బెంగళూరు: మహిళలు నైట్‌షిఫ్ట్‌లో (రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట పనిచేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఐటీ పరిశ్రమ, ఐటీ అనుబంధ విభాగాల్లో మాత్రమే మహిళల నైట్ షిఫ్ట్‌లకు అనుమతి ఉంది. అయితే దీనికి పలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నామని మహిళల నుంచి లేఖలు తీసుకోవాలని చెప్పింది. కనీసం 10 మంది మహిళా ఉద్యోగులు ఉండాలని, మహిళలు పనిచేసే చోట పూర్తి వెలుతురుతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. సీసీకెమెరాల రికార్డులను కనీసం 45 రోజుల పాటు నిక్షిప్తం చేయాలంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పనిచేసిన మహిళల నివేదికలను పరిశ్రమల ఇన్‌స్పెక్టర్‌తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment