కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ టీవీలను పరిశీలిస్తున్న డీజీపీ
కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన డీజీపీ
Published Sun, Sep 25 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
తిరుపతి క్రైం: ఈస్ట్ పోలీస్‌స్టేషన్ మిద్దెపైనున్న కమాండ్ కంట్రోల్‌ను డీజీపీ సాంబశివరావు పనితీరును పరిశీలించారు. తిరుపతి చేరుకున్న ఆయనకు ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణా, సీఐ రాంకిషోర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమల, తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ–చలానా ఆన్‌లైన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల ద్వారా పరిష్కరించిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఫొటోగ్యాలరీని పరిశీలించి, చక్కగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ దిలీప్ కిరణ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Advertisement