ఏఎంసీ పరిమాణమనేది అప్రస్తుతం. చిన్న ఏఎంసీలతో పోలిస్తే పెద్ద ఏఎంసీలు వెనకబడిన సందర్భాలు చాలానే చూశాను. ఆ చిన్న ఏఎంసీలు తర్వాత రోజుల్లో మీడియం ఏఎంసీలుగా ఎదిగాయి కూడా. భారీ బుడగలాగా పెరిగిపోయిన స్కీములకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా ఎంత మంచి పనితీరు కనపర్చినా కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ విషయంలో దీన్ని మరింతగా దృష్టిలో పెట్టుకోవాలి. నిలకడ వర్సెస్ స్టార్ పెర్ఫార్మెన్స్.. స్టార్ రేటింగ్స్ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. నా కొత్త పోర్ట్‌ఫోలియోలో, టాప్ పోర్టల్ ర్యాంకింగ్స్ లేదా 5 స్టార్ ర్యాంకింగ్స్ లేదా అందరూ ఎక్కువగా మాట్లాడుకునే ఫండ్స్ ఏవీ లేవు. నిలకడగా రాణిస్తున్న వాటిని నేను షార్ట్ లిస్ట్ చేసుకుని, వాటిల్లో నుంచి ఎంచుకున్నాను. అత్యుత్తమ పనితీరుకన్నా నిలకడకే ప్రాధాన్యమివ్వొచ్చు. సిప్ మంచిదే.. నెలవారీ సిప్‌లు బాగా పనిచేస్తాయి. సిప్ల వల్లే ఫండ్ పనితీరు కన్నా ఓ ఇన్వెస్టరుగా నా పనితీరు దాదాపు మెరుగ్గా ఉంటోంది. ఎందుకంటే.. మార్కెట్లు పడినప్పుడు కూడా నేను యూనిట్స్ కొంటూనే ఉంటాను. అంతేగాకుండా సిప్ల పని తీరు సైతం మెరుగ్గా ఉంటోంది. బీఏఎఫ్ కేటగిరీల్లో 14 శాతం పైగా, మిడ్ క్యాప్ కేటగిరీల్లో 18 శాతం పైగా రాబడులు ఇస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, పెరిగే ఆదాయాలకు అనుగుణంగా సిప్‌లను కూడా పెంచుకుంటూ ఉండటం మంచిది. పరిమిత సంఖ్యలో స్కీములు.. పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్ స్కీములు ఉండాలి అంటే.. 10 వరకూ ఫర్వాలేదు. అంతకు మించి ఉండొద్దు. స్కీముల సంఖ్యను ఒక స్థాయికి పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫండ్స్‌లో చాలా కేటగిరీలు ఉన్నందున ఇది అంత సులభం కాదు. నా మటుకు నేను ఫండ్స్‌ను ఆరు కేటగిరీల కింద వర్గీకరించుకున్నాను. ఒకో కేటగిరీలో ఒకటి లేదా రెండు స్కీములు ఉంటాయి. మొత్తం మీద 10కి మించవు. వీటిల్లో ఫ్లెక్సీ లేదా లార్జ్, మిడ్‌క్యాప్; మిడ్‌క్యాప్; స్మాల్ క్యాప్; అసెట్ అలొకేషన్ ఫండ్స్; ఇండో గ్లోబల్ ఫండ్స్ (పన్ను ప్రయోజనాలు కలి్పంచేవి); పూర్తి గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి. పన్నులపరమైన కారణాల రీత్యా చివరిది కొత్తగా జోడించాను. డైవర్సిఫికేషన్ ప్రధానం.. వైవిధ్యమైన స్టయిల్ పాటించే ఫండ్ హౌస్‌కు నేను ప్రాధాన్యం ఇస్తాను. ఏ ఏఎంసీలోనైనా ఒక్క స్కీములో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి సమయంలోనైనా మెరుగైన పనితీరు కనపర్చగలిగే వివిధ రకాల పెట్టుబడి విధానాల గురించి తెలుస్తుంది. యాక్టివ్, పాసివ్ విషయానికొస్తే నేను ఎక్కువగా యాక్టివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతాను. రిస్క్ సామర్ధ్యాలు.. నా అసెట్ అలొకేషన్ విషయంలో నేను సంప్రదాయ పద్ధతిని పాటిస్తాను. అంటే నా ఫండ్ స్కీములు చాలా వాటిల్లో ఈక్విటీ పెట్టు బడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఇంటి కొ నుగోలు వంటి ఆర్థిక లక్ష్యం అవసరం లేనందున నేను కొంత దూకుడైన విధానం వైపు మ ళ్లుతున్నాను. మా అబ్బాయి కాలేజి చదువుకు అవసరమయ్యే డబ్బు కోసం నేను ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను కూడా ప్రారంభించాను. సంక్లిష్టమైన సాధనాల జోలికెళ్లొద్దు.. పెట్టుబడుల విషయంలో దూకుడైన తీరు ఉంటే ఉండొచ్చు, కానీ పోర్ట్‌ఫోలియోలో సంక్లిష్ట సాధనాలు లేదా క్లోజ్డ్ ఎండెడ్ సాధనాలను నివారించడమే మంచిది. మీరు ఇన్వెస్ట్ చేసే పథకం గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. అలాగే ఉపసంహరణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లిక్విడిటీ, అంటే కోరుకున్నప్పుడు నగదు రూపంలోకి మార్చుకోగలిగే వెసులుబాటు చాలా ముఖ్యం. -
చేసే పనీ.. చేటు చేయొచ్చు.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా..
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. వాటి ప్రకారం.. – సాక్షి, హైదరాబాద్ అనారోగ్య ‘గనులు’.. గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. సమస్యల కర్మాగారాలు.. కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కారి్మకులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం.. నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. బిపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్.. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత.. విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. కంప్యూటర్.. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్‌కూ డేంజర్.. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ.. ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, రంగాలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ►ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ►పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ► లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ►సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న ఉద్యోగం/వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచ్చితంగా వాడాలన్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి పై తరచుగా అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ -
నెలకు 50 లక్షలు సంపాదిస్తున్న ఆయా..!
-
టీ బ్రేక్ మిస్ అయ్యాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ పని విధానం కొనసాగుతోంది. అయితే ఆఫీస్‌కు వెళ్లి సహోద్యోగులతో కలిసి విధులు నిర్వర్తించేందుకు 78 శాతం మంది భారతీయ నిపుణులు ఆసక్తి కనబరిచారని లింక్డ్ఇన్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 మధ్య సెన్సస్‌వైడ్ చేపట్టిన సర్వేలో 18 ఏళ్లు ఆపైన వయసున్న 1,001 మంది ఉద్యోగులు పాలుపంచుకున్నారు. ఈ నివేదిక ప్రకారం.. కార్మికులు సాధారణంగా కార్యాలయానికి వెళ్లడానికే మక్కువ చూపుతారు. ఈ విషయంలో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తాము సానుకూలంగా ఉన్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఉద్యోగులతో ముచ్చట్లు, మరింత సమర్థవంతమైన ముఖాముఖి సమావేశాలు, పని సంబంధాలను నిర్మించడం కోసం ఆఫీస్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. ఉద్యోగులతో కలిసి చాయ్.. కార్యాలయంలో చాయ్ విరామం (టీ బ్రేక్) బంధాన్ని కోల్పోయామని 72 శాతం మంది చెప్పారు. పని, వ్యక్తిగత జీవితాల గురించి సహోద్యోగులతో పరిహాసమాడవచ్చని వారు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా సహచరులు వచ్చి మరో ఉద్యోగితో సంభాషించడాన్ని (డెస్క్ బాంబింగ్) అత్యధికులు ఇష్టపడుతున్నారు. ఆకస్మిక సంభాషణలకు డెస్క్ బాంబింగ్‌ను గొప్ప మార్గంగా 62 శాతం మంది చూస్తున్నారు. జనరేషన్–జడ్‌కు చెందిన 60 శాతం మంది ఇటువంటి సంభాషణలను అనుభవించారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల తమ కెరీర్‌పై ఎటువంటి హానికర ప్రభావం పడలేదని 63 శాతం మంది వెల్లడించారు. అలాగే కార్యాలయానికి వెళ్లకపోతే కెరీర్ వృద్ధి అవకాశాలు తగ్గుతాయని ఇదే స్థాయిలో నమ్ముతున్నారు. -
వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్
సండే.. దేశంలో చాలామంది ఉద్యోగుల సేదతీర్చే రోజు.. వారమంతా పనిలో పడ్డ కష్టం నుంచి వారికి విశ్రాంతినిచ్చే ఒకే ఒక్క సెలవు రోజు.. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ కంపెనీలు, ఐటీ, అనుబంధ రంగాల వంటి వాటిలో పనిచేసే ఉద్యోగులైతే వారానికి రెండు రోజులపాటు సెలవులు పొందుతుంటారని మనకు తెలుసు. మరి వారానికి మూడు రోజులపాటు సెలవులు అందుకుంటున్న ఉద్యోగులు కూడా ఉన్నారని మీకు తెలుసా?! అదేంటి.. మన దేశంలో ఎవరిస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇంకా మన దేశంలో అమల్లోకి రాలేదులేండి... ప్రస్తుతానికి యూరప్‌లోని కొన్ని దేశాలు ఈ ట్రెండ్‌ను సెట్ చేసే పనిలో ఉన్నాయి.. అదేంటో తెలుసుకుందామా? సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి దెబ్బకు కంపెనీలు, సంస్థల పని విధానమే మారిపోయింది. అప్పటివరకు ఆఫీసుకు వెళ్లి చేసే పని బదులు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత కొన్నిరోజులు ఆఫీసు నుంచి, మరికొన్నిరోజులు ఇంటి నుంచి పని (హైబ్రీడ్) చేసే పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. దీనికి కొనసాగింపుగా అన్నట్లు యూరప్‌లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవుల విధానం అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో 61 కంపెనీలు 3 వేల మంది ఉద్యోగులకు 6 నెలలపాటు ఫోర్డే వీక్ విధానాన్ని పరిశీలించాయి. ఇరుపక్షాలకూ లాభమే.. వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు ఉద్యోగుల పని–జీవితం బ్యాలెన్స్ కూడా మెరుగైనట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. అలాగే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు గతంలో మానేసిన వారు తిరిగి విధుల్లో చేరడం, అనారోగ్యంతో సెలవులు పెట్టే వారి సంఖ్య తగ్గడం వంటి ఎన్నో సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. జీతం కంటే కూడా వారంలో ఒకరోజు పని తగ్గుదల వైపే మొగ్గుచూపుతున్నట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. భారత్‌లో నిపుణుల స్పందనేంటి? మన దేశంలోనూ వారానికి 4 రోజుల పని విధానంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో ఏకంగా ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రోజుకు 12 గంటలు పనిచేసే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫ్ తీసుకోవచ్చని ఇందులో పొందుపరిచారు. అయితే భారత్‌లో ఈ విధానం అమలుపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఎదురయ్యే కొన్ని సవాళ్లను అధిగమిస్తూ పక్కా ప్రణాళికలతో చేపడితేనే మన దేశంలో సత్ఫలితాలు సాధ్యమని వాల్యూ మ్యాట్రిక్స్.ఏఈ వ్యవస్థాపకుడు ఆదిత్య మాలిక్ పేర్కొన్నారు. ఈ విధానానికి తగ్గట్లుగా నియమ, నిబంధనలు ఇతర అంశాలను మార్చాల్సి ఉంటుందన్నారు. మన దేశంలో ఆతిథ్య, తయారీ, రిటైల్ రంగాల్లో నాలుగు రోజుల పనివిధానం అమలు సాధ్యం కాదని డే కొలాబ్ కో–ఫౌండర్, సీఈవో రాజేశ్వరీసింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం ఈ–కామర్స్, బ్యాంకింగ్, బీమా, టెక్నాలజీ వంటి రంగాల్లోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ఈ పని పద్ధతికి సరిపోయే పరిశ్రమ ఎంపికతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించకుండా ఇందుకు అర్హమయ్యే సంస్థలనే ఎంపిక చేయాలని కర్మ వీ ఫౌండర్, సీఈవో ఉజ్జల్ డే సూచించారు. ప్రతి పరిశ్రమ, సంస్థకు 4 రోజుల పని విధానం సరిగ్గా వర్తించకపోవచ్చని, అయితే కోవిడ్ వ్యాప్తి తర్వాత పనిప్రదేశాలు మారిపోతున్న నేపథ్యంలో టెక్నాలజీ సహకారంతో నూతన ప్రక్రియలను చేపట్టడంలో నష్టమేమీ లేదని ఐమోచా సీఈవో అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఫోర్ డే వర్క్ విధానం అమలు వల్ల యాజమాన్యాలకు లేబర్ కాస్ట్‌లు, ఓవర్‌హెడ్ ఖర్చులు తగ్గడంతోపాటు ఉద్యోగులకూ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగవుతుందని జెన్లీప్ ఫౌండర్ సచిన్ తెలిపారు. ఫోర్ డే వీక్ ఆహ్వానించదగ్గదే.. మన దేశంలో ఈ విధానం పనిచేయదనుకోవడానికి లేదు. గత పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే మనం ‘మెంటల్ వెల్నెస్’కు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే 5–10 ఏళ్లలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కొత్త పనివిధానంతో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఫైవ్ డే వీక్ బదులు రోజుకు మరో గంటన్నర, రెండు పనిగంటలు పెంచి ఫోర్ డే వీక్ చేస్తే ఉద్యోగులకు మూడు రోజులు వెసులుబాటుగా ఉంటుంది. ఈ దిశగా యాజమాన్యాలు ఆలోచించాలి. – సాక్షితో డాక్టర్ బి.అపర్ణారెడ్డి, హెచ్.ఆర్. నిపుణురాలు ఈ విధానం ఎలా అమల్లోకి...? దాదాపు వందేళ్ల కిందటే వారానికి చేసే పనిదినాలను తగ్గించాలనే ఆలోచన వచ్చిందట. ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ 1926లోనే 6 రోజులపని స్ధానంలో ‘ఫైవ్ డే వీక్’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది పనిగంటలు తగ్గించినంత మాత్రాన ఉత్పాదకతపై దాని ప్రభావం పడలేదని వెల్లడైంది. దీంతో ఇతర కంపెనీలు కూడా ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాయి. మారుతున్న కాలం, అభిరుచులను బట్టి ఐర్లాండ్, ఐస్లాండ్, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో అమలు చేసి సత్ఫలితాలు సాధించాయి. ఈ పని పద్ధతిపై న్యూజిలాండ్, యూఎస్, కెనడా, వివిధ ఐరోపా దేశాలు ప్రయోగాలు చేశాయి. ‘ఫోర్ డే వర్క్’సిస్టమ్‌ను 2018లోనే టెక్ కంపెనీ అమెజాన్ ఎంపిక చేసిన ఉద్యోగులకు అమలు చేసింది. 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్ నెలపాటు ఈ పద్ధతిని పరిశీలించింది. 2020లో యూనీలివర్ న్యూజిలాండ్‌లో ఏడాదిపాటు పరీక్షించింది. తద్వారా ఈ కంపెనీలు మంచి ఫలితాలనే సాధించాయి. ఆ తర్వాత విదేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ స్టార్టప్ ‘త్రీడే వీక్’! దాదాపు ఏడాదిన్నర క్రితమే బెంగళూరుకు చెందిన ఓ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం, ఇతర సౌకర్యాలు కల్పించింది. కొత్త ఆలోచనలు, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేందుకు తమ ›ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్ సభ్యులకు వారు కోరుకున్న పనివిధానంలో పనిచేసే అవకాశం కల్పించింది. -
పని చెయ్యడం ఒక వేడుక
ఫలితం రావడానికి పనిచెయ్యడం ప్రాతిపదిక. ప్రయత్నం పని చెయ్యడానికి ప్రాతిపదిక. ఏ పరిణామానికైనా ప్రయత్నం, పని చెయ్యడం ఉండాలి. ప్రయత్నంతో పని చెయ్యడానికి మనిషి పూనుకోవాలి; ప్రయోజనకరమైన ఫలితాలను సాధించాలి. ‘తప్పులు జరుగుతాయన్న భయంతో పని మొదలు పెట్టక΄ోవడం చెడ్డవాడి లక్షణం; అజీర్ణం అవుతుందనే భయంవల్ల భ్రాంతిలో ఎవరు భోజనాన్ని వదిలేస్తారు? అని హితోపదేశం మాట. తప్పులు జరుగుతాయని పని చెయ్యక΄ోవడం నేరం. పని చెయ్యడం గురించి ఓషో ఇలా చె΄్పారు... జీవితం అన్నది బాధ్యతలతో మాత్రం పని చెయ్యడమా? లేదా వేడుకలోపాలుపంచుకోవడమా? పని చెయ్యడం మాత్రమే జీవితం అయితే జీవితం ఇబ్బందికరమైనదై ఇరుకైందిగా మారి΄ోతుంది. బరువెక్కిన హృదయంతో జీవించాల్సి వస్తుంది. కృష్ణుడు పని చెయ్యడం మాత్రమే బాధ్యత గా జీవించినవాడు కాదు. జీవితాన్ని ఒక వేడుకగా; ఒక ఉత్సవంగా మార్చుకున్నవాడు. జీవితం ఇంట్లో చదువుకునేపాఠం కాదు. జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకోవడం వల్ల ఎవరూ జీవితాన్ని కోల్పోవడం లేదు. పని చెయ్యి; ఆ పనిని వేడుకలాగా మార్చెయ్యి. అప్పుడు పని కూడా ఆటపాటల సంకలనంగా మారి΄ోతుంది. అందువల్ల చిన్నపని కూడా నిండుగా ఉంటుంది. పని సౌందర్యాత్మకం అవుతుంది. పనికి బానిసలుగా మారినవాళ్ల గురించి మీకు తెలిసి ఉంటుంది. పని చెయ్యడం కోసం జీవించేవాళ్లు ఉద్రిక్తతలో జీవించాల్సి వస్తుంది. పని పిచ్చివాళ్లైనవాళ్లు జీవించడాన్ని ఒక కర్మాగారంగా మార్చేసు కుంటున్నారు.‘చెయ్యి లేదా చచ్చి΄ో‘ అని ఘోషిస్తున్నారు. పని చెయ్యడం తప్పితే మరో కోణం వాళ్లకు తెలీదు. వాస్తవానికి వాళ్లకు పని చెయ్యడానికి ప్రయోజనం ఏమిటో తెలియదు. జీవితం అన్నది ఒక వేడుక. మనం పని చెయ్యడం నాట్యం చేస్తున్నట్టు ఉండాలి. పని చెయ్యడం ద్వారా వేడుకను తీసుకురావాలి. కఠినమైన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటేపాడడానికీ, ఆడడానికీ, వేడుక చేసుకోవడానికీ సమయం లేకుండా ΄ోతుంది. జీవితం ఇంటికీ, కార్యాలయానికీ మధ్యలో ఆగి΄ోతుంది. ఈ రెండు ప్రదేశాల మధ్యలో ముళ్లకంచెను ఏర్పరుచుకుని మానసికంగా మీరు బాధకు గురి అవుతున్నారు. ఒకరోజున జీవితంలో విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించాలని మీరు అనుకుంటారు. కానీ ఆ రోజు రాదు; పని పిచ్చివాళ్లు ఎప్పటికీ జీవితాన్ని వేడుక చేసుకోరు. కృష్ణుడు జీవితాన్ని ఉత్సవంగా మార్చుకున్నాడు. పువ్వులు, పక్షులు, ఆకాశ తారలు జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. మనిషి తప్పితే జీవరాశులన్నీ జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. పువ్వులు ఎందుకు పూస్తూ ఉన్నాయి? అని అడగండి. తారలు ఎందుకు ఆకాశంలో తేలుతున్నాయి? అని అడగండి. గాలి ఎందుకు ఒంటరిగా వీస్తోంది? అని అడగండి. సూర్యుడికి కింద జీవిస్తున్నవి అన్నీ వేడుక చేసుకుంటున్నాయి. ప్రపంచమే వేడుక చేసుకుంటోంది. మనిషి కూడా ప్రపంచంలో భాగమే అని కృష్ణుడు చెబుతున్నాడు; వేడుక చేసుకోండి అని చెబుతున్నాడు. ఏ పనీ చెయ్యకుండా వేడుక చేసుకోమని కృష్ణుడు చెప్పలేదు. గాలి పని చెయ్యకుండా వీచడం లేదు. తార ఒకేచోట నుంచుని వేడుక చేసుకోవడంలేదు. అది కదులుతూనే ఉంది. పువ్వులు పుయ్యడం కూడా పనే. అయితే వీటికి పని చెయ్యడం ముఖ్యం కాదు. వేడుక ముఖ్యం. వేడుక ముందు ఉంటుంది అదే సమయంలో అవి తమ బాధ్యతల్ని కూడా నెరవేరుస్తాయి. వేడుకకు కొనసాగింపే పని; జీవితమే ఒక ఉత్సవం. పని చెయ్యడంలోని సౌందర్యాన్ని, పని చెయ్యడంవల్ల సత్ఫలితాన్ని మనిషి సొంతం చేసుకోవాలి. పని చేస్తూ మనిషి తన జీవితాన్ని ఉత్సవం చేసుకోవాలి. – శ్రీకాంత్ జయంతి -
కోవిడ్ నిబంధనలతో G-20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్
-
టీపీసీసీ కొత్త కమిటీ ప్రకటన.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డి తొలగింపు..
-
Hyderabad: సిటీలో కొత్త ట్రెండ్.. ‘వర్కేషన్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో నివసించే కార్పొరేట్ ఉద్యోగి వర్థన్.. గత ఏడాదిగా గోవా, మధురై, కేరళలలో ప్రకృతి అందాలను సతీసమేతంగా ఆస్వాదిస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వ్యవధి ఉండే ట్రిప్ పూర్తయిన తర్వాత నగరానికి రావడం ఓ వారం పదిరోజులు గడపడం ఆ వెంటనే మరో టూర్.. దీనిని బట్టి ఆయనను మనం వర్క్‌కి బంక్ కొట్టే వెకేషన్ లవర్‌గా భావిస్తాం. కానీ ఆయన ఆస్వాదిస్తోంది వర్కేషన్. పిక్నిక్లోనూ పనిచేసే విధానం. ట్రావెల్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్స్టేషన్ల పోస్ట్‌లు..బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్కేషన్ దాకా కోవిడ్ దెబ్బకు కార్పొరేట్ ఉద్యోగుల పనితీరు ఆన్లైన్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ సిస్టమ్...ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా ఊపందుకుంది. ‘ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూనే అసైన్డ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్ ట్రెండ్‌నే వర్కేషన్’గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్ ప్రియుల్ని డిజిటల్ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అన్ అకాడమీ తదితర కార్పొరేట్ సంస్థలు ‘నిరవధిక వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. వర్క్‌తో పాటే విందు, వినోదం ‘మా రిసార్ట్స్‌లో 80 శాతం వరకూ వర్కేషన్కు అనువుగా మార్చాం. బెస్ట్ వైఫై నెట్ వర్క్, ఫుడ్ ప్రీ ఆర్డర్స్ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం’ అంటూ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు నగర వర్కేషన్ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్ ఆపరేటర్ మీర్ చెప్పారు. నగరానికి చెందిన ఓ కంపెనీలో స్ట్రాటజీ హెడ్ గా పనిచేస్తున్న సూర్య తేజ గత రెండేళ్లుగా వారణాసి నుంచి గోవా..మధురై వరకు 65,000 కి.మీ ప్రయాణించాడు, మరి అత్యవసర పరిస్థితుల్లో ఎలా? అంటే సమాధానంగా సూర్య ఏమంటారంటే ‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని ఓ రిసార్ట్స్‌లో కయాకింగ్ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్లైన్ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంటుంది’ అంటూ చెప్పడం పనితో పిక్నిక్ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది. ఇటీవల బాగా పాపులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్ ప్యాకేజ్‌లను డిజైన్ చేస్తున్నాం. అడ్వంచర్ యాక్టివిటీస్, నేచర్ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్ బాల్... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దాం. మా సభ్యుల్లో దక్షిణాది నుంచి 30 శాతం ఉంటే అందులో హైదరాబాద్ వాటా పెద్దదే. –ప్రతినిధి, క్లబ్ మహేంద్రా హాలిడేస్– రిసార్ట్స్ -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్‌గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్‌వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్‌వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్‌ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్‌చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్‌ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్‌వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
రూపాయి: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు
ముంబై: వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. డాలర్‌తో రూపాయి 80కు పడిపోవడం, రానున్న రోజుల్లో ఇంకొంత క్షీణిం చొచ్చంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. రూపాయిలో అస్థిరతలు, ఎత్తు పల్లాలను ఆర్బీఐ చూస్తూ కూర్చోదని స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంకు చర్యల వల్లే రూపాయి ప్రయాణం సాఫీగా ఉందన్నారు. రూపాయి ఈ స్థాయిలో ఉండాలనే ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ పెట్టు కోలేదని స్పష్టం చేశారు. మార్కెట్‌కు యూఎస్ డాలర్లను సరఫరా చేస్తూ తగినంత లిక్విడిటీ ఉండేలా చూస్తున్నట్టు చెప్పారు. విదేశీ రుణాలకు సంబంధించి హెడ్జింగ్ చేయకపోవడంపై ఎటువంటి హెచ్చరికలు అవసరం లేదన్నారు. విదేశీ రుణాల్లో ఎక్కువ ఎక్స్పోజర్ ప్రభుత్వరంగ సంస్థలకే ఉందని చెబుతూ.. అవసరమైతే ప్రభుత్వం సాయంగా నిలుస్తుందన్నారు. 2016లో ద్రవ్యోల్బణం నియంత్రణకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ మంచి ఫలితాలను ఇచ్చిందంటూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ రంగ ప్రయోజనాల రీత్యా దీన్నే కొనసాగిస్తామని శక్తికాంతదాస్ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి పరిమితం చేయాలన్నది ఈ కార్యాచరణలో భాగం. ప్రతికూల సమయాల్లో దీనిని ప్లస్2, మైనస్2 దాటిపోకుండా చూడడం లక్ష్యం. ఆర్థిక వ్యవస్థ సాఫీగా.. ‘‘నిర్ణీత కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ కుదురుకునేలా చూడాలన్నదే మా ప్రయత్నం. అదే సమయంలో వృద్ధిపై పరిమిత ప్రభావం ఉండేలా చూస్తాం’’అని ఆర్బీఐ గవర్నర్ భరోసా ఇచ్చారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్టాలను తాకిందంటూ, ఆగస్ట్‌లో జరిగే ఎంపీసీ భేటీలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 6.7 శాతం ద్రవ్యోల్బణం అంచనాలను సమీక్షిస్తామని చెప్పారు. యూరోప్‌లో (ఉక్రెయిన్‌పై) యుద్ధం కారణంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. కమోడిటీ ధరలు, చమురు ధరలు పెరిగి పోయాయి. వీటి ప్రభావం మనపై పడింది. అదే సమయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీని కఠిన తరం చేయడం వల్ల ఆ ప్రభావాలు మననూ తాకాయి. పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం, కరెన్సీ విలువ క్షీణత ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణలో లేనివి. లిక్విడిటీ, పాలసీ రేట్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, వాటి ప్రభావం వృద్ధిపై, ఆర్థిక వ్యవస్థ రివకరీపై ఏ మేరకు ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకునే చేస్తాం’’అని శక్తికాంతదాస్ వివరించారు. ప్రస్తుతం ఆర్బీఐముందున్న ప్రాధాన్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, తర్వాత వృద్ధికి మద్దతుగా నిలవడమేనని చెప్పారు లైసెన్స్ ఉన్న సేవలకే పరిమితం డిజిటల్ రుణ సంస్థలు లైసెన్స్ పొందిన సేవలకే పరిమితం కావాలని శక్తికాంతదాస్ సూచించారు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనలు ఆమోదనీయం కాదని తేల్చి చెచెప్పారు. లైసెన్స్ పరిధికి వెలుపల ఏ సేవలకు అయినా తమ ఆమోదం కోరాలని సూచించారు. ఆమోదం లేకుండా వీటిని నిర్వహించడం వల్ల వ్యవస్థలో రిస్క్ పెరుగుతుందంటూ, అందుకు తాము అవకాశం ఇవ్వబోమన్నారు. ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసే నాన్ బ్యాంకింగ్ సంస్థలు వ్యాలెట్లను, కార్డులను క్రెడిట్ సదుపాయాలతో లోడ్ చేసుకోవడం కుదరదంటూ ఆర్బీఐ గత నెలలో ఆదేశించడం గుర్తుండే ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు సెంట్రల్ బ్యాంకు మద్దతు ఇస్తుంది. కానీ, అదే సమయంలో మొత్తం వ్యవస్థ ఒక క్రమపద్ధతిలో, నియంత్రణల మధ్య వృద్ధి చెందాల్సి ఉంటుంది. అందుకని ఆర్థిక స్థిరత్వం విషయంలో రాజీపడేది లేదు’’అని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. నియంత్రణలో లేని, లైసెన్స్‌లు లేని ఎన్నో సంస్థలు ఎన్నో రకాల రుణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు దాస్ చెప్పారు. ‘‘ఈ అంశంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించాం. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తాం’’అని తెలిపారు. -
ఎప్పుడూ ల్యాప్‌టాపేనా?.. స్కూటర్‌పైన వెళ్తూ కూడా అవసరమా!!
కర్ణాటక: బెంగళూరు ఫ్లై ఓవర్ మీద స్కూటర్లో వెళ్తూ ల్యాప్‌టాప్ చూస్తున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. హర్షమిత్సింగ్ అనే వ్యక్తి ఫోటో తీసి పోస్ట్ చేయడంతో నెటిజన్లు తలోరకంగా స్పందించారు. పని లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే తప్పదని కొందరు, నగరరోడ్లపై ఇలాంటి రిస్క్ చేయడం శ్రేయస్కరం కాదని మరికొందరు పేర్కొన్నారు. -
AP: వారానికి ఐదు రోజుల పని.. మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: మీకు తెలుసా?.. చెప్పింది చేస్తే.. నష్టపోవాల్సిందే! వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన సీఎం వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు
సాక్షి, అమరావతి: ఈ నెల 26, 27 తేదీలు (నేడు, రేపు) సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. ఈ రెండు రోజులు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు ఫీజుల చలానాలు కట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు ప్రత్యేకంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: 29న కొత్త జిల్లాలకు తుది రూపు? ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏర్పాటు చేసింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల చలానాలు కట్టించుకునేలా ఒప్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ రామకృష్ణ కోరారు. -
సాంకేతిక సమస్యలతో ఆగిన ‘ఆధార్’
సాక్షి, హైదరాబాద్: విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ నూతన నమోదు, సవరణల ప్రక్రియ సాంకేతిక సమస్యల కారణంగా గత కొద్దిరోజులుగా నిలిచిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాల్లో (ఏఈసీ) జరిగే ఈ ప్రక్రియకు ఐదురోజులుగా అంతరాయం ఏర్పడింది. దీంతో కొత్త కార్డుల కోసం నమోదు, వేలిముద్రలు–ఐరిస్ అప్డేషన్, ఇప్పటికే జారీ చేసిన కార్డుల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాల కోసం ఏఈసీలకు వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 కేంద్రాలు ఈ సేవలందిస్తున్నాయి. రోజుకు సగటున లక్ష మంది వివిధ రకాల సేవల కోసం ఈ కేంద్రాలను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం వీటిల్లో సేవలు నిలిచిపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రాల చుట్టూ చక్కర్లు.. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కార్యక్రమంలో భాగంగా ఆసరా íపింఛన్లు ఇస్తోంది. ఇటీవల ఈ పథకం వయోపరి మితి నిబంధన సడలించి 57 సంవత్సరాలు దాటిన వారికి ఫించన్లు్ల ఇవ్వనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పింఛన్ల మంజూరుకు ఆధార్ కార్డు వివరాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖా స్తులకు ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేసింది. దీంతో ఇప్పటివరకు ఆధార్ లేనివారు కొత్తగా నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే ఉంటే వ్యక్తిగత వివరాల అప్డేషన్, పేర్లు, చిరునామాలు తదితరాల్లో తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఏఈసీలకు వస్తున్నారు. అయితే ఐదురోజులుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో వయోవృద్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ఆధార్ జత చేసి దరఖాస్తు చేసుకోకుంటే పింఛ న్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రోజూ ఆ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆసరాతో పాటు పలు పథకాలు, అనేక వ్యవహారాలు/ లావాదేవీలకు ఆధార్ కార్డు తప్పనిసరి అ య్యింది. దీంతో ఇప్పటివరకు తీసుకోనివారు ఈ కేం ద్రాల్లో నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఐదేళ్లకోసారి చేసుకోవాల్సిన బయోమెట్రిక్ అప్డేషన్కోసం కూడా చాలామంది ఈ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యల ను అధిగమించేందుకు యూఐడీఏఐ సంబంధిత ఇంజనీర్లను రం గంలోకి దింపింది. సర్వీసుల పురనరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. అయితే ఎన్నిరోజుల్లో సర్వీసులు పునరుద్ధరిస్తామనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఐదు రోజులుగా తిరుగుతున్నా.. ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం సవరణ కోసం ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నా. నగరంలోని కేంద్రాలతో సహా 20 సెంటర్లు తిరిగా. ఎక్కడా సర్వర్ పనిచేయట్లేదు. ఈ మార్పు చేసుకుంటేనే నేను ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగలను. – కె.నర్సింహారెడ్డి, హన్మాస్‌పల్లి, రంగారెడ్డి జిల్లా -
వర్క్ ఫ్రం హోమ్ 2.0
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానం క్రమంగా రెండో దశకు చేరుకుంది. ఇంటి నుంచి పని విధానం కాస్త హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు తెరలేపింది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఉద్యోగులు గతంలో మాదిరిగా రోజూ ఆఫీసులకు వచ్చే సూచనలు కనిపించకపోవటంతో హైబ్రిడ్ వర్కింగ్ విధానాలపై కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఒక రోజు ఇంటి నుంచి.. మరొక రోజు ఆఫీసు నుంచి పని చేసే వీలుండటమే హైబ్రిడ్ ప్రత్యేకత. ఉత్పాదకత పెరగడంతో పాటు ఉద్యోగుల గైర్హాజరు సగానికి పైగా తగ్గడంతో కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు కాసింత తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో కార్యాలయాల పునఃప్రారంభం, ఉద్యోగులు హాజరు అంశాల మీద చాలా వరకు కంపెనీలు కన్సల్టెంట్లతో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పెద్ద కంపెనీలు హైబ్రిడ్ పని విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ విధానాన్ని ప్రారంభించేశాయని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ యూనిలివర్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ లీనా నాయర్ తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోమ్ విధానం ఇక ఎప్పటికీ పోదని చెప్పారు. కరోనాతో అనివార్యమైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కంపెనీలు, ఉద్యోగులు స్వాగతించక తప్పదన్నారు. 40 గంటల వారాల పాటు పనిదినాల తిరిగి రావటం ఇప్పట్లో కష్టమే. వ్యాపార సంస్థలకు ఉత్తమమైన పని విధానాలకు మారేందుకు కరోనా రూపంలో ఒక మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. ఇప్పటికే యూనిలివర్ సరళమైన పని విధానాలను కలిగి ఉందని చెప్పారు. దీన్ని మరింత సమర్ధవంతగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మరింత మెరుగైన పని విధానాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని తెలిపారు. 2020కి ముందటి పని విధానాలైతే తిరిగి రావని తేల్చిచెప్పారు. హైబ్రిడ్ వర్క్‌తో ఉత్పాదకత మెరుగు.. గతేడాది పని విధానాలలోని సవాళ్లను, మార్పులను గమనించిన కంపెనీలు పని విధానాలలో సరికొత్త మార్పులు చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్, ఆఫీస్ ఫ్రం వర్క్ రెండు రకాల పని విధానాలతో భవిష్యత్తు కార్యాలయాలుంటాయి. ఇటీవలే పెప్సికో కార్పొరేట్ అసోసియేట్స్ కోసం ‘వర్క్ దట్ వర్క్స్’ కొత్త ప్రోగ్రామ్ కింద ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ప్లేస్ పాలసీలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త విధానంతో ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేనేజర్స్, అసోసియేట్స్ రిమోట్ వర్క్ లేదా వర్క్ ఫ్రం హోమ్‌లో ఏ పని చేయాలో.. అదే సమయంలో కార్యాలయంలో ఏ పని చేయాలో ఎంపిక చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఇలాంటి సౌకర్యవంతమైన పని విధానంలో ఉద్యోగుల గైర్హాజరు 31 శాతం తక్కువగా ఉంటుందని పెప్సికో అధ్యయనం తెలిపింది. అదే సమయంలో ఉత్పాకదతలో 15 శాతం వృద్ధి, టర్నోవర్‌లో 10 శాతం క్షీణత, వేధింపులు 10 శాతం తగ్గాయని పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి కేపీఎంజీ ఇండియా హైబ్రిడ్ ఆఫీస్ పని విధానాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఉద్యోగుల దృష్టి కోణంలోంచి.. వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత మీద ప్రభావితం చూపుతుందన్న సందేహాలు చాలా వ్యాపార సంస్థలకున్నాయి. అయితే ఈ సందేహాలన్నీ కరోనాతో పటాపంచలయ్యాయని పెప్సికో ఇండియా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ పవిత్రా సింగ్ చెప్పారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులలో ఇలాంటి విధానం కీలకమైనదని.. ఇదొక గొప్ప ముందడుగని తెలిపారు. సాధారణ పని విధానాల మైండ్‌సెట్ మారాల్సిన అవసరం ఉందని సూచించారు. అప్పుడే హైబ్రిడ్ పని విధానాల ప్రయోజనాలను మరింత సహజంగా నమ్ముతారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు హైబ్రిడ్ పని విధానాలను కచ్చితంగా ఇష్టపడతారని.. అయితే అదే సమయంలో ఆఫీస్, సహోద్యోగులతో అనుబంధాలను కోల్పోతారని తెలిపారు. వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆఫీసులకు రావటానికి ఇష్టపడతారు. ఎందుకంటే సాధారణ పని విధానం, ఒత్తిళ్లకు విరామం, సహోద్యోగులు, స్నేహితులతో కలిసే అవకాశం దొరుకుతుందని. అయితే హైబ్రిడ్ పని విధానాన్ని ఉద్యోగుల దృష్టి కోణంలోంచి చూస్తే.. ఔట్పుట్ డెలివరీ, వాస్తవ ఉత్పాదకత పెరిగాయి. ఉద్యోగుల సృజనాత్మకత ఆలోచనలు, ఆవిష్కరణలు, ఆనందాల విషయంలో వ్యాపార సంస్థలు, యజమానులు రాజీపడకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఇక్కడే హైబ్రిడ్ పని విధానం సమర్ధవంతమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ వర్కింగ్ మోడల్లో ఆవిష్కరణ, çసహకరణ, అనుసంధానం, ఆనందం అన్ని రకాల అంశాలుంటాయని వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంలోనే ఉద్యోగులు స్థిరపడిపోతే వాళ్లు కార్యాలయ వాతావరణాన్ని, సహోద్యోగులతో అనుబంధాలను కోల్పోతారు. అందుకే ఉద్యోగులు తరుచుగా ఆఫీస్‌కు రావాల్సిన అవసరం ఉందని నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ హెడ్ విక్రమ్ ష్రాఫ్ తెలిపారు. హైబ్రిడ్ పని విధానంలో ప్రత్యామ్నాయ పని దినాలు, ఫ్లెక్సిబుల్ పని గంటల వంటి ఫీచర్లుంటాయి. ఫ్రంట్ డెస్క్, ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులతో దశల వారీగా ఆఫీసు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశాలపై దృష్టిసారించాయి. టీకా వేయించుకున్న ఉద్యోగులే ఆఫీసులకు రావటానికి మొగ్గుచూపుతారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగుల అవసరాలను, ఆవశ్యకతలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించాలని ష్రాఫ్ సూచించారు. -
కోవాగ్జిన్ : భారత్ బయోటెక్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రకం కరోఏనా వైరస్ కేసులో భారత్‌లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీదారు భారత్ బయోటెక్ కీలక విషయాన్ని ప్రకటించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ బ్రిటన్‌లో కలకలం రేపిన కొత్త రకం ప్రాణాంతక కరోనా వైరస్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. చైనాలోని వూహాన్లోపుట్టిన కోవిడ్-19 కంటే 70 శాతం ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు భావిస్తున్న బ్రిటన్ కొత్త వేరియంట్ వైరస్‌ను తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్ విజయవంతంగా నిలువరిస్తోందని వెల్లడించింది. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్ చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఇటీవల బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అనేక దేశాలో విదేశీయాన ఆంక్షలను కూడా విధించాయి. అయితే ఇప్పటికే బ్రిటన్ నుంచి విమానాల ద్వారా ఇండియాకు చేరిన వారిలో 150 మంది కొత్త కోవిడ్ స్ట్రెయిన్ బారిన పడ్డారు. Neutralization of UK-variant VUI-202012/01 with COVAXIN vaccinated human serum https://t.co/v8Me4TzGgh #BharatBiotech #COVAXIN #bioRxiv #COVID19 pic.twitter.com/7R3FlsWAX3 — BharatBiotech (@BharatBiotech) January 27, 2021 -
వర్కింగ్ మదర్ కష్టాలు ఇవే: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన భావాలను పోస్ట్ లుగా పెట్టడమే కాకుండా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతుంటారు. మంత్రిగా తాను చేస్తున్న కార్యకలాపాలతోపాటు తన లైఫ్‌లోని పలు విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా ఓ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో వర్కింగ్ మదర్ జీవిత కష్టాలు ఎలా ఉంటుందో వివరించారు. దీనిని ఫన్నీ కామెంట్‌ను జత చేశారు. స్మృతికి భర్త జుబిన్ ఇరానీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ ఈ పోస్టులో తన కుటుంబాన్ని, పిల్లలను, వర్క్ మీటింగ్స్ మధ్య జీవితాన్ని ఎలా సమన్వయం చేస్తున్నారో వెల్లడించారు. ‘ఇంటి నుంచి పనిచేసే అమ్మలకు ఆన్లైన్ సమావేశాలను, ఇంట్లో బాధ్యతలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది’. అని పేర్కొన్నారు. దీనికి వర్కింగ్ మామ్స్ అనే హ్యష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే ఇంట్లో నుంచి వర్చువల్ మీటింగ్స్‌కు హాజరవుతున్న మంత్రికి తమ పిల్లలు అరవడం వల్ల అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర మంత్రి పోస్టుపై పలువురు ప్రముఖలు స్పందిస్తున్నారు. ఆమె మల్టీ టాస్కర్ అని ప్రశంసిస్తున్నారు. కాగా ఇటీవల తాజా ట్యూస్డే(మంగళవారం ) అంటూ యాంగ్రీ లుక్స్‌తో మరోసారి అలరించిన విషయం తెలిసిందే. కోపంతో ఉన్న స్మృతి చిన్ననాటి ఫోటో, ఇప్పటి ఫోటోను షేర్ చేస్తూ.. నన్ను ఆగ్రహానికి గురిచేయొద్దు (డోంట్ యాంగ్రీ మీ) అంటూ ఫ్లాష్‌బ్యాక్ ఫోటోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) -
పబ్జీ ప్రియులకు బిగ్ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జీ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్. దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుంది. ఈ మేరకు పబ్జీ ఫేస్బుక్ పేజీలోఅధికారిక ప్రకటన చేసింది. నేటి (అక్టోబర్ 30,2020)నుంచి వినియోగదారులందరికీ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించబడింది. అయినప్పటికీ తమ తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్జీని ఆడుకోవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా కరోనా వైరస్ విస్తరణ, సరిహద్దు వద్ద చైనా దుశ్చర్య నేపథ్యంలో గోప్యత, భద్రత కారణాల రీత్యా భారత ప్రభుత్వం పబ్జీ సహా118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. -
‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్క ఫోటోలు
-
చురుగ్గా సాగుతున్న పారిశుధ్య పనులు
-
'సంపాదన' ఆడవాళ్ల పని కూడా
బాలీవుడ్ నటి కాజోల్ కూతురు నైసా. పదహారేళ్లు. కొడుకు యుగ్. తొమ్మిదేళ్లు. ఇక చూడండి. ఈ ఏజ్ పిల్లలు ఇంట్లో ఉంటే.. అదీ అక్కా తమ్ముడో, అన్నా చెల్లెలో అయి ఉంటే.. ఇంట్లో ప్రతి క్షణమూ ఒక కోర్టు సీనే. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తల్లే న్యాయమూర్తి. తండ్రి.. కేసు వదిలేసుకున్న జడ్జిలా మౌనంగా బయటికి వెళ్లిపోతాడు. కాజోల్ ఇంట్లో తమ్ముడి మీద అక్క ఫిర్యాదులు తక్కువే. అక్కను ఏదో ఒకటి అని విసిగించడం మాత్రం తమ్ముడికి డైలీ రొటీన్. ‘అక్కరా.. నీకన్నా పెద్దదిరా..’ అన్నా.. వింటాడా యుగ్! ‘ఆడవాళ్లు ఆడవాళ్లలా ఉండాలి’ అంటాడు! ‘ఆడా మగా ఏంట్రా.. అక్క చేసే పనులన్నీ నువ్వూ చెయ్యాల్సిందే’ అంటారు కాజోల్. అంతే.. ముఖం మాడ్చుకుని వెళ్లిపోతాడు. కాజోల్ నిన్న ఒక ఇంటర్వ్యూలో.. ఈ సంగతే చెప్తూ.. ఇంటి పని ఎలాగైతే ఆడవాళ్ల పని మాత్రమే కాదో, అలాగే బయటికి వెళ్లి సంపాదించడం కేవలం మగాళ్ల పని మాత్రమే కాదు’ అన్నారు. పేరెంట్స్ ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే.. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం దానంతట అదే వచ్చేస్తుందని అని కూడా చెప్పారు. -
కర్ణాటకలో మహిళలకు నైట్‌షిఫ్ట్
బెంగళూరు: మహిళలు నైట్‌షిఫ్ట్‌లో (రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట పనిచేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఐటీ పరిశ్రమ, ఐటీ అనుబంధ విభాగాల్లో మాత్రమే మహిళల నైట్ షిఫ్ట్‌లకు అనుమతి ఉంది. అయితే దీనికి పలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నామని మహిళల నుంచి లేఖలు తీసుకోవాలని చెప్పింది. కనీసం 10 మంది మహిళా ఉద్యోగులు ఉండాలని, మహిళలు పనిచేసే చోట పూర్తి వెలుతురుతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. సీసీకెమెరాల రికార్డులను కనీసం 45 రోజుల పాటు నిక్షిప్తం చేయాలంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పనిచేసిన మహిళల నివేదికలను పరిశ్రమల ఇన్స్పెక్టర్తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని చెప్పింది. -
బిజినెస్ టైకూన్ వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో తనదైన శైలిలో చురుకుగా ఉండే పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక కార్టూన్‌ను తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. ఉరుకులు పరుగుల జీవితంలో వర్కింగ్ విమెన్ పడుతున్న కష్టాలను గుర్తించి, దాన్ని ట్విటర్లో షేర్ చేయడంతో బిజినెస్ టైకూన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అన్నిరంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ముందు వరుసలో నిలబడే క్రమంలో స్త్రీగా కొన్ని పనులు, బాధ్యతలు తప్పడం లేదనే విషయాన్ని ఈ కార్టూన్లో కళాకారుడు అద్భుతంగా చిత్రీకరించగా... ఉద్యోగం చేసే మహిళల ముందున్న సవాళ్లను ప్రతిబింబిస్తూ వచ్చిన కార్టూన్‌ను ఆయన షేర్ చేయడంతోపాటు. పురుషులకంటే ఎక్కువ బాధ్యతలను స్వీకరిస్తూ.. ఇంటిపనిని, ఆఫీసు పనులను సమతుల్యంగా నిర్వహిస్తూ రేసులో దూసుకుపోతున్న మహిళా ఉద్యోగినులపై ఆయన ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన అనుభవాన్ని కూడా మేళవించి.. ఇంటిపని, పిల్లల పెంపకంలో పురుషుల బాధ్యతను చెప్పకనే చెప్పారు. గత వారం రోజులుగా ఏడాది వయసున్న తన మనవరాలి ఆలనా పాలన చూస్తున్నానని ఆనంద్ మహీంద్ర సగర్వంగా చెప్పుకున్నారు. I’ve been helping to baby-sit my year old grandson this past week & it’s brought home to me the stark reality of this image. I salute every working woman & acknowledge that their successes have required a much greater amount of effort than their male counterparts pic.twitter.com/2EJjDcK1BR — anand mahindra (@anandmahindra) February 5, 2019 -
పోలీస్ శాఖలో ‘వర్టికల్’ వర్కింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రతీ సిబ్బందికి వారు చేయాల్సిన పని, ఆ విధులు వారికి సంతృప్తి నిచ్చేలా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. పని ఒత్తిడి లేకుండా సిబ్బందికి పూర్తి స్థాయిలో సంతృప్తి అనిపించేలా వర్టికల్ వర్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలుచేసిన వర్టికల్ పని విభజనను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రతీ విభాగంలోని కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్పీ/ కమిషనర్ స్థాయి వరకు అందరికీ పోలీస్ శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ఎవరెవరు ఏం పని చేస్తున్నారు? వాటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? పనితీరు మెరుగుపరచుకోవడంలో ఉండాల్సిన కీలక అంశాలేంటి? తదితర వాటిపై అన్ని జిల్లాల సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించింది. ప్రజల కు మరింత వేగంగా సేవలందించడంలో సిబ్బం ది సక్సెస్ అయ్యేందుకు వారికి ఎవరి పని వారుచేసేలా 17 రకాలుగా కార్యకలాపాలను విభజిం చింది. నిత్యం వారి విధి, అందులో పురోగతిని స్టేషన్ హౌజ్ అధికారి నుంచి రోజువారీ నివేదికలు పంపించాల్సి ఉంటుంది. కేటాయించిన పనుల్లో మాత్రమే.. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో రోజువారీ విధులు నిర్వ హించే సిబ్బందిని 17 రకాలుగా విభజించారు. ఇందులో ఉన్న సిబ్బంది/అధికారులు వారికి కేటాయించిన పనుల్లో మాత్రమే విధులు నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు వారు చేయాల్సిన పని, అందులో పురోగతి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. దీంతో త్వరితగతిన కేసుల ఛేదింపు, స్టేషన్ మేనేజ్మెంట్, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా అన్నింటిలో అధికారులు, సిబ్బంది సక్సెస్ అవుతారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పని విభజనలో 17 అంశాలు.. 1)రిసెప్షన్ స్టాఫ్ 2) స్టేషన్ రైటర్ 3) క్రైమ్ రైటర్ 4)బ్లూకోట్స్ 5) పెట్రోల్ స్టాఫ్ 6) కోర్టు వర్కింగ్ స్టాఫ్ 7) వారెంట్ స్టాఫ్ 8) సమన్స్ స్టాఫ్ 9) టెక్ టీమ్ 10)ఇన్వెస్టిగేషన్ స్టాఫ్ 11) క్రైమ్ స్టాఫ్ 12) మెడికల్ సర్టిఫికెట్ స్టాఫ్ 13)స్టేషన్ ఇన్చార్జి 14) జనరల్ డ్యూటీ స్టాఫ్ 15)డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ 16) స్టేషన్ హౌజ్ ఆఫీసర్ 17) అడ్మిన్ ఎస్ఐ -
పని పెరిగితే జలుబు చేస్తుంది!
వానలో తడవడం, చల్లని వాతావరణంలో ఎక్కువగా గడపడం వంటి కారణాల వల్ల జలుబు చేసే అవకాశాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే, పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా జలుబు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. పని ఒత్తిడి మితిమీరినప్పుడు ముఖానికి చేరాల్సిన రక్తప్రసరణ దారిమళ్లి మెదడులోని న్యూరాన్లకు చేరుతుందని, దీని వల్ల ముక్కు చల్లబడి జలుబు చేస్తుందని ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. కొంతమంది వలంటీర్లను ఎంపిక చేసి, రకరకాల ఒత్తిడి స్థాయి గల కంప్యూటర్ గేమ్స్ వారితో ఆడించి, థెర్మల్ ఇమేజింగ్ కెమెరాల సాయంతో వారి శరీర ఉష్ణోగ్రతలలో మార్పులను వారు గుర్తించారు. ఎక్కువ ఒత్తిడి గల గేమ్స్ ఆడిన వారిలో ముఖం, ముక్కు భాగాల్లో ఉష్ణోగ్రత తగ్గిందని వారు వివరించారు. ముఖంలోని అవయవాలకు చేరాల్సిన రక్తప్రసరణ దారిమళ్లడం వల్లనే ఇలా జరుగుతుందని, ఇదే పరిస్థితి గంటల తరబడి కొనసాగితే ముక్కు చల్లబడి జలుబు చేస్తుందని తెలిపారు. -
'భారత్‌తో పనిచేయడం బాగుంటుంది'
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పట్ల తన సానుకూలతను వ్యక్తం చేశారు. భారత్‌లాంటి దేశాలతో కలిసి పనిచేయడం చాలా హాయిగా ఉంటుందని, అది చాలా మంచి విషయం అని అన్నారు. మాస్కోతో వాషింగ్టన్ సంబంధాలను మెరుగుపరుచుకుంటుందా అనే అంశంపై మీడియా ఆయనను ప్రశ్నించగా 'భారత్, రష్యా, చైనావంటి దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, కలిసి పనిచేయడం బాగుంటుంది. అది చాలా మంచి అంశం కూడా' అని ఆయన బదులిచ్చారు. అదే సమయంలో ఉత్తర కొరియా విషయంలో మాత్రం ఆయన మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశంతో కలిసి పనిచేయడం తన సమస్య కాదని, ఎప్పటి నుంచో ఆ దేశానికి ఉన్న సమస్య అని, అదే ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక తన చేతిలో ఓడిపోయిన హిల్లరీ గురించి స్పందిస్తూ దేశంలో బలమైన సైనిక శక్తికి ఆమె తగినవారు కాదని అన్నారు. అయితే, ఆమె ఇతర అంశాల్లో మాత్రం మంచి సామర్థ్యం ఉందన్నారు. ఇక దక్షిణ కొరియా విషయంపై స్పందిస్తూ 'నేను ఈ రోజు ఉదయాన్నే అధ్యక్షుడు మూన్తో మాట్లాడాను. ఇది చాలా అంశాల్లో మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం.. ఏం జరుగుతుందో' అని ట్రంప్ అన్నారు. -
మోత‘బడి’
హిందూపురం అర్బన్: చిన్నారులకు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు...వారిని కూలీలుగా మార్చారు. బకెట్లు చేతికిచ్చి కంకర, మట్టి మోపించారు. మోయలేని భారంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసిన వారు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివరాల్లోకి వెళితే... స్థానిక ఆబాద్‌పేటలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ప్రాథమికోన్నత పాఠశాలకు ఇటీవల మరమ్మతులు చేయిస్తున్నారు. అయితే బుధవారం బేల్దారులు పనికి రాకపోవడంతో అక్కడి ఉపాధ్యాయులు పాఠశాల ప్రహరీ నిర్మాణానికి అవసరమైన కంకర, మట్టిని విద్యార్థుల చేత మోపించారు. బకెట్లలో మట్టిని నింపుకుని విద్యార్థులు బరువును మోయలేక పడిన అవస్థలు గమనించిన విద్యార్థి సంఘాల నాయకులు సంపత్, బాబావలి పాఠశాల అధ్యాపకులను నిలదీశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎంఈఓ గంగప్పకు తెలియజేయడంతో ఆయన పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పొరపాటు జరిగితే సహించేదిలేదని చెప్పారు. అయితే విద్యార్థులచేత పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాల నాయకులు ఎంఈఓకు వినతిపత్రం అందించారు. -
మన్యంలో పని మైదానంలో ఏంపని..?
పని చేసిన చోటే నివాస సూత్రం ఏమయిందో ఆ సూత్రం చెప్పిన కలెక్టరే ఒత్తిడికి తలొగ్గితే ఎలా? అతిపెద్ద మన్యంపై ఇదేనా శ్రద్ధ? మండిపడుతున్న గిరిజనం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘వడ్డించేవాడు మనవాడైతే జీతం ఒక చోట, ఉద్యోగం మరోచోట ఎంచక్కా చేసేయొచ్చు. మన్యం వాసుల ప్రయోజనాలను గాలికొదిలేసి మైదాన ప్రాంతంలో పనిచేస్తున్నా పాలకులుగానీ...సంబంధితాధికారులుగానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేరు. ఎందుకంటారా? ఆయనకున్న పలుకుబడి అటువంటిది మరి. ఏజెన్సీలో అధికారులంతా స్థానికంగానే నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ వైపు గట్టిగా నొక్కి చెబుతారు. దీనికి భిన్నంగా వేలాది మంది గిరిజనుల భూముల వివాదాలను పరిష్కరించే స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారికి కాకినాడలో ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అక్కడలా...ఇక్కడిలా...ఇదేమి తీరంటూ గిరిజనులు మండిపడుతున్నారు. మన్యవైపు కన్నెత్తి చూడకపోయినా... రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసేందుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ మన్యం వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకు కారణం ఆయనకు జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడమే. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌ని మైదాన ప్రాంతంలో ఇ¯ŒSఛార్జి బాధ్యతలు అప్పగించడంపై మన్యం వాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన సంక్షేమం కోసం చాలా కీలకమైన పోస్టు స్పెషల్ డిప్యుటీ కలెక్టర్. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎస్‌డీసీపై ఉంది. ల్యాండ్ ట్రాన్సెక్షన్ రెగ్యులేటరీ పిటిషన్లను పరిష్కరించడం ఈయన ప్రధాన విధి. మన్యంలో విధులు నిర్వర్తించాల్సిన ఆయన జిల్లా పంచాయతీ అధికారిగా కాకినాడలో పని చేస్తున్నారు. ఈ కారణంగా మన్యంలో పెద్ద ఎత్తున కేసులు పేరకుపోయి గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో ఆప్షనల్ సూట్ (ఒఎస్) కేసులు 153 ఎకరాలకు సంబంధించి 87, ల్యాండ్ ట్రాన్సేక్షన్ రెగ్యులేటరీ పిటీషన్లో 2,200 ఎకరాలకు సంబంధించి 409 కేసులు, మరో 352 ఎకరాలకు సంబంధించి 180 ఎల్టీఆర్పీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు రికార్డుల్లో నమోదైన వరకు మాత్రమే. ఈ కేసులే పరిష్కారం కాలేదు, ఇక కొత్తగా కేసులు వేసినా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం లేక చాలా మంది గిరిజనులు పిటిషన్లు వేసేందుకు వెనుకాడుతున్నారు. లేదంటే కేసుల సంఖ్య ఇంతకు రెట్టింపు అయ్యేదంటున్నారు. రాజకీయ నేతల్లా వ్యవహరిస్తే ఎలా... ఇంత కాలం పాలకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదనుకునేవారు. ఇప్పుడు బాధ్యత కలిగిన అధికారులు కూడా పాలకుల బాటలో పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎస్డీసీని కాకినాడలో నియమించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇ¯ŒSఛార్జిగా డీపీఓ పనిచేస్తున్న కుమార్ 2012 నవంబరు నుంచి 2015 మార్చి వరకు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎంగా కాకినాడలో పనిచేశారు. ఆ సమయంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక జిల్లా యంత్రాంగం చేతికొచ్చే సమయానికి డీఎం కారణమేమిటో తెలియదు కానీ సెలవులో ఉన్నారు. ఎనిమిది నెలలు తిరగకుండానే 2015 నవంబరు 11న తిరిగి జిల్లా గిరిజన సంక్షేమ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌గా రంపచోడవరం వచ్చారు. మన్యంలో ఎస్డీసీగా పని చేస్తున్నప్పుడే కాకినాడలో సర్వశిక్ష అభియాన్ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారిగా 2016 మే 20 నుంచి నవంబరు ఒకటోతేదీ వరకు పనిచేశారు. నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఆయన 2016 డిసెంబరు 17న జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయనే డీపీఓగా కొనసాగుతున్నారు. మన్యంలో కీలకమైన పోస్టింగులో పనిచేయాల్సిన కుమార్‌ను ఇక్కడ డీపీఓగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా కేంద్రం కాకినాడలో ఏ శాఖ అధికారికైనా బాధ్యతలు అప్పగించాల్సిందంటున్నారు. అలా కాకుండా గిరిజనుల ప్రయోజనాలను గాలికొదిలేసి మన్యంలో పనిచేయాల్సిన అధికారికి మైదాన ప్రాంతంలో బాధ్యతలు అప్పగించడమేమిటని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో అధికారులు స్థానికంగానే నివాసం ఉండాలని, అక్కడే పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ మన్యంలో పనిచేయాల్సిన ఎస్డీసీకి ఇక్కడ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యమేమిటని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. -
మన్యంలో పని మైదానంలో ఏంపని..?
పని చేసిన చోటే నివాస సూత్రం ఏమయిందో ఆ సూత్రం చెప్పిన కలెక్టరే ఒత్తిడికి తలొగ్గితే ఎలా? అతిపెద్ద మన్యంపై ఇదేనా శ్రద్ధ? మండిపడుతున్న గిరిజనం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘వడ్డించేవాడు మనవాడైతే జీతం ఒక చోట, ఉద్యోగం మరోచోట ఎంచక్కా చేసేయొచ్చు. మన్యం వాసుల ప్రయోజనాలను గాలికొదిలేసి మైదాన ప్రాంతంలో పనిచేస్తున్నా పాలకులుగానీ...సంబంధితాధికారులుగానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేరు. ఎందుకంటారా? ఆయనకున్న పలుకుబడి అటువంటిది మరి. ఏజెన్సీలో అధికారులంతా స్థానికంగానే నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ వైపు గట్టిగా నొక్కి చెబుతారు. దీనికి భిన్నంగా వేలాది మంది గిరిజనుల భూముల వివాదాలను పరిష్కరించే స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారికి కాకినాడలో ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అక్కడలా...ఇక్కడిలా...ఇదేమి తీరంటూ గిరిజనులు మండిపడుతున్నారు. మన్యవైపు కన్నెత్తి చూడకపోయినా... రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసేందుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ మన్యం వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకు కారణం ఆయనకు జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడమే. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌ని మైదాన ప్రాంతంలో ఇ¯ŒSఛార్జి బాధ్యతలు అప్పగించడంపై మన్యం వాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన సంక్షేమం కోసం చాలా కీలకమైన పోస్టు స్పెషల్ డిప్యుటీ కలెక్టర్. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎస్‌డీసీపై ఉంది. ల్యాండ్ ట్రాన్సెక్షన్ రెగ్యులేటరీ పిటిషన్లను పరిష్కరించడం ఈయన ప్రధాన విధి. మన్యంలో విధులు నిర్వర్తించాల్సిన ఆయన జిల్లా పంచాయతీ అధికారిగా కాకినాడలో పని చేస్తున్నారు. ఈ కారణంగా మన్యంలో పెద్ద ఎత్తున కేసులు పేరకుపోయి గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో ఆప్షనల్ సూట్ (ఒఎస్) కేసులు 153 ఎకరాలకు సంబంధించి 87, ల్యాండ్ ట్రాన్సేక్షన్ రెగ్యులేటరీ పిటీషన్లో 2,200 ఎకరాలకు సంబంధించి 409 కేసులు, మరో 352 ఎకరాలకు సంబంధించి 180 ఎల్టీఆర్పీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు రికార్డుల్లో నమోదైన వరకు మాత్రమే. ఈ కేసులే పరిష్కారం కాలేదు, ఇక కొత్తగా కేసులు వేసినా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం లేక చాలా మంది గిరిజనులు పిటిషన్లు వేసేందుకు వెనుకాడుతున్నారు. లేదంటే కేసుల సంఖ్య ఇంతకు రెట్టింపు అయ్యేదంటున్నారు. రాజకీయ నేతల్లా వ్యవహరిస్తే ఎలా... ఇంత కాలం పాలకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదనుకునేవారు. ఇప్పుడు బాధ్యత కలిగిన అధికారులు కూడా పాలకుల బాటలో పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎస్డీసీని కాకినాడలో నియమించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇ¯ŒSఛార్జిగా డీపీఓ పనిచేస్తున్న కుమార్ 2012 నవంబరు నుంచి 2015 మార్చి వరకు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎంగా కాకినాడలో పనిచేశారు. ఆ సమయంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక జిల్లా యంత్రాంగం చేతికొచ్చే సమయానికి డీఎం కారణమేమిటో తెలియదు కానీ సెలవులో ఉన్నారు. ఎనిమిది నెలలు తిరగకుండానే 2015 నవంబరు 11న తిరిగి జిల్లా గిరిజన సంక్షేమ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌గా రంపచోడవరం వచ్చారు. మన్యంలో ఎస్డీసీగా పని చేస్తున్నప్పుడే కాకినాడలో సర్వశిక్ష అభియాన్ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారిగా 2016 మే 20 నుంచి నవంబరు ఒకటోతేదీ వరకు పనిచేశారు. నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఆయన 2016 డిసెంబరు 17న జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయనే డీపీఓగా కొనసాగుతున్నారు. మన్యంలో కీలకమైన పోస్టింగులో పనిచేయాల్సిన కుమార్‌ను ఇక్కడ డీపీఓగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా కేంద్రం కాకినాడలో ఏ శాఖ అధికారికైనా బాధ్యతలు అప్పగించాల్సిందంటున్నారు. అలా కాకుండా గిరిజనుల ప్రయోజనాలను గాలికొదిలేసి మన్యంలో పనిచేయాల్సిన అధికారికి మైదాన ప్రాంతంలో బాధ్యతలు అప్పగించడమేమిటని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో అధికారులు స్థానికంగానే నివాసం ఉండాలని, అక్కడే పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ మన్యంలో పనిచేయాల్సిన ఎస్డీసీకి ఇక్కడ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యమేమిటని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. -
ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయ్!
బ్యాంకుల పనిదినాలపై ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది. వచ్చే నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో 2016 అక్టోబర్ 10వ తేదీని బ్యాంకులు పని చేయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. అక్టోంబర్ 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం, 10న ఆయుధ పూజ, 11న విజయదశమి, 12న మొహర్రం పండుగల కావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే వరుసగా మూడు రోజుల మినహా ఎక్కువ రోజులు బ్యాంకులు సెలవులు పాటించకూడదనే నిబంధనతో ఆ రోజుల్లో ఒకరోజు పనిదినాన్ని పాటించాలని బ్యాంకులు నిర్ణయించాయి. అక్టోబర్ 10 ఆయుధ పూజ రోజున బ్యాంకులు పనిచేయనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది. -
కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన డీజీపీ
తిరుపతి క్రైం: ఈస్ట్ పోలీస్‌స్టేషన్ మిద్దెపైనున్న కమాండ్ కంట్రోల్‌ను డీజీపీ సాంబశివరావు పనితీరును పరిశీలించారు. తిరుపతి చేరుకున్న ఆయనకు ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణా, సీఐ రాంకిషోర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమల, తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ–చలానా ఆన్లైన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల ద్వారా పరిష్కరించిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఫొటోగ్యాలరీని పరిశీలించి, చక్కగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ దిలీప్ కిరణ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ప్రైవేట్ కంపెనీలకు పనిగంటలు తగ్గింపు!
దుబాయ్ః రంజాన్ నెలలో ప్రైవేట్ కంపెనీల పనిగంటలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రంజాన్ పవిత్ర మాసంలో కార్మికులకు ఎటువంటి జీతం తగ్గింపు లేకుండా రెండు గంటల పని సమయాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసింది. కార్మిక సంబంధాలు, సవరణల నియంత్రణకు సంబంధించిన 1980 ఫెడరల్ చట్టం 08, ఆర్టికల్ 65 నిబంధన ప్రకారం కార్మికుల పనిగంటలకు సంబంధించిన నిబంధన అమల్లోకి తెచ్చినట్లు యూఏఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదించింది. ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఫెడరల్ అథారిటీ ప్రకటన ప్రకారం రంజాన్ నెలలో ఉదయం 9 గంటలనుంచి 2గంటల వరకూ పని గంటలను సవరించినట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం అటు ప్రైవేట్ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రంజాన్ నెలంతా రెండు గంటల పని సమయం తగ్గిస్తూ తెచ్చిన నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా నిబంధననను సోమవారం అమల్లోకి తెచ్చిన సందర్భంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యుఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ ప్రధానమంత్రి హెచ్ హెచ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టౌమ్, ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. -
ఉపాధికి ‘ఉపశమనం’
♦ వేసవి నేపథ్యంలో పనివేళల్లో మార్పు ♦ ఎండ తీవ్రత పెరగకముందే పనులు పూర్తి ♦ సాయంకాలమూ పని చేసుకునే వెసులుబాటు ♦ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మార్పులు ♦ కొత్త పనివేళలు నేటినుంచి అమల్లోకి.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధిహామీ కూలీలకు శుభవార్త. వేసవి తాపంతో అల్లాడిపోతున్న కూలీలకు ఉపాధి పనివేళలు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. తాజాగా ఎండలు మండిపోతుండడం కూలీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వైఖరిని తీవ్రంగా పరిగణించి పనివేళలు మార్చాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పనివేళల మార్పు నిర్ణయాన్ని తీసుకుంది. బుధవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 గంటల నుంచి 6గంటల వరకు ఉపాధి పనులు చేపట్టాల్సిందిగా జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లను ఆదేశించింది. క్షేత్రస్థాయి అధికారులకు ఎస్ఎంఎస్లు.. జిల్లాలో 33 గ్రామీణ మండలాలకు గాను 25 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ మండలాల్లో 2,89,885 జాబ్ కార్డులు జారీ చేయగా.. ప్రస్తుతం రోజుకు సగటున 62 వేల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. జనవరి నెలలో రోజుకు లక్ష మంది హాజరుకాగా.. తాజాగా ఎండల తీవ్రత పెరగడంతో కూలీల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనుల వేళలను ప్రభుత్వం మార్చింది. బుధవారం నుంచి కొత్త పనివేళలను అమలు చేయాలంటూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ క్షేత్రస్థాయి అధికారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారాన్ని అందజేశారు. ఉదయం వేడి తీవ్రత తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అయితే సాయంత్రం వేళలో కూలీల హాజరు తగ్గుతుందని డ్వామా అధికారులు చెబుతున్నారు. బకాయిల భారంతోనూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలుగా కూలీ డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నిధులను సర్దుబాటు చేయలేదు. ఫలితంగా రెండు నెలలుగా కూలీలకు డబ్బుల పంపిణీ స్తంభించింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2.8 లక్షల మంది కూలీలకు రూ.32 కోట్లు చెల్లించాల్సి ఉంది. కూలీ డబ్బులు చెల్లించని కారణంగా ఉపాధి పనులకు కూలీల హాజరు తగ్గుతోంది. మంగళవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. పలువురు పీడీలు ఈ అంశాన్నే ప్రస్తావించారు. దీంతో ఉన్నతాధికారులు స్పందిస్తూ రెండ్రోజుల్లో నిధులు విడుదలవుతాయని.. కూలీలకు వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
పండగ రోజుల్లో కుటుంబానికి దూరంగా..!
-
నేవీ ఉద్యోగి భార్య వీరంగం
-
ఏటీఎం పనిచేసేదిలా...
కార్డు పెట్టామా... పిన్ నెంబర్ ఎంటర్ చేశామా... డబ్బు తీసుకున్నామా! అంతే.. ఏటీఎంతో మన పనైపోతుంది. కానీ... మనం టైప్ చేసిన మొత్తాన్ని అది లెక్కకట్టి ఎలా ఇస్తుంది? లేదా డిపాజిట్ మొత్తాన్ని కచ్చితంగా ఎలా లెక్కకట్టి అకౌంట్లోకి జమ చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించామా? ఇదంతా ఎలా జరుగుతుందో చూడండి మరి... మీరు ఏటీఎంలోకి కార్డు జొప్పించగానే... * కార్డు వెనుకభాగంలోని అయస్కాంత పట్టీలో నిక్షిప్తమై ఉన్న మీ సమాచారం మొత్తం బ్యాంక్ సర్వర్‌కు చేరుతుంది. * అన్నీ సక్రమంగా ఉంటే ఆ సమాచారం తిరిగి ఏటీఎంలోని కంప్యూటర్‌కు అందుతుంది. * నాలుగు అంకెల పిన్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తరువాత కూడా ఇదే ప్రక్రియ మరోసారి నడుస్తుంది. * మీరు విత్‌డ్రా చేయాల్సిన మొత్తాన్ని టైప్ చేయగానే.. ఏటీఎంలోని క్యాష్‌బాక్స్‌ల వద్ద హడావుడి మొదలవుతుంది. * ఉన్న క్యాష్‌బాక్స్‌ల చివరలో ఉన్న మూత తెరుచుకుంటాయి. * లైట్ సెన్సర్లు నోట్ల విలువను గుర్తిస్తే.. క్యాష్బాక్స్కు అనుసంధానమైన యంత్రాలు (సక్షన్ మెషీన్స్) అవసరమైనన్ని నోట్లను బయటకు తీస్తాయి. * నకిలీ, నలిగిపోయిన నోట్లు వస్తే... వాటిని ప్రత్యేకమైన బాక్స్ (రిజెక్ట్ బాక్స్)లోకి పడేసి మళ్లీ క్యాష్‌బాక్స్ నుంచి నోట్లు వెలికితీస్తాయి. కావాల్సిన మొత్తం అందేవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. * క్యాష్‌బాక్స్‌ల పై భాగంలో ఏర్పాటు చేసిన రోలర్ల మధ్య నుంచి నోట్లు ఏటీఎంలో మనం క్యాష్ తీసుకునే చోటికి వస్తాయి. -
ఏలేరు.. కానరాని జోరు!
ఆధునికీకరణపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి వైఎస్ హయాంలో శంకుస్థాపన మొదటి విడతగా రూ.138 కోట్ల కేటాయింపు ఆయన మరణానంతరం నిధులివ్వని సీఎంలు మొక్కుబడిగా తొలిదశ పనులు {పతిపాదనలకే పరిమితమైన రెండో దశ జగ్గంపేట : జిల్లాలోని మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్న ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఏలేరు జలాశయం కింద ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచి శివారు ఆయకట్టుకు సక్రమంగా నీరందడం లేదు. దీంతో నీటి ఎద్దడి సమయంలో శివారు రైతులు నష్టపోతున్నారు. ఇదే సమయంలో వరదలు వచ్చినప్పుడు ముంపు బారిన పడి నష్టం చవిచూస్తున్నారు. వాస్తవానికి ఏలేరు కింద ప్రస్తుతం 53 వేల ఎకరాలే సాగవుతోంది. వీరవరం, వేలంక, సింహద్రిపురం, జగపతినగరం తదితర గ్రామాల్లో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. దీంతో శివారు ఆయకట్టు రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. పూడుకుపోయిన కాలువలు, ఎత్తుపల్లాలు, దెబ్బతిన్న స్లూయిజ్‌లు, బెడ్ రెగ్యులేటర్లవంటివాటితో ఏలేరు నీటిపారుదల వ్యవస్థ దెబ్బ తింది. దీంతో ఆధునికీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి ఈ ప్రాంత రైతులు ఏలేరు ఆధునికీకరణ అంశాన్ని తీసుకువచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఏలేరు ఆధునికీరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 2009 ఫిబ్రవరిలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద రూ.138 కోట్లతో ఏలేరు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన రెండోసారి అధికారంలోకి రావడంతో ఏలేరు పనులు పూర్తవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన హఠాన్మరణం చెందడంతో.. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏలేరు ఆధునికీకరణకు నిధుల విడుదలలో జాప్యం చేస్తువచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు, చలమలశెట్టి సునీల్ తదితరులు ఏలేశ్వరం నుంచి పిఠాపురం వరకూ పాదయాత్ర చేయడంతో నిధులు మంజూరయ్యాయి. వైఎస్ ఇచ్చిన జీఓ ప్రకారం రూ.138 కోట్లు కేటాయించగా.. వీటిలో ప్రాజెక్టు హెడ్వర్క్సకు రూ.7 కోట్లు, తిమ్మరాజుచెరువుకు రూ.3 కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.127.54 కోట్లలో భూసేకరణకు సుమారు రూ.20 కోట్లు, వ్యాట్, సెస్వంటివాటికి రూ.10 కోట్లు పోను మిగిలిన రూ.97 కోట్లతో తొలి దశ పనులు చేపట్టాల్సి ఉంది. తొలిదశ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన గాయత్రీ ప్రాజెక్టు సంస్థ పొందింది. తొలిదశ ప్రతిపాదిత పనులివే.. తొలిదశలో ఏలేరు ఇరిగేషన్ కాలువకు 16 బెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం, డబ్బకాల్వ, యర్రకాల్వ, గొర్రిఖండి, వీరవరం కాల్వలు వెడల్పు చేసి ఆధునికీకరించడం చేపట్టాల్సి ఉంది. ఇందుకు 182 ఎకరాల భూము లు సేకరించాలి. ఈ ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే కలెక్టర్‌కు పంపారు. భూసేకరణ పూర్తయితేనే పనులు జరుగుతాయి. అలాగే ఎస్.తిమ్మాపురం వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉంది. దివిలివద్ద బెడ్ రెగ్యులేటర్ పనులు మాత్రం మొక్కుబడిగా చేపట్టారు. రెండో దశలో రూ.167 కోట్లతో ప్రతిపాదనలు ఏలేరు రెండో విడత ఆధునికీకరణకు ఇరిగేషన్ అధికారులు రూ.167 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సుమారు 75 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలిసేలా ఎస్.తిమ్మాపురంవద్ద బెడ్ రెగ్యులేటర్ నుంచి గొర్రిఖండి, సుద్దగెడ్డ మీదుగా యు.కొత్తపల్లి వరకూ ఒకవైపు, కాండ్రకోటవైపు దబ్బ కాలువ, నగరం ఖండిల మీదుగా రెండోవైపు కాలువలను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు కమిటీకి సవాల్‌గా మారిన ఆధునికీకరణ ఏలేరుకు తొలిసారిగా ప్రాజెక్టు కమిటీని నియమించారు. దానిముందు ఆధునికీకరణ అంశం సవాల్‌గా ఉంది. సర్కారు నాన్చుడు ధోరణి నేపథ్యంలో ఈ కమిటీ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ప్రాజెక్టులో రబీకి సరిపడే నీరు లేనందున పనులు చేపట్టే ఆలోచనలో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అయితే రబీకి నీరవ్వకపోతే నష్టపోతామని రైతులు అంటున్నారు. దీనిపై కమిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
నా చెల్లి నన్ను కలిసింది...
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... సుమారు నలభై సంవత్సరాల తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు... కలిసిన సన్నివేశం అందర్నీ అబ్బుర పరచింది. తొమ్మిదేళ్ళ వయసులో అమెరికాకు చెందిన దంపతులకు దత్తత వెళ్ళిన కొరియాకు చెందిన హోలీ ఓబ్రెయిన్... తన చిన్ననాటి సంఘటన గుర్తుకు రావడంతో ఆవేదనలో మునిగిపోయింది. తనను దత్తత ఇచ్చిన తర్వాత తన చెల్లిని సవతి తల్లి అనాథాశ్రమంలో చేర్చినట్లు ఆమెకు లీలగా గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం మెదడులో కదిలిన క్షణం నుంచీ.... ఓబ్రెయిన్ మనసాగలేదు. చెల్లిని చూడాలని పరితపించి పోయింది. ఎలాగైనా ఆమె జాడ తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. తన సోదరి మేగాన్ హుఘ్స్ ను సవతి తల్లి కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేర్చినట్లుగా ఓబ్రెయిన్ కు అస్పష్టంగా గుర్తుకు వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఓ బ్రెయిన్ ను పెంచుకున్న తండ్రి... వేగంగా వెడుతున్న రైలునుంచి పడి మరణించాడు. ఆమెను చూసినవారు గుర్తించి రక్షించడంతో ఆమె బతికి బయట పడింది. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేరింది. అయితే అప్పటినుంచీ ఆమె సవతి తల్లి తన సోదరిని తన నుంచీ దూరం చేసిన క్షణాలు జ్ఞప్తికి వస్తూనే ఉన్నాయి. ఓ రోజు అర్థరాత్రి నిద్రనుంచీ ఉన్నట్టుండి లేచిన ఓబ్రెయిన్ కు కళ్ళ నీళ్ళు ఆగలేదు. తన గతాన్ని తలచుకొని కన్నీరుమున్నీరైంది. ఎలాగైనా తన చెల్లిని కలుసుకోవాలన్న కోరిక ఆమెలో పెరిగిపోయింది. తనను పెంచిన తల్లిని అడిగింది. ఆమె అనాథాశ్రమంలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినా ఓబ్రెయిన్ కు ఎక్కడో ఆశ... తన చెల్లి ఎక్కడో బతికే ఉంది. తనకెప్పటికైనా కనిపిస్తుందన్న నమ్మకంతో ఆమె జాడకోసం ప్రయత్నాలు కొనసాగించింది. చెల్లిని.. అమ్మను అనాథాశ్రమం దగ్గరే చివర్లో చూశాను. ఎలాగైనా ఆమె వివరాలు తెలుసుకోవాలని వార్తా పత్రికలకు కూడ సమాచారం ఇచ్చింది. దీంతో కొరియాలోని అనాథాశ్రమాల్లో వివరాలు సేకరించిన ప్రతినిధులు.. హుఘ్స్ ను కూడా అనాథాశ్రమం నుంచీ ఓ అమెరికన్ దంపతులు పెంపకానికి తీసుకున్నారని, వారు న్యూయార్క్ లో ఉంటారని తెలిపారు. ఓబ్రెయిన్ ఈ సంవత్సర ప్రారంభంలో బే ఫ్రంట్ హెల్త్ పోర్ట్ ఛాలెట్ అనే వైద్య విభాగంలో ఉద్యోగానికి చేరింది.మరో మూడు నెలల తర్వాత హుఘ్స్ కూడా అక్కడే ఫిజికల్ థెరపీ అసిస్టెంట్ గా చేరింది. సుమారు నలభై ఏళ్ళ క్రితం కొరియాలో విడిపోయిన ఆ ఇద్దరు అనాధలు ఒకే ఆస్పత్రిలో... ఒకే ఫ్లోర్ లో ఉద్యోగానికి చేరారు. ఒకే షిఫ్టులో కూడ పనిచేస్తున్నారు. కానీ ఒకరికి ఒకరు పరిచయం లేదు. అక్కాచెల్లెళ్ళేనని అస్సలు తెలియదు. అయితే ఓ రోజు ..ఓ పేషెంట్ కొరియాకు చెందిన మరో నర్స్ ఇక్కడ పని చేస్తోందని... బహుశా మీరిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు అయి ఉండొచ్చని చెప్పింది. విషయం తెలిసిన వెంటనే ఓబ్రెయిన్ ఉత్సాహంగా ఆమెను కలిసేందుకు ప్రయత్నించింది. వివరాలు సేకరించింది. తెలిసిన వివరాలను బట్టి అక్కాచెల్లెళ్ళేనని నిర్థారణ అయింది. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళేనని డీఎన్ ఏ టెస్టులు కూడా ధృవీకరించాయి. అనుమానం తీర్చుకొనేందుకు మరోసారి ల్యాబ్ టెస్టులను చెక్ చేసుకుంది. ''దేవుడు ఇంతటి అదృష్టాన్నిస్తాడని అనుకోలేదు. నా చెల్లి నన్ను కలిసింది. నాకు జీవితంలో కావాల్సింది ఏముంది? ఇప్పుడు నాకు పిల్లలు లేకపోయినా... నా చెల్లికి ఇద్దరు పిల్లలున్నారు. మేమంతా సెలవుల్లో సంతోషంగా గడుపుతాం..'' అంటూ ఓ బ్రెయిన్ ఆనంద భాష్పాలను తుడుచుకూంటూ... చెల్లి హుఘ్స్ ను గట్టిగా హగ్ చేసుకుంది. -
మే డే నాడు విధుల్లో కార్మికులు...
హయత్‌నగర్ (రంగారెడ్డి) : మే డే రోజు కూడా కార్మికులతో గోదాముల్లో పని చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో లేబర్ అధికారులు దాడులు జరిపారు. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని ఫతుల్లాగూడలో జరిగింది. ఫతుల్లాగూడలోని మధురా కోట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ గోదాముల్లో మేడే రోజు కూడా కార్మికులతో పని చేయిస్తున్నట్లు లేబర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందింది. దీంతో గోదాములపై దాడి చేసి కారకులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమన్వయంతో పనిచేస్తా
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని డీఈఓగా బాధ్యతలు చేపట్టిన పండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. అందరి సహకారంతో పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మొదటిస్థానంలో జిల్లాను నిలుపేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జిల్లా డీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తాను చిత్తూరు డీఈఓగా పనిచేస్తున్నప్పుడు ఆందరి సహకారంతో ఆ జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపామన్నారు. మధ్యాహ్న భోజనం, యూనిఫాం తదితర విషయూలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తామన్నారు. కాగా ప్రతాప్‌రెడ్డి మొదటగా 2008లో అనంతపురం డిప్యూటీ డీఈఓగా పనిచేశారు. 2011లో డిప్యూటీ డీఈఓగా తిరుపతికి బదిలీ అయ్యూరు. 2012 ఏప్రిల్‌లో డీఈఓగా పదోన్నతి పొంది చిత్తూరుడీఈఓగా బాధ్యతలు చేపట్టారు. కడప డీఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రతాపరెడ్డికి ఆర్‌ఐపీఓ భానుమూర్తి, డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు, డీఈఓ కార్యాలయ ఏడీలు సుబ్రమణ్యం, దేవదాసు, ఎంఈఓ నాగమునిరెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది అభినంద నలు తెలిపారు. -
బలిజలను బీసీల్లో చేర్చేందుకు కృషి
కడప అర్బన్ : బలిజ, తెలగ, ఒంటరి,కాపు కులస్తులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హోంశాఖ మంత్రి చిన్న రాజప్ప అన్నారు. జిల్లాలో ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ విచ్చేశారు. కడప నగర శివార్లలోని రాజీవ్ సృ్మతివనంలో రాష్ట్ర బలిజ, కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీపీ నారాయణస్వామి అధ్యక్షతన బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బలిజ, కాపు, తెలగ కులస్తుల నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు విచ్చేశారు. ఈ సందర్భంగా చిన్న రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో కోస్తా జిల్లాలలో పర్యటించి బలిజ, తెలగ, కాపు, ఒంటరి కులస్తులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు మొదట చట్టసభల్లో అవకాశం కల్పించారన్నారు. మండలి బుద్దప్రసాద్‌కు శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా, తనకు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవులు ఇచ్చారన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ బుద్దప్రసాద్ మాట్లాడుతూ అనేక మంది బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులస్తులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. ఈ మహాసభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బలిజ కులస్తుల ఐక్యతను చాటామన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌మేడా మల్లికార్జునరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ, టీడీపీ నేతలు దుర్గాప్రసాద్, పసుపులేటి బ్రహ్మయ్య, ప్రసాద్, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ర్ట హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌మండలి బుద్దప్రసాద్ శ్రీ విజయదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించారు. హోం మంత్రికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సింహపురికాలనీలోని న్యాయవాది జీఎస్ మూర్తి స్వగృహానికి వెళ్లారు. శంకరాపురంలోని బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీపీ నారాయణస్వామి ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరించారు. హామీలు నెరవేరుస్తాం రైల్వేకోడూరురూరల్: ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం, హోంశాఖా మంత్రి చినరాజప్ప అన్నారు. రైల్వేకోడూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ విశ్వనాధ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యాన రైతులకు కూడా రుణమాఫీ అయ్యే విధంగా కేబినెట్లో చర్చించామన్నారు. -
24 గంటలూ ఖజానా కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలతో పాటు డీఏ బకాయిలు, ఇతర బిల్లులన్నీ ఈ నెల 24లోగా చెల్లించేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యం వేల సంఖ్యలో ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలకు బిల్లులు వస్తున్నాయి. ఆన్లైన్లో బిల్లుల సమర్పణ ఒక్కసారిగా పెరిగిపోవడంతో సర్వర్స్ డౌన్ అయి మొరాయిస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్థిక శాఖ ఇక నుంచి 24గంటలూ ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలు పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాల వారీ బిల్లుల సమర్పణ గడువును ఈ నెల 19 నుంచి 21 వరకు పొడిగించింది. జిల్లాల వారీగా బిల్లుల సమర్పణ సమయం ఈ విధంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ పీఏవో కార్యాలయం బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి.