factories
-
‘టీజీ’కో టీఎంసీ!
తుంగభద్ర ఒడ్డున ఫ్యాక్టరీలు..! రూ.వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం! చేతిలో మంత్రి పదవి..! ఏకంగా పరిశ్రమలశాఖ! ఇంకేముంది..? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా అధికారంలో ఉండగానే తన ఫ్యాక్టరీల నీటి అవసరాల కోసం చెక్‌డ్యాం నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ ఉపక్రమించారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీ భరత్‌ను మంత్రి పదవి వరించడంతో కర్నూలు ప్రజల తాగునీటి అవసరాల పేరుతో తుంగభద్ర నదిపై చెక్‌డ్యాం నిర్మించి నది ఒడ్డున ఉన్న తమ ఫ్యాక్టరీల నీటి అవసరాలను తీర్చుకునే ఎత్తుగడ వేశారు. అధికార పార్టీ! పైగా మంత్రి పదవిలో ఉండటంతో అధికారులు ‘జీ హుజూర్’ అంటూ ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు.– సాక్షి ప్రతినిధి కర్నూలు కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ కుటుంబానికి తుంగభద్ర నది సమీపంలో రెండు ఆల్కలీస్ ఫ్యాక్టరీలున్నాయి. వీటికి వేసవిలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఫిబ్రవరి–జూన్ మధ్య ఫ్యాక్టరీకి నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉంది. దీంతో టీజీ వెంకటేశ్ తన ఫ్యాక్టరీకి సమీపంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించాలని భావించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో టీజీ మంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించేందుకు 2013 జూన్ 18న జీవో 56 జారీ చేయించారు. రూ.64.89 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించి 0.50 టీఎంసీలు నిల్వ చేసేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ శిలా ఫలకాన్ని కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో జీవో కార్యరూపం దాల్చలేదు. ఆపై టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో 2017లో మరోసారి అధికారులు రూ.177 కోట్లతో డీపీఆర్ రివైజ్ చేసి పరిపాలన అనుమతుల కోసం పంపారు. అయితే సీడబ్ల్యూసీ అనుమతి, నీటి కేటాయింపుల సమస్య, చెక్‌డ్యాం నిర్మిస్తే ఉత్పన్నమయ్యే ఇబ్బందులతో ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కూటమి రాగానే మరోసారి ప్రతిపాదనలుప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, టీజీ భరత్ మంత్రి పదవిలో ఉండటంతో చెక్ డ్యాం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గత నెల 21న ఇరిగేషన్ ఎస్ఈకి ఓ లేఖ రాశారు. నగర భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర, హంద్రీపై చెక్‌డ్యాం నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని, 12 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. దీనిపై అదే నెల 27న ఇరిగేషన్ ఎస్ఈ తిరిగి కార్పొరేషన్ ఎస్ఈకి లేఖ రాశారు.చెక్‌డ్యాం నిర్మాణానికి టెక్నికల్ కమిటీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుకూలతలు, ప్రతికూలతలతోపాటు సమీపంలో రైల్వే బ్రిడ్జి ఉన్నందున ఆ శాఖ నుంచి అభ్యంతరాలు తదితర అంశాలన్నీ పరిశీలించి ఫీజుబులిటి నివేదిక ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అభ్యంతరాలను అధిగమించి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయించే పనిలో మంత్రి భరత్ ఉన్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి అధికారుల ప్రతిపాదన ఇదీ.. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి అవసరాల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. శివారు కాలనీలకు తాగునీటి సమస్య ఉండటంతో మునగాలపాడు వద్ద రూ.15 కోట్లతో మరో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. దీంతో పాటు అమృత్ ద్వారా హంద్రీ–నీవా నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.130 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును రద్దు చేసి చెక్‌డ్యాం నిర్మించాలని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం చెక్‌డ్యాం నిర్మించేందుకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలుస్తోంది. అమృత్ పథకం కింద మంజూరైన రూ.130 కోట్లు కాకుండా తక్కిన మొత్తాన్ని మంజూరు చేయించుకుని చెక్‌డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. చెక్‌డ్యాం నిర్మిస్తే 0.50 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందని, అందులో 0.30 టీఎంసీలు కర్నూలు తాగునీటి అవసరాలకు, తక్కిన 0.20 టీఎంసీలు తన పరిశ్రమలకు వినియోగించుకునేలా జీవో మంజూరు చేసేలా మంత్రి టీజీ భరత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రివర్స్ పంపింగ్ చేస్తారా? కర్నూలు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే హంద్రీ–నీవా నుంచి ప్రతిపాదనలు ఉన్నపుడు దాన్ని పూర్తి చేయకుండా చెక్‌డ్యాంను తెరపైకి తేవడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం టీజీ ఫ్యాక్టరీల కోసమే మంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఒకవేళ చెక్‌డ్యాం నిర్మించాల్సి వస్తే మునగాలపాడు సమీపంలో నిర్మిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు దగ్గరవుతుంది. అలా కాకుండా రాఘవేంద్ర మఠం సమీపంలో చెక్‌డ్యాం నిర్మించి తిరిగి రివర్స్ పంపింగ్ చేయాలని అంటున్నారు.పైగా కర్నూలు మురుగునీరు మొత్తం అందులో నిల్వ ఉంటుందని, తుంగభద్రలో నీటి ప్రవాహం లేనపుడు కేవలం మురుగునీటి మడుగుగా మారే అవకాశం ఉందని, ఆ నీటిని తాగునీటికి ఎలా వినియోగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నీటితో కేవలం టీజీ ఫ్యాక్టరీల అవసరాలు మాత్రమే తీరుతాయని చర్చించుకుంటున్నారు. -
స్రీల శ్రమకు అర్థం లేదా..!
మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా? స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి. తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు. స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్‌సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది. ఇవి చదవండి: మీ అమ్మాయికి చెప్పండి! -
ESZ: మైనింగ్, పరిశ్రమలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అడవుల పరిరక్షణ కోసం మైనింగ్, పరిశ్రమల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను నిషేధించింది. దేశవ్యాప్తంగా ఎకో-సెన్సిటివ్ జోన్లు (ESZ పర్యావరణ సున్నిత మండలాలు), చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించడంపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఈ మేరకు శుక్రవారం.. బఫర్ జోన్‌కు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ జోన్ల వెంబడి జరుగుతున్న తయారీ, తయారీ సంబంధిత కార్యకలాపాలు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే కొనసాగుతాయని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అలాగే ప్రతి రాష్ట్రం తరపున.. చీఫ్ కన్జర్వేటర్ ESZ హోదా కింద వచ్చే నిర్మాణాల జాబితాను సిద్ధం చేసి మూడు నెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు ఉండరాదని పేర్కొంది. -
నలుపు రంగులోకి గోదావరి నీరు.. ప్రమాదం తప్పదు.. జాగ్రత్త!
బాల్కొండ/నిజామాబాద్: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితమవుతోంది. నీరు నలుపు రంగులోకి మారిందని, దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అధికంగా ఉన్నప్పుడు ఎగువ నుంచి వదిలిన వ్యర్థాలు నీటిలో కలిసి పోయి దిగువకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న నీటి నిల్వతో వ్యర్థాల ప్రభావం ఏర్పడుతోంది. ఎగువ భాగాన మహారాష్ట్రలో అధికంగా ఉన్న ఫ్యాక్టరీలు విడుదల చేసిన వ్యర్థాలు నదిలో కలిసి ఎస్సారెస్పీలోకి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీరు కలుషితమవుతుండటంతో ప్రాజెక్ట్‌లో చేపలకు ప్రమాదం పొంచి ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పాప్లెట్ రకం చేపలు మాత్రమే లభిస్తున్నాయని, అక్కడక్కడా మధ్యలో పెద్ద పెద్ద చేపలు మృతి చెందుతున్నట్లు తెలిపారు. నీటి నిల్వ తగ్గి ప్రాజెక్ట్‌లో చేపలకు ఆక్సిజన్ అందక గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ కోసం ప్రతి రోజు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. నీరు కలుషితమైతే తాగు నీటికి కూడ ఇబ్బందే అవుతుంది. ఎంత ప్యూరిఫైడ్ చేసినా రసాయానాలు కలిసిన నీరు తాగడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. పరీక్షలకు పంపుతాం.. ప్రాజెక్ట్‌లోని నీరు ప్రస్తుతం అధికంగా దుర్వాసన వస్తోంది. కొద్దిగా రంగు కూడ మారుతోంది. ఉన్నతాధికారులకు ఇది వరకే నివేదించాం. నీటిని పరీక్షలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
శివార్లలో వ్యర్థాల డంపింగ్..
దుండిగల్: నింగి, నేలా, నీరు.. అన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. మానవ మనుగడకు జీవనాధారమైన వీటిని విషతుల్యంగా కొందరు మారుస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల, దూలపల్లి, అటు సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే గడ్డపోతారం పారిశ్రామికవాడల్లో వందలాది రసాయన పరిశ్రమల నుంచి నిత్యం వెలువడే ఘన, ద్రవ వ్యర్థాలను నగర శివారు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. ఓ వైపు పీసీబీ టాస్క్ ఫోర్స్ ఉన్నా లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో.. డంపింగ్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. చెట్టు పూట్టా అనే తేడా లేకుండా ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు డంప్ చేసేస్తున్నారు. చివరకు చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. ఇప్పటికే నగర శివారులోని కుంటలు, చెరువుల్లో శిఖం భూముల్లో నిత్యం రసాయనాల డంపింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. దీంతో స్థానికులు చర్మ, శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా.. పరిశ్రమల్లో ఉత్పత్తుల సమయంలో వెలువడే రసాయన, ఘన వ్యర్థాలు జేఈటీఎల్‌కు తరలించాల్సి ఉండగా అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో పరిశ్రమల యాజమాన్యాలు డంపింగ్ మాఫియాలను ఆశ్రయిస్తున్నాయి. దీంతో వివిధ పరిశ్రమల నుండి సేకరించే వ్యర్థాలను రాత్రిపూట టీడీసీఎం, ట్రాక్టర్లలో తరలించి నగర శివారులోని ప్రభుత్వ భూములు, కుంటలు, అటవీ స్థలాల్లో పారబోస్తున్నారు. ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డీపోచంపల్లి, సారెగూడెం, దుండిగల్ తండా–1, 2 ప్రాంతాల వాసులు ఎక్కువగా ఈ రసాయనాల డంపింగ్‌లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రైందంటే చాలు ఘాటైన వాసనలతో ఈ ప్రాంత వాసులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై ఈ రసాయనాలు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ అక్రమ డంపింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కానరాని పీసీబీ టాస్క్ ఫోర్స్.. రసాయన పరిశ్రమలపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఏర్పాటు చేసిన పీసీబీ టాస్క్ ఫోర్స్ దాదాపు పనిచేయడం లేదనే చెప్పవచ్చు. ఏదైనా ప్రాంతంలో రసాయనాలు డంప్ చేశారని ఫిర్యాదు వచ్చిన సమయంలోనే అధికారులు హడావుడి చేసి సంబంధిత శాంపిళ్లను తీసుకు వెళ్తున్నారేÆ తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమపై చర్యలు తీసుకున్న దాఖాలు లేవు. అనువైన ప్రాంతం.. మున్సిపాలిటీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు మల్లంపేట నుంచి దుండిగల్ వరకు విస్తరించి ఉంది. దీనికి తోడు ఇక్కడ వేల ఎకరాల ప్రభుత్వ స్థలం, నిర్మానుష్య ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. దీంతో కెమికల్ మాఫియా ఇదే అనువైన ప్రాంతంగా భావించి గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం ప్రాంతాల నుంచి రాత్రికి రాత్రే భారీ ఎత్తున రసాయనాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. మచ్చుకు కొన్ని.. 2021 జూన్ 7న గాగిల్లాపూర్ తండాకి వెళ్లే దారిలో ఓ పరిశ్రమ మెడికల్ వేస్టేజీని డంప్ చేసింది. జూన్ 9, 11 తేదీల్లో దుండిగల్ నుంచి గాగిల్లాపూర్ తండాకు వెళ్లేదారిలో ఉన్న గుర్జకుంటలో భారీ ఎత్తున రసాయనాలను డంప్ చేశారు. ఇదే నెలలో దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎంఎల్ఆర్ఐటీకి వెళ్లే దారిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్ద సుమారు 100కు పైగా డ్రమ్ముల్లో రసాయనాలను డంపింగ్ చేశారు. పీసీబీ బాధ్యత వహించాలి.. తండాల సమీపంలోని చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో భారీ ఎత్తున ఘన, ద్రవ రసాయన వ్యర్థాలను డంప్ చేస్తున్నా పీసీబీ అధికారులు స్పందించడం లేదు. పత్రికల్లో కథనాలు ప్రచురితమైన సమయాల్లోనే వచ్చి హడావుడి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి ప్రజలు అనారోగ్యం పాలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి.– శివనాయక్, బీజేఎం మున్సిపల్ ప్రెసిడెంట్ -
‘కరోనా వస్తే పరిశ్రమ మూసేస్తాం’
సాక్షి, కాకినాడ : ఏదైనా పరిశ్రమ పరిధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైతే ఆ పరిశ్రమను తక్షణమే మూసివేస్తామని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రమాదకర పదార్ధాలు కలిగిన పరిశ్రమల భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, కోరమాండల్, ఎన్ఎప్సీయల్, తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జిల్లాలో ప్రమాదకర పదార్ధాలు కలిగిన 21 పరిశ్రమలు ఉన్నట్లు గుర్తించాము. వారంలోగా ఈ పరిశ్రమలు సేప్టీ ఆడిట్‌పై నివేదిక ఇవ్వాలి. మాక్ డ్రిల్స్‌ను నిర్వహించి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఎలా రక్షణ పొందాలనేదానిపై అవగాహన కల్పించాలి. ప్రమాద సమయాలలో వినియోగించే సైరన్ పని చేస్తుందో లేదో తనిఖీ చేయాలి. ప్రమాదాల నుండి బయట పడే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా సహకారం తీసుకోండి. ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ) ప్రతి పరిశ్రమలో ఉన్న అన్ని యూనిట్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలి. అవి నిరంతరం పని చేయాలి. ఏదైనా ప్రమాదం వాటిల్లితే.. ప్రస్తుత లాక్డౌన్ పరిస్ధితుల వల్ల ఇతర ప్రాంతాల నుండి నిపుణులు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల మనమే ప్రమాదాన్ని త్వరగా నివారించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పరిశ్రమలలో పని చేసే కార్మికులకు పూర్తి భద్రత కల్పించాలి. సోషల్ డిస్టన్స్ పాటించేలా చర్యలు తీసుకోండ’’ని ఆదేశించారు. -
కర్ణాటకలో మహిళలకు నైట్‌షిఫ్ట్
బెంగళూరు: మహిళలు నైట్‌షిఫ్ట్‌లో (రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట పనిచేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఐటీ పరిశ్రమ, ఐటీ అనుబంధ విభాగాల్లో మాత్రమే మహిళల నైట్ షిఫ్ట్‌లకు అనుమతి ఉంది. అయితే దీనికి పలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నామని మహిళల నుంచి లేఖలు తీసుకోవాలని చెప్పింది. కనీసం 10 మంది మహిళా ఉద్యోగులు ఉండాలని, మహిళలు పనిచేసే చోట పూర్తి వెలుతురుతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. సీసీకెమెరాల రికార్డులను కనీసం 45 రోజుల పాటు నిక్షిప్తం చేయాలంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పనిచేసిన మహిళల నివేదికలను పరిశ్రమల ఇన్స్పెక్టర్తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని చెప్పింది. -
కనిపించని గ్రోత్
‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీలు పడుతున్నారు.. వేలాది మందికి ఉపాధి కల్పించాం..వందలాది పరిశ్రమలు తీసుకొచ్చామంటూ’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వేదిక ఎక్కినా ఊకదంపుడు ఉపన్యాసాలతో హోరెత్తిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సరైన ప్రోత్సాహకాలు లేక, పరిశ్రమలు నెలకొల్పేందుకు తగినన్ని వసతులు లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలెవరూ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రాకపోగా..ప్రభుత్వ విధానాలతో నిర్వహణ భారమై ఉన్న పరిశ్రమలూ ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. జిల్లాలోని పారిశ్రామిక గ్రోత్ సెంటర్లలో గత నాలుగేళ్లలో చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో జిల్లాలోని పారిశ్రామికవాడలకు ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు చాలా వరకు మూతబడ్డాయి. పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారం పరిశ్రమలను దాదాపు నిర్వీర్యం చేసింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద 1992 ప్రాంతంలో గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీఐఐసీ ఇక్కడ పారిశ్రామికవాడకు ఏర్పాట్లు చేసింది. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో 131.6 ఎకరాలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో 32.6 ఎకరాలు చొప్పున 164 ఎకరాలు భూములను కేటాయించింది. 2007లో వీటికి సంబంధించి 110 ప్లాట్లు వేశారు. వైఎస్ హయాంలో ఇక్కడ 45 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీలు, పండ్లు కూలింగ్ యూనిట్లు, పచ్చిపండ్లను మాగపెట్టే యూనిట్లు, ఐస్ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న మెకానిక్ షెడ్లు ఏర్పాటయ్యాయి. వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల పాలనలో సింగరాయకొండ గ్రోత్ సెంటర్లో ఒక్క పరిశ్రమ రాలేదు. పసుపు, కారం పొడి ప్యాకింగ్ ఎక్స్‌పోర్ట్స్ యూనిట్లతో పలు పరిశ్రమలు ఇక్కడకు వస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. మరోవైపు గతంలో ఎకరం లక్ష రూపాయలకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎకరం రూ.50 లక్షలు చెబుతున్నారు. మరోవైపు పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారంతో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. మరోవైపు ఇక్కడ గ్రోత్ సెంటర్లో భూముల వివాదం పరిశ్రమలు రాకపోవడానికి తెలుస్తోంది. ఇక్కడి భూములు తమవేనంటూ తొలుత ఎండోమెంట్ విభాగం వివాదం లేవనెత్తింది. ఇందు కోసం ఏపీఐఐసీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక్కడ పారిశ్రామికవేత్తల పోరాటంతో ఎట్టకేలకు ఎండోమెంట్ విభాగం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత రెవెన్యూ భూములు తమవేనంటూ మరో వివాదం లేవనెత్తింది. వరుస వివాదాలతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సమస్యలను పరిష్కరించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు బాబు ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. గుండ్లాపల్లిదీ ఇదే పరిస్థితి: సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1271 ఎకరాల భూములు కేటాయించారు. 644 ప్లాట్లు వేసి పరిశ్రమల పేరుతో పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. వైఎస్ హయాంలోనే ఇక్కడే 400 పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా 250 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లతో పాటు పలు రకాల పరిశ్రమలు నెలకొల్పారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఇక్కడకు పరిశ్రమలు రాలేదు. చంద్రబాబు సర్కారు ఏర్పాటైన నాలుగేళ్లలో ఇక్కడ చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు 10 వరకు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గత నాలుగేళ్లలో 40 పరిశ్రమలు గ్రోత్ సెంటర్లో మూతబడటం గమనార్హం. జీఎస్టీ 28 శాతానికి పెంచటం, విద్యుత్ చార్జీలు మరింతగా పెంచటంతో పాటు పారిశ్రామిక రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో రాయల్టీలో 40 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు సర్కారు పైసా ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. మొత్తంగా అటు సింగరాయకొండ, గుండ్లాపల్లి పారిశ్రామికవాడలు పరిశ్రమల్లేక వెలవెలబోతున్నాయి. ఉన్న పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొనడంపై పారిశ్రామికవేత్తలతో పాటు ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జీఎస్టీతో ఇబ్బందులు జీఎస్టీ అమలులోకి రావటంతో నాలాంటి చిరు వ్యాపారులు దెబ్బతిన్నారు. గతంలో మార్కింగ్ చేసుకుని లోకల్ గా అమ్ముకుంటే కొద్దిగా డబ్బు మిగిలేది. కుటుం బాలు జరుపుకోవటానికి వీలుగా ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ వలన చిరు వ్యాపారులు పూర్తిగా దెబ్బతిన్నారు. దీంతో ఏదో ఒక ఫ్యాక్టరీలలో స్కిల్డ్ వర్కర్లుగా చేరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో చాలా మంది స్కిల్డ్ వర్కర్లు ఉండటంతో అందరికీ సరిపడా ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంది. – శ్యాం, స్కిల్డ్ వర్కర్, వ్యాపారి ప్రోత్సాహకాలు కరువు గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో పలు సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జీఎస్టీ వలన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. గ్రానైట్ పరిశ్రమ మీద జీఎస్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. బ్యాంకులు వ్యాపారస్తులకు సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవటంతో భారంగా మారుతోంది. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో గుండ్లకమ్మ రిజర్వాయర్ పక్కనే ఉన్నా తాగునీరు, వాడుక నీరు లేకపోవటం దారుణం. గ్రానైట్ వ్యర్థాలను రోడ్లపైనే వేస్తుండటంతో 60 అడుగుల రోడ్లు కూడా 15 అడుగులకు కుంచించుకుపోతున్నాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఒక సమయం సందర్భం లేకుండా విద్యుత్ నిలిపి వేస్తుండటంతో మిషనరీ రన్నింగ్ కష్టంగా మారుతోంది. గ్రోత్‌సెంటర్ మొత్తంలో డ్రైనేజి వ్యవస్థ లేకపోవటం మరీ దారుణం. పబ్లిక్ టాయిలెట్లు లేకపోవటంతో రోడ్లపైనే మల విసర్జన చేస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ లేదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్యాక్టరీలు పెట్టడానికి ఎలా వస్తారు. – టీవై రెడ్డి, ఎండీ , లిఖిత ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ -
సరూర నగర్ చెరువులో విషపు నురగ
-
అవినీతి జలగలూ...పీడించొద్దు
కలెక్టర్ కే.భాస్కర్ ఏలూరు సిటీ: జిల్లాలో నూతనంగా పరిశ్రమలు స్థాపించేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తోన్న పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టవద్దని, అవినీతి జలగలు పారిశ్రామిక వేత్తలను పీడించొద్దని కలెక్టర్ హితవు పలికారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రొత్సాహక మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15 రోజుల్లో సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు మంజూరుచేస్తామని పరిశ్రమల శాఖ గొప్ప చెప్పడమే తప్ప దరఖాస్తు చేసిన ఏడాదికి కూడా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకపోతే పరిశ్రమలు స్ధాపించడానికి ఎవరు ముందుకు వస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. పారిశ్రామికవేత్త దరఖాస్తులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అక్కడికక్కడే సరిదిద్ది ఏ విధంగా పరిశ్రమకు అనుమతివ్వాలో పారిశ్రామికవేత్తలకు మంచి సలహాలు సూచనలు అందించి పారదర్శకంగా 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తేనే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి సాధించగలదన్నారు. పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో మార్క్‌ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టరు చెప్పారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు,పరిశ్రమల శాఖడిప్యూటీ జీఎం ఆదిశేషు, డీపీఓ కె.సుధాకర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కోటయ్య పాల్గొన్నారు. -
మేం పరిశ్రమలకు కాదు, కాలుష్యానికి వ్యతిరేకం
పాలకోడేరు: మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, వాటి కాలుష్యానికి మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. సాగు, తాగునీరు కాలుష్యంపై పోరాటం చేస్తూ ప్రజాభేరి పాదయాత్ర నాల్గవ రోజు మండలంలోని వేండ్ర, మోగల్లు, పాలకోడేరు, గరగపర్రు, గొల్లలకోడేరు గ్రామాల మీదుగా మంగళవారం సాగింది. యాత్ర 14 రోజులు 16 మండలాల్లో 400 కి.మీ చేస్తూ డిసెంబర్ 9న ఏలూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నా జరపనున్నామన్నారు. ఆయా గ్రామాల్లో విప్లవ వీరులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు, అణుశాస్త్ర వేత్త ఏఎస్రావు, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయా గ్రామల ప్రజలు పాదయాత్ర నాయకులకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. గోస్తనీ నది కాలుష్యం వల్ల మా ప్రాంత సాగు, తాగునీరు కలుషితమైపోయిందని రోగాల భారిన పడుతున్నామని పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కాలుష్యం పోరాటం చేస్తుంటే కొద్దిమంతి పెట్టుబడిదారులు మేం పరిశ్రమలకు వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రావాలని, ఉపాధి పెరగాలని ఆకాంక్షించారు. గుత్తలవారి పాలెం గోస్తనీ నది వద్ద నది ప్రక్షాళన చేయాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో ఎం.రామాంజనేయులు, ఎం.శ్రీనివాస్ దళ సభ్యులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జుత్తిగ నర్సింహమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జేఎన్వీ గోపాలన్, మండల కార్యదర్శి అల్లూరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సర్టిఫికెట్ల పరిశీలన
ఏలూరు (మెట్రో) జిల్లాలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 54 గ్రూపులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 గ్రూపులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు ధృవీకరించారు. పరిశీలన పూర్తి చేసుకున్న గ్రూపుల అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత తెలిపారు. ఎంపికైన గ్రూపులకు పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు రూ. 10 లక్షల బ్యాంకు రుణం, రూ. 10 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ అందించనున్నట్లు ఆమె చెప్పారు. -
కాపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సర్టిఫికెట్ల పరిశీలన
ఏలూరు (మెట్రో) జిల్లాలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 54 గ్రూపులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 గ్రూపులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు ధృవీకరించారు. పరిశీలన పూర్తి చేసుకున్న గ్రూపుల అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత తెలిపారు. ఎంపికైన గ్రూపులకు పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు రూ. 10 లక్షల బ్యాంకు రుణం, రూ. 10 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ అందించనున్నట్లు ఆమె చెప్పారు. -
దక్షిణ కొరియాను వణికిస్తోన్న చాబా టైపూన్
-
బ్యాంకులు, ఫ్యాక్టరీలు బంద్..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు శుక్రవారం రోజు మూతపడనున్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడవ వేతన సంఘ సిపారసులను తమకు వర్తింపచేయాలని కనీసం వేతనం నెలకు రూ.18,000లకు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు 12 డిమాండ్ల సాధనకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగ్గనున్నాయి. ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్ల తెరుస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు శుక్రవారం ఈ సమ్మె చేయనున్నాయి. . మరోవైపు ట్రేడ్ యూనియన్ల నిర్వహించబోయే ఈ బంద్‌ను ఎలాగైనా ఆపాలని కేంద్రప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయంపై ప్రధాని మోదీ నేడు ఎమర్జెన్సీ మీటింగ్‌ను నిర్వహించారు. ప్రధాని నిర్వహించబోయే ఈ మీటింగ్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కార్మికశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం విఫలమవ్వడంతో ప్రధాని మోదీ ఈ మీటింగ్ నిర్వహించారు. మరో 48 గంటల్లో కార్మిక సంఘాలను సంప్రదించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల వివిధ యూనియన్లు కూడా శుక్రవారం జరగబోయే బంద్‌లో పాల్గొనబోతుండటంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు తీవ్ర అంతరాయం కలుగనుంది. అయితే ట్రేడ్ యూనియన్లు నిర్వహించబోయే ఈ బంద్‌లో రైల్వే ఉద్యోగులు పాల్గొనే సంకేతాలు లేకపోవడంతో, రైళ్లు యథాతథంగా తిరగనున్నట్టు సమాచారం.ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ సమ్మెపై తీవ్ర ఇరకాటంలో పడింది. సమ్మెకు మద్దతిస్తే ప్రభుత్వ పక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు విమర్శలు వస్తాయని ఆలోచిస్తోంది. -
పరలోక ధనాన్ని ఎలా కూర్చుకోవాలి?
సువార్త ఒక కోటీశ్వరుడు తానెంత ధనవంతుడినో తన చర్చి పాస్టర్కు వివరిస్తున్నాడు. తనకు ఉత్తరాన చమురు బావులు, దక్షిణాన వేలాది ఎకరాల్లో వ్యవసాయం, తూర్పున బోలెడు కర్మాగారాలు, పడమట ఎన్నో వాణిజ్య సంస్థలున్నాయన్నాడు. ‘కాని నీవు నిరుపేదవే’ ఎందుకంటే ఆ వైపు నీకేమీ లేవు కదా!’ అన్నాడా పాస్టర్ ఆకాశం వైపు చేయి చూపిస్తూ. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి విస్తారంగా పండిందట! అందువల్ల అతను తన పాతకొట్లు పడగొట్టి కొత్తవి, పెద్దవి కట్టించి చాలా ఏళ్లకు సరిపడా ధనాన్ని, ధాన్యాన్ని కూర్చుకొని ఇక తిని, తాగి సుఖించడానికి పూనుకున్నాడు. అయితే దేవుడు పిచ్చివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం పోతే నీ గతి ఏమిటి? పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నించు’ అని అతన్ని హెచ్చరించాడు (లూకా 12ః 16-21). ధనార్జన తప్పు కాదు. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, వ్యవసాయ కార్యకలాపాలు లేకపోతే మన కనీసావసరాలెలా తీరుతాయి? పేదలకు జీవనోపాధి ఎలా? కాని ధనార్జనే ధ్యేయంగా, స్వార్థమే పరమార్థంగా బతకడాన్ని, తన స్వరూపంలో సృజించబడిన మనిషిలో పరలోక భావనలు లేకపోవడాన్ని మాత్రం దేవుడు హర్షించడు. ఎంతోమంది పనివారి అహర్నిశల శ్రమ, నీరు సూర్యరశ్మిని ధారాళంగా ఇచ్చిన దేవుని కృపతో పంట సమృద్ధిగా పండితే, అదేదో తానొక్కడి విజయమేనన్నట్టు ధనవంతుడు ఆ పంటను పనివారితో పంచుకోకుండా, దేవునికీ ఆయన భాగమివ్వకుండా తానే తిని తాగి సుఖించాలనుకోవడంలోని స్వార్థాన్ని, డొల్లతనాన్ని దేవుడెత్తి చూపించాడు. ‘నేనొకరికివ్వను, ఒకరిది తీసుకోను’ అన్నది మరికొందరి జీవన సిద్ధాంతం. సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైన తెగ. ‘నాది నాకుంది, నీది నీవే ఉంచుకో!’ అన్న యాకోబు సోదరుడు ఏశావు తాలూకు శాపగ్రస్తుల సంతతివారు (ఆది 33:9). తీసుకోకపోతే ఫరవాలేదు కానీ విశ్వాసియైనవాడు తప్పక ఇచ్చేవాడై యుండాలి. ఎందుకంటే మనలోని దైవస్వభావంలో ‘ఇచ్చే గుణం’ ఇమిడి ఉంటుంది. శ్వాస తీసుకోకుండా బతకలేనట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగువాడిని ప్రేమించకుండా, అతనికివ్వకుండా విశ్వాసి బతకలేడు. పైకి విస్తరిస్తున్నా నానాటికీ కుచించుకుపోతున్న సమాజం, స్వభావాల మధ్య మనం బతుకుతున్నాం. ఎంత ఉన్నా ఇంకా కావాలన్న నిరంతర తాపత్రయంలో ‘తృప్తి’ ఎండమావి అయింది. పరలోకంలో ధనం కూర్చుకొమ్మని దేవుడు ఆదేశిస్తే, ఈ లోకాన్నే ధనశక్తితో పరలోకంగా మార్చుకోబోయి పీడకలలాంటి నేటి సమాజాన్ని నిర్మించుకొని దానికి బానిసలమయ్యాం. ఒకప్పుడు 9 వేల సరుకులమ్మే సూపర్ మార్కెట్లు పదేళ్ల తర్వాత ఇపుడు సగటున 40 వే సరుకులు అంటే నాలుగింతలు అమ్ముతున్నాయన్నది ఒక సర్వే సారాంశం. కాని మనిషి ఆనందాన్ని అవి నాలుగింతలు అధికం చేయలేదు సరికదా సగానికి తగ్గించాయి. మనిషి నిండా ‘నేను’ అనేవాడే నిండిపోయి చుట్టూ తానే గీసుకున్న వలయానికే అతని జీవితం పరిమితమై కుళ్లి కపు కొడుతోంది. దేవుని నిజంగా ప్రేమిస్తే పాటి మనిషిని ప్రేమించకుండా విశ్వాసి బతకలేడు. దేవుడంటే చాలా ప్రేమ కాని పక్కవాడిని కనీసం కన్నెత్తి కూడా చూడననే వాడిదే కపట ప్రేమ. ‘నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు’ అన్న దైవోక్తిలోనే పరలోకంలో ధనవంతులమయ్యే మార్గం ఉంది. అందుకే ‘ప్రేమించకుండా ఇవ్వగలమేమో కాని ఇవ్వకుండా ప్రేమించలేము’ అంటాడు కార్ మైఖెల్ అనే మహాభక్తుడు. - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
మట్టినీ అమ్ముకుంటున్నారు
నీరు-చెట్టు కింద జిల్లావ్యాప్తంగా చేపట్టిన పనులు 5,102 మంజూరైన నిధులు రూ. 38.96 కోట్లు ఇప్పటివరకు 45శాతం పనులు కాగా.. అందులో 50 శాతం నిధులు దుర్వినియోగం సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం కొత్తూరు చెరువులోని మట్టిని ఇటుకల బట్టీకి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. రోసనూరుకు చెందిన టీడీపీ నాయకుడు చెరువులో పూడికతీత పనులు చేయకుండా సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద ఉన్న గ్రావెల్‌తో కాలనీకి రోడ్డువేశారు. అశాఖ అధికారులతో కుమ్మక్కై నిధులు స్వాహా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. శిరసనంబేడు చెరువులో పూడికతీత పనులు చేపట్టకుండా టీడీపీకి చెందిన ఓ నాయకుడు రొయ్యల సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటను తీసి నీరు-చెట్టు పథకం కింద నిధులు రాబట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తమ్ముళ్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం భూగర్భజలాల అభివృద్ధి.. పర్యావరణ పరిరక్షణ కోసం ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 5,102 పనులును చేపట్టారు. ఇందులో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చెరువులు, అటవీశాఖ ద్వారా కుంటలు, డ్వామా పరిధిలో కాలువలు, చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి మొత్తం రూ.38.96 కోట్లు నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో నుంచి తీసిన మట్టిన రైతుల పొలాలకు తరలించాల్సి ఉంది. అయితే అనేకచోట్ల టీడీపీ నాయకులు ఫ్యాక్టరీలు, ఇటుకబట్టీలు, కృష్ణపట్నం పోర్టుకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీరు-చెట్టు పథకం కింద ఇప్పటివరకు 45 శాతం నిధులు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. అందులో 50 శాతం వరకు నిధులు దుర్వినియోగమైనట్లు అధికారి ఒకరు వెల్లడించారు. నీరు-చెట్టు పథకం కేవలం తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రవేశపెట్టారని అధికారులు కొందరు చెపుతున్నారు. పనులు చేయకపోయినా కాసులే జిల్లాలో అనేకచోట్ల టీడీపీ నేతలు గ్రామసభలు నిర్వహించుకుండానే పనులు చేపట్టారు. ఉదయగిరి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి, కోవూరు, వెంకటగిరి పరిధిలోని కొన్ని చెరువుల్లో గతంలో పూడికతీత పనులు చేసి ఉన్నారు. వాటిని తాజాగా నీరు-చెట్టు కింద పనులు చేపట్టినట్లు రికార్డులు సృష్టించుకున్నట్లు సమాచారం. గతంలో ఎవరో పనులు చేసి ఉంటే.. తాజాగా టీడీపీ నేతలు చేసినట్లు గిమ్మిక్కులు చేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోనే రూ.56 లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో 36 చెరువుల్లో రెండు విడతలుగా పనులు చేపట్టారు. ఒక్కో చెరువుకు రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.78 లక్షలు నిధులు మంజూరయ్యాయి. వాటిలో 60 శాతం నిధులు మింగేశారు. అదేవిధంగా సూళ్లూరుపేట, ఓజిలి, కోట, వాకాడు, చిల్లకూరు మండలాల్లో కొందరు మట్టిని అమ్ముకుని సొమ్ముచేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాయుడుపేట పరిధిలో 20 చెరువుల్లో పనులు చేపడితే.. అందులో 50 శాతం మట్టిని అమ్మి సొమ్ముచేసుకున్నట్లు సమాచారం. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో చేపట్టిన చెరువు పనుల్లోనూ పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువులో గ్రావెల్ తీసి దాన్ని రెండు రకాలుగా వినియోగించి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి జెడ్పీ మీటింగ్‌లో అధికారులను నిలదీశారు. ఇకపోతే జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే చెరువు మట్టిని తరలించాలి. అలాకాకుండా వేరొకరికి తరలిస్తే నిధులు మంజూరుకాకుండా అడ్డుకుంటున్నట్లు పలు ప్రాంతాల నుంచి రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినట్ల్లు తెలిసింది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో నీరు-చెట్టు పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కాలకూట విషం
భూగర్భంలోనూ కాలుష్య జలాలే.. పరిశ్రమల ఇష్టారాజ్యమే కారణం యథేచ్ఛగా వ్యర్థ జలాల ప్రవాహం నిఘా శూన్యం..పీసీబీ విఫలం పాలకులు కళ్లప్పగించి చూస్తున్న వైనం కాలుష్యం జడలు విప్పుతోంది.. విష జలాలు ఏరులై పారుతున్నాయి.. వర్షం వచ్చిందంటే వరదలై ఉరకలెత్తుతున్నాయి. ప్రజల జీవితం ప్రాణసంకటంగా మారుతోంది.. నిఘా పెట్టాల్సిన పీసీబీ చోద్యం చూస్తోంది.. భూగర్భంలోంచి సైతం కాలకూటం చిమ్ముతోంది.. పారిశ్రామిక వాడలు కాలుష్యకాసారంలో చిక్కుకుంటున్నాయి. అయినా పాలకుల్లో చలనంలేకపోవడం గమనార్హం. మెదక్(జిన్నారం): జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 200 వరకు వివిధ రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను నిబంధనలకు విరుద్ధంగా, యథేచ్ఛగా బహిరంగ ప్రదేశాలకు వదులుతుంటాయి. వర్షాకాలం పరిశ్రమల యాజమాన్యాలకు ఇందుకు వేదికగా మారుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలోనే వర్షం నీటితో కలిపి కాలుష్య జలాలను బయటకు వదులుతున్నారు. దీంతో గ్రామాలు పూర్తిగా కాలుష్య మయంగా మారుతున్నాయి. ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు కిష్టాయిపల్లి, అల్లీనగర్, చెట్లపోతారం తదితర గ్రామాల భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యంగా మారాయి. వ్యవసాయం కోసం భూగర్భ జలాల నుంచి నీటిని తోడితే పసుపు, నీలి రంగుల్లో నీటి ప్రవాహం ఉందంటే ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలుష్య జలాల ప్రవాహాన్ని సైతం నివారించటంలో పీసీబీ టాస్క్‌ఫోర్స్, పీసీబీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను బయటకు వదలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 86 పరిశ్రమలకు నోటీసులు వర్షా కాలంలో అప్రమత్తంగా ఉండాలని, కాలుష్య జలాలను బయటకు వదలవద్దని సూచిస్తూ మండలంలోని సుమారు 86 రసాయన పరిశ్రమలకు నోటీసులు జారీ చేశాం. కాలుష్య జలాలను బయటకు వదలకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తాం. - నరేందర్, పీసీబీ ఈఈ -
‘చక్కెర’కు చేదు ఫలం!
తుఫాన్ తాకిడితో కోలుకోలేని దెబ్బ ధ్వంసమైన గోవాడ, తుమ్మపాల, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు రూ.40 కోట్ల యంత్రాలు, రూ.110 కోట్ల పంచదార లాస్ చోడవరం : హుదూద్ తుఫాన్ బీభత్సం సహకార చక్కెర కర్మాగారాలకు చేదు ఫలం మిగిల్చింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చింది. మరో నెలరోజుల్లో అన్ని ఫ్యాక్టరీలు క్రషింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఊహించని విపత్తు ఫ్యాక్టరీలను కుదిపేసింది. జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, అనకాపల్లి (తుమ్మపాల), తాండవ చక్కెర కర్మాగారాలకు తీరని నష్టం వాటిల్లింది. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఫ్యాక్టరీలు కావడంతో మిషనరీ, గోదాముల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తుఫాన్ వర్షాలకు మిషనరీ తడిసి దెబ్బతినగా గోదాముల పైకప్పులు ఎగిరిపోయి నిల్వ ఉంచిన పంచదార బస్తాలు తడిసిపాడయ్యాయి. తాం డవ ఫ్యాక్టరీకి అంతగా నష్టం జరగకున్నా మిగతా మూడు ఫ్యాక్టరీలకు భారీ నష్టమే మిగిలింది. దాదాపు రూ.150 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఒక్క గోవాడ ఫ్యాక్టరీలోనే రూ.14 కోట్ల విలువైన మిషనరీ ధ్వంసమైంది. గోదాముల్లో నిల్వ ఉంచిన రూ.82 కోట్ల విలువైన 2 లక్షల 52 వేల బస్తాల పంచదార తడిసిపోయింది. ఏటికొప్పాకలో రూ.5 కోట్ల మేర ప్లాంట్‌కు, రూ.10 కోట్ల విలువైన పంచదారకు నష్టం జరిగింది. తుమ్మపాల సుగర్స్ మిషనరీ పూర్తిగా దెబ్బతింది. పాతమిల్లు కావడంతో గాలుల విధ్వంసానికి ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. రూ.9 కోట్ల మేర ఫ్యాక్టరీకి నష్టం వాటిల్లగా రూ.2 కోట్ల విలువైన పంచదార తడిసిపోయింది. వీటన్నింటికీ బీమా సదుపాయం ఉ న్నప్పటికీ ప్రభుత్వం మరో రూ.70 కోట్ల మేర ఆదుకోవాల్సి ఉందని ఆయా ఫ్యాక్టరీల యాజ మాన్యాలు, పాలకవర్గాలు కోరుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు తుఫాన్ బీభత్సంతో ఫ్యాక్టరీలకు నష్టం జరగడం ఒక ఎత్తయితే, క్రషింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విపత్తు ఎదుర్కోవాల్సి రావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పంట కోతకు రావడంతో చెరకు సరఫరాకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో తుఫాన్ విరుచుకుపడింది. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో చెరకు పంట నేలమట్టమైనట్లు ప్రాథమిక అంచనా. ఇందులో 40 వేల ఎకరాల్లో పంట పూర్తిగా పక్వానికి వచ్చిన దశలో ఉంది. తొలివిడత క్రషింగ్‌కు కటింగ్ ఆర్డర్ ఇచ్చేది ఈ పంటకే. ఈ పరిస్థితుల్లో తోటలన్నీ ఒరిగిపోయి నీటమునగడంతో రికవరీ ఐదు శాతానికి మించి రాదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. ఈ విధంగా లెక్కేస్తే రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లినట్లే. పంట దెబ్బతిని రైతులు, ఫ్యాక్టరీలు దెబ్బతిని యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పరిస్థితి ఏదైనా సకాలంలో క్రషింగ్ ప్రారంభం కాకుంటే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు ప్రభుత్వ ఆసరా కోసం ఎదురు చూస్తూ, మరోవైపు బీమా సొమ్ము కోసం అన్ని పాట్లు పడుతున్నాయి. తక్షణం ప్రభుత్వం ఆదుకోకుంటే సహకార ఫ్యాక్టరీల మనుగడ మరింత ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం ఉంది. డిసెంబర్‌కు క్రషింగ్ ఎన్నిఅడ్డంకులు ఎదురైనా డిసెంబర్ మొదటి వారానికి క్రషింగ్ ప్రారంభిస్తాం. తుఫాన్ తాకిడికి తీవ్ర నష్టం జరిగింది. అయినా రైతు శ్రేయస్సు దృష్ట్యా క్రషింగ్‌కు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఫ్యాక్టరీ మిల్లు హౌస్ మరమ్మతుకు కూలీలను, అవసరమైన సామగ్రి సమకూర్చుతూ మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం. సహకార చక్కెర ఫ్యాక్టరీల మనుగడను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొంతమేర ఆదుకోవాలి - గూనూరు మల్లునాయుడు, చైర్మన్ గోవాడ సుగర్స్ -
ఫ్యాక్టరీలు, షాప్‌ల వద్దా ‘బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు, దుకాణాలు, ప్రైవేటు సంసల్లో కూడా బతుకమ్మ వేడకలను ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను వైభంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ప్రైవేటు సంస్థలు, షాపులు, ఫాక్యక్టరీల్లో కూడా అక్కడి మహిళా ఉద్యోగులు, కార్మికులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని దుకాణాలు, ప్రైవేటు ఫ్యాక్టరీలు, సంస్థల యామాన్యాలు, కార్మిక సంఘాలు, వివిధ సంస్థలతో సమావేశాలను నిర్వహించి వారికి బతుకమ్మ పండుగ నిర్వహించడానికి దిశానిర్దేశం చేయాలని కోరింది. దుకాణాలను సుందరంగా అలంకరించిన యజమానులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నామని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ చంద్రవదన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో.. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు బంగారు బతుకమ్మ ఉత ్సవాలను వివిధ జిల్లాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్‌సాగర్ వెల్లడించారు. అక్టోబరు 2న సద్దుల బతుకమ్మను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తామని తెలిపారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో... ఈ నెల 29న అన్ని జిల్లాల మహిళా ఉద్యోగులతో హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని టీఎన్జీఓస్ సమావేశం నిర్ణయించింది. శనివారం టీఎన్జీవోస్ మహిళా విభాగం చైర్పర్సన్ రేచల్ ఆధ్వర్యంలో టీఎన్జీఓస్ సమావేశం జరిగింది. -
తగ్గుతున్న చెరకు సాగు
=లక్ష్యం మేరకు గానుగాటపై అనుమానాలు =తలలు పట్టుకుంటున్న సుగర్స్ యాజమాన్యాలు =అతివృష్టితో కొత్త చిక్కులు అనకాపల్లి/చోడవరం,న్యూస్‌లైన్: కోటి ఆశలతో జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు క్రషింగ్‌కు సన్నద్ధమవుతున్నాయి. గోవాడలో బాయిలర్‌పూజకూడా చేపట్టారు. ఈ నెల మూడో వారం నుంచి రెగ్యులర్ గానుగాటకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కానీ ఆయా యాజమాన్యాలకు చెరకు కొరత బెంగ పీడిస్తోంది. సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోవడం ఇందుకు కారణం. ఇది పరోక్షంగా క్రషింగ్ లక్ష్యాలపై కనబడుతోంది. రాష్ట్రంలోని 11 సహకార చక్కెర కర్మాగారాల్లో మూడు మూత పడ్డాయి. ప్రస్తుతం 8 ఫ్యాక్టరీలు మాత్రమే గానుగాటకు సిద్ధమవుతున్నాయి. ఇందులో నాలుగు జిల్లాలోనే ఉన్నాయి. మరొకటి సరిహద్దులోని భీమసింగిలో ఉంది. జిల్లాలో వరి తర్వాత చెరకుయే ప్రధాన పంట. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ పంట సాగులో జిల్లా ఒకప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేది. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. జిల్లాలోని ఒక్క గోవాడ(చోడవరం) చక్కెర కర్మాగారం లాభాల్లో పయనిస్తోంది. ఏటికొప్పాక అరకొరగా లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, గతంలో పేరుకుపోయిన నష్టాల నుంచి గట్టెక్కలేకపోతోంది. తాండవదీ అదే పరిస్థితి. తుమ్మపాల ఆరేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ఏడాదికేడాది కనాకష్టం మీద గానుగాడుతోంది. పురాతన యంత్రాలు, పరికరాలతో ప్రతి సీజన్లోనూ క్రషింగప్పుడు అన్ని ఫ్యాక్టరీల్లోనూ అంతరాయం ఏర్పడుతోంది. పరోక్షంగా రికవరీ రేటు పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో సుగర్స్ యాజమాన్యాలు రాయితీలు, మద్దతు ధర కల్పనలో విఫలమవుతుండటంతో రైతులు ఏటేటా సాగును తగ్గించేస్తున్నారు. వార్షిక పంట అయిన దీనితో ఏడదంతా అపసోపాలు పడేకంటే, ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, సరుగుడు వంటివి మేలని భావిస్తున్నారు. ఈ కారణంగానే విస్తీర్ణం పడిపోతుందనేది సుగర్స్ యాజమాన్యాల ఆందోళన. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,358 హెక్టార్లు. ఈ ఏడాది 26,834 హెక్టార్లలో వేశారు. గతంలో కర్మాగారాలకు సరఫరాతోపాటు బెల్లం తయారీ, విత్తనానికి కలిపి సుమారు 50 వేల హెక్టార్లలో పంటను చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇదే దుస్థితి కొనసాగితే కర్మాగారాలకు భవిష్యత్‌లో చెరకు దొరకదు. దీనికితోడు ఇటీవల భారీ వర్షాల కారణంగా చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి. లక్ష్యం మేరకు క్రషింగ్‌కు పరిస్థితులు లేవనే భావన అటు రైతులలోను, ఇటు కర్మాగారాల యాజమాన్యాలలోను వ్యక్తమవుతోంది. -
డ్వామా తనిఖీ డ్రామా
=చెరకుకు చాలీచాలని మద్దతు ధర =సాయం చేయని రాష్ట్ర ప్రభుత్వం =భారీ వర్షాలతో దిగుబడిపై ప్రభావం =ఆదుకోకుంటే అన్నదాతకు కష్టమే సాక్షి, విశాఖపట్నం : తీపిని పంచే చెరకు రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. మరోవైపు ప్రకృతి కన్నెర్ర చేసింది. మద్దతు ధరకు నోచుకోక నష్టాల బాట పడుతున్న అన్నదాతను ఇటీవల కురిసిన భారీ వర్షాలు పుట్టిముంచాయి. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చెరకు సాగు వ్యయం ఏటేటా పెరిగిపోతోంది. కానీ కేంద్ర ప్రభుత్వమిచ్చే మద్దతు ధర ఆ స్థాయిలో పెరగడం లేదు. తమవంతుగా ఆదుకోవల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో సహకార చక్కెర కర్మాగారాల దయాదాక్షిణ్యాలపైన చెరకు రైతులు ఆధారపడుతున్నారు. నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో అవికూడా ఇప్పుడు సాయం చేసే పరిస్థితుల్లో లేవు. ఫలితంగా చెరకు సాగంటేనే రైతులు హడలిపోతున్నారు. జిల్లాలో సుమారు 1.5 లక్షల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. ఇందులో 60నుంచి 70వేల ఎకరాల పంట గోవాడ, అనకాపల్లి,ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలకు సరఫరా చేస్తున్నారు. దాదాపు 40వేల మంది రైతులు క్రషింగ్‌పై ఆధారపడి కొనసాగుతున్నారు. టన్ను చెరకుకు కనీసం రూ.2500 ఇస్తే తప్ప గిట్టుబాటు కాదు. అంత మొత్తం వచ్చేలా అధికారులు, మంత్రులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పట్టించుకున్న దాఖలాల్లేవు. 2011-12లో కేంద్రం టన్నుకి రూ.1600 మద్దతు ధర ప్రకటించింది. దీనికి మరో రూ.200కలిపి కర్మాగారాలు చెల్లించాయి. దానికదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.200 ఇచ్చింది. దీంతో అప్పట్లో కాస్త గిట్టుబాటైంది. కానీ 2012-13లో కేంద్ర ప్రభుత్వం రూ. 1700 మద్దతు ధర ప్రకటించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 300కలిపి రూ. 2వేల వరకు ఇస్తారని రైతులు ఆశించారు. సీజన్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం రాలేదు. దీంతో కర్మాగారాలే తమకొచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం ఇచ్చాయి. కానీ ఆ సాయం ఎటూ సరిపోలేదు. రైతులు నష్టాలనే చవిచూశారు. మహరాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లోనైతే కేంద్రం ప్రకటించే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి చైరకు రైతులకు అందజేశాయి. వాటితో పాటే ప్రోత్సాహకాలు ఇచ్చాయి. దీంతో అక్కడ రైతులు మంచి లాభాలు ఆర్జించారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇక 2013-14సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.2100మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈలోపే భారీ వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల చెరకు నీట మునగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర లభించక, ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం లేక రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు. పోనీ గతంలో మాదిరిగా కర్మాగారాలు ఆదుకుంటాయనకుంటే ఇప్పుడా పరిస్థితిలో లేవు. ఆధునికీకరణకు నోచుకోకపోవడం, నిర్వహణ వ్యయం పెరగడం, పంచదార ధర ఆశించిన స్థాయిలో లేకపోవడంతో లాభాలొచ్చే అవకాశాల్లేకుండా పోయింది. ఈ క్రమంలో కర్మాగారాలు ఉదారంగా రైతుకు కొంత ఇచ్చే అవకాశం లేదు. ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం తమవంతుగా సాయమందించకపోతే చెరకు సాగుకు రైతులు వెనకడుగేసే అవకాశం ఉంది. -
మొలాసిస్తో మోదం
చక్కెర ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. మూడు నెలల వ్యవధిలో ధర రెట్టింపయింది. డిస్టలరీ యూనిట్లతో పాటు మొలాసిస్ అనుబంధ రంగాల్లో దీని వాడకం బాగాపెరగడంతో అమాంతం ధరలు ఆకాశాన్నంటాయి. దీని అమ్మకాలతో జిల్లాలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు ఈ ఏడాది సుమారు రూ. 6 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. సుగర్స్ యాజమాన్యాల్లో ఉత్సాహం వెలువెత్తుతోంది. పంచదార ధర తగ్గిపోయిందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న తరుణంలో మొలాసిస్ ధరలు భారీగా పెరగడం కలిసొచ్చింది. గత మూడేళ్లతో పోల్చుకుంటే భారీ మొత్తంలో లాభం రావడం ఇదే మొదటి సారి. చోడవరం, ఏటికొప్పాక, తాండవ,తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాల్లో చోడవరం, ఏటికొప్పాక మిన హా మిగిలిన రెండు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచదార ధర క్వింటా రూ.2950 లోపే అమ్ముడుపోవడంతో బాగా నష్టపోయాయి. బహిరంగ వేలంలో సీల్ టెండర్ల ద్వారా మొలాసిస్ అమ్మకాలతో మంచి ధర వచ్చింది. గతేడాది మెట్రిక్ టన్ను రూ.900లు ధర పలికిన మొలాసిస్ ఈ సీజన్ ప్రారంభంలో రూ.2100లకు,ఏప్రిల్ నాటికి రూ.3055 నుంచి 3150లకు విక్రయించారు. ఇప్పుడు రూ. 6వేలు పలుకుతోంది. గత సీజన్లో చోడవరం ఫ్యాక్టరీ 27,500మెట్రిక్ టన్నుల అమ్మకంతో రూ. 3.79కోట్లు మాత్రమే వస్తే, ఈ సీజన్లో 23,200 మెట్రిక్ టన్నుల విక్రయంతో రూ. 6.14 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే తక్కువ సరుకు అమ్మినప్పటికీ సుమారు రూ. 2.35కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. తాండవ 98,500 మెట్రిక్ టన్నులు అమ్మి రూ.1.15 కోట్లు, ఏటికొప్పాక 15,900 మెట్రిక్ టన్నుల అమ్మకంతో రూ.1.50కోట్లు ఆదాయం పొందింది. దీనివల్ల పంచదారపై నష్టపోయినప్పటికీ మొలాసిస్ ద్వారా కొంత ఊరట కలగడంతో ఫ్యాక్టరీలు ఊపిరిపీల్చుకున్నాయి. నాలుగు కర్మాగారాలు మొలాసిస్‌ను ఒడిశా, బొబ్బిలి(ఎన్సీఎస్),రాజాం(రాజ్యలక్ష్మి)లకు విక్రయిస్తున్నాయి. అయితే మొలాసిస్ నిల్వకు అవసరమైన ట్యాంకులు లేకపోవడం, ఉన్నవి కారిపోతుండటంతో ఎప్పటికప్పుడు అమ్మకాలతో ఫ్యాక్టరీలు నష్టపోతున్నాయి. నిల్వ ఉంచుకున్నవి లాభపడుతున్నాయి. వచ్చే సీజన్నాటికయినా సాంకేతిక సమస్యలను పరిష్కరించి పంచదార, మొలాసిస్ ఉత్పత్తిని పెంచితే అటు యాజమాన్యాలకు, ఇటు రైతులకు మేలు జరుగుతుందన్న వాదన వ్యక్తమవుతోంది.