మట్టినీ అమ్ముకుంటున్నారు | sand saleing | Sakshi
Sakshi News home page

మట్టినీ అమ్ముకుంటున్నారు

Published Sat, Jul 4 2015 1:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

sand saleing

నీరు-చెట్టు కింద జిల్లావ్యాప్తంగా
 చేపట్టిన పనులు 5,102
 
 మంజూరైన నిధులు రూ. 38.96 కోట్లు
 
 ఇప్పటివరకు 45శాతం పనులు కాగా.. అందులో 50 శాతం నిధులు దుర్వినియోగం
 
 సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం కొత్తూరు చెరువులోని మట్టిని ఇటుకల బట్టీకి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
 
 రోసనూరుకు చెందిన టీడీపీ నాయకుడు    చెరువులో పూడికతీత పనులు చేయకుండా సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద ఉన్న గ్రావెల్‌తో కాలనీకి రోడ్డువేశారు. అశాఖ అధికారులతో కుమ్మక్కై నిధులు స్వాహా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
 
 శిరసనంబేడు చెరువులో పూడికతీత పనులు చేపట్టకుండా టీడీపీకి చెందిన ఓ నాయకుడు రొయ్యల సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటను తీసి నీరు-చెట్టు పథకం కింద నిధులు రాబట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
 
 
 విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తమ్ముళ్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం భూగర్భజలాల అభివృద్ధి.. పర్యావరణ పరిరక్షణ కోసం ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 5,102 పనులును చేపట్టారు. ఇందులో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చెరువులు, అటవీశాఖ ద్వారా కుంటలు, డ్వామా పరిధిలో కాలువలు, చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి మొత్తం రూ.38.96 కోట్లు నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో నుంచి తీసిన మట్టిన రైతుల పొలాలకు తరలించాల్సి ఉంది. అయితే అనేకచోట్ల టీడీపీ నాయకులు ఫ్యాక్టరీలు, ఇటుకబట్టీలు, కృష్ణపట్నం పోర్టుకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీరు-చెట్టు పథకం కింద ఇప్పటివరకు 45 శాతం నిధులు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. అందులో 50 శాతం వరకు నిధులు దుర్వినియోగమైనట్లు అధికారి ఒకరు వెల్లడించారు. నీరు-చెట్టు పథకం కేవలం తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రవేశపెట్టారని అధికారులు కొందరు చెపుతున్నారు.  
 
 పనులు చేయకపోయినా కాసులే
 జిల్లాలో అనేకచోట్ల టీడీపీ నేతలు గ్రామసభలు నిర్వహించుకుండానే పనులు చేపట్టారు. ఉదయగిరి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి, కోవూరు, వెంకటగిరి పరిధిలోని కొన్ని చెరువుల్లో గతంలో పూడికతీత పనులు చేసి ఉన్నారు. వాటిని తాజాగా నీరు-చెట్టు కింద పనులు చేపట్టినట్లు రికార్డులు సృష్టించుకున్నట్లు సమాచారం.
 
 గతంలో ఎవరో పనులు చేసి ఉంటే.. తాజాగా టీడీపీ నేతలు చేసినట్లు గిమ్మిక్కులు చేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోనే రూ.56 లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో 36 చెరువుల్లో రెండు విడతలుగా పనులు చేపట్టారు. ఒక్కో చెరువుకు రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.78 లక్షలు నిధులు మంజూరయ్యాయి.
 
 వాటిలో 60 శాతం నిధులు మింగేశారు. అదేవిధంగా సూళ్లూరుపేట, ఓజిలి, కోట, వాకాడు, చిల్లకూరు మండలాల్లో కొందరు మట్టిని అమ్ముకుని సొమ్ముచేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాయుడుపేట పరిధిలో 20 చెరువుల్లో పనులు చేపడితే.. అందులో 50 శాతం మట్టిని అమ్మి సొమ్ముచేసుకున్నట్లు సమాచారం. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో చేపట్టిన చెరువు పనుల్లోనూ పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువులో గ్రావెల్ తీసి దాన్ని రెండు రకాలుగా వినియోగించి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం.
 
 ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి జెడ్పీ మీటింగ్‌లో అధికారులను నిలదీశారు. ఇకపోతే జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే చెరువు మట్టిని తరలించాలి. అలాకాకుండా వేరొకరికి తరలిస్తే నిధులు మంజూరుకాకుండా అడ్డుకుంటున్నట్లు పలు ప్రాంతాల నుంచి రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినట్ల్లు తెలిసింది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో నీరు-చెట్టు పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement