allowed
-
హైబ్రిడ్ వర్కే సో బెటరూ!
మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కి అన్నిరంగాలు ప్రభావితమయ్యాక వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి వచ్చింది.దీంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి పలు రంగాల ఉద్యోగులు అలవాటుపడ్డారు. కొంతకాలంగా పరిస్థితులు సద్దుమణగడంతో ఐటీతో సహా పలు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం తప్పనిసరి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల మనోగతం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘సీఐఈఎల్ హెచ్ఆర్’ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ పనివిధానమే (ఆన్లైన్+ఆఫ్‌లైన్) మేలని అధికశాతం టెకీలు, ఇతర రంగాల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని పట్టుబట్టకుండా వర్క్ ఫ్రం హోం లేదా వారానికి ఒకరోజు ఆఫీసుకు రావడం లాంటి పద్ధతులను అనుమతించాలనే డిమాండ్ పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికి అనుమతించకపోతే వేరే కంపెనీల్లోకి మారేందుకూ సిద్ధమని 73 శాతం టెకీలు, ఇతర ఉద్యోగులు చెప్పినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, 35 శాతం మంది మాత్రం ఆఫీసుల నుంచి పనిచేసే రోజుల సంఖ్యను పెంచడాన్ని స్వాగతించారు. 26 శాతం మంది ఆఫీసు నుంచి పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న 3,800 ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదిక రూపొందించారు. వర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల మొగ్గు ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. రెండువందలకు పైగా కంపెనీల్లో డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ 2023 నిర్వహించిన సర్వేలో... 88 శాతం ఉద్యోగులు ఏదో ఒక రూపంలో తమకు అనుకూలమైన పని పద్ధతులను మార్చుకున్నట్లు వెల్లడైంది. ఐటీసీ సంస్థ వర్క్ ఫ్రం ఆఫీస్‌ను పునఃప్రారంభించడంతోపాటు కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులను వారానికి రెండురోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా నిర్వహించిన సర్వేలో హైబ్రిడ్ విధానానికి అత్యధికులు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. దీనికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన హైబ్రిడ్ వర్క్మోడల్/ ఫ్లెక్సిబుల్ వర్క్ వసతులను రూపొందించినట్టు డీబీఎస్ బ్యాంక్ ఇండియా హెచ్ఆర్ కంట్రీ హెడ్ కిషోర్ పోడూరి తెలిపారు. హైబ్రిడ్ విధానంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు ట్రాఫిక్రద్దీ, వాహన కాలుష్యం నుంచి ఉపశమనం దొరుకుతుందని ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు. అనుకూలమైన పని గంటలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండే సంప్రదాయ ఆఫీసు పనివేళల విధానం కాకుండా నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులు తమకు అనుకూలమైన పని సమయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దీంతో వారు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. –నీలేశ్ గుప్తా, డైరెక్టర్, డెలాయిట్ ఇండియా వర్క్‌ఫోర్స్ ఉండేలా... ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పని ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులపై కంపెనీలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచే వర్క్‌ఫోర్స్, నైపుణ్య ఉద్యోగులు ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.–ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఈవో, సీఐఈఎల్ హెచ్ఆర్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ అంటే... ఆఫీసు, ఇంటి నుంచి పనిచేయడాన్ని సమ్మిళితం చేస్తే హైబ్రిడ్ పనివిధానం అవుతుంది. ఇందులో వారంలో కొద్ది రోజులు ఆఫీసు నుంచి, కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. యాజమాన్యం, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పని విధానాన్ని, ఆఫీసు వేళలను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఇళ్లకు దగ్గర్లోని లేదా ఉద్యోగులకు అనుకూలంగా ఉండే కో వర్కింగ్ ప్లేస్‌ల నుంచి పనిచేసే వీలు కూడా కల్పిస్తారు. దీంతో యాజమాన్యాలు, ఉద్యోగులకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. -
మెట్రోలో మద్యం అనుమతి.. ఎన్ని బాటిళ్ల వరకు తెలుసా..?
ఢిల్లీ: మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే.. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్ఆర్సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్ఆర్సీ స్పష్టం చేసింది. మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు లైన్లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది. Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 30, 2023 ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్ఎఫ్, డీఎమ్ఆర్సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ -
బాలిక 32 వారాల గర్భ విచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతి
కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. -
మహిళల హక్కుల్ని వాయిదా వేయలేం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించడాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కులను నిరాకరించాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. వారికి ఎన్డీయేలో ప్రవేశం కల్పించడం మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. 2022 మే నాటికి ఎన్డీయే నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలను అనుమతిస్తామని కేంద్రం చెప్పగా, న్యాయస్థానం అంగీకరించలేదు. తాము ఇదివరకే ఇచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ ఏడాది నవంబర్లోనే వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తుంటాయని జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఎన్డీయేలో మహిళలను చేర్చుకొనేందుకు ఇక ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో యూపీఎస్సీ, రక్షణ శాఖ కలిసి పని చేయాలని పేర్కొంది. ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల కోసం సమగ్రమైన కరిక్యులమ్ రూపొందించాలని, ఇందుకోసం రక్షణ దళాల ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్డీయేలో మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించాలని తెలిపింది. ఎన్డీయేలో మహిళలకు ప్రవేశం నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ న్యాయవాది కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. నవంబర్ 14న జరిగే పరీక్షకు మహిళలను అనుమతించలేమని, అందుకు సమయం సరిపోదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం బదులిచి్చంది. ఎన్డీయే ప్రవేశ పరీక్ష కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపర్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఐదో ఆటకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఐదోఆటను ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పారదర్శకత కోసం త్వరలో ఆన్లైన్లో టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు వెబ్సైట్లు ఒక్కో టికెట్ విక్రయానికి రూ.20 నుంచి రూ.40 వరకు సర్వీసుచార్జి వసూలు చేస్తుండగా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఆన్లైన్ టికెట్ల విక్రయానికి కేవలం రూ.6 మాత్రమే సర్వీసుచార్జి ఉంటుందని పేర్కొన్నారు. సినీ థియేటర్లు మూసేసిన లాక్డౌన్ కాలానికి సంబం ధించిన విద్యుత్‌చార్జీలు, ఆస్తిపన్ను రద్దు వంటి పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతించాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేయగా, ఇప్పటికే అనుమతిచ్చామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకోవడానికి కూడా అనుమతించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల(24 క్రాఫ్ట్స్) కార్మికులకోసం చట్టాలను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
టీకా వేసుకున్న వాళ్లకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికే భవిష్యత్‌లో హోటళ్లు, మాల్స్‌లోకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన కోఠిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని, ఇరువురూ కోలుకున్నారని, వారి కాంటాక్ట్‌లను కూడా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందన్నారు. డెల్టా రకం ప్రమాదకరమని, ఇంటాబయటా ప్రజలు మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు. థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వందకు పైగా బెడ్లు ఉన్న అన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగస్ట్ నెలాఖరు నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పెట్టుకోవాలని ఆదేశించారు. డెల్టా రకం భారత్ సహా 135 దేశాల్లో తీవ్రత చూపుతోందన్నారు. దేశంలోని 50% కేసులు కేరళ నుంచే వచ్చాయని, డెల్టా వైరస్ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వివరించారు. సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ వంటి చోట్ల కేసులు అధికంగానే ఉన్నాయని చెప్పారు. కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదైన ఘటనలు చూశామని, పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జీహెచ్ఎంసీ, ఖమ్మం వంటి చోట్ల అత్యధికంగా కేసులు చూస్తున్నామని, దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు నిరంతరం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులని, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్ డోస్ ఇచ్చామని, 33.79 లక్షల మందికి రెండు డోస్‌లు పూర్తి చేశామన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 30.04 లక్షల డోసులు పంపిణీ చేశామని, కేటాయించిన దానికన్నా 9.5 లక్షల డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయన్నారు. కోవిషీల్డ్ 22.32 లక్షల మందికి రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటే అందులో 12 లక్షల మందికి అందించినట్లు చెప్పారు. కోవాక్సిన్ 3 లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉందన్నారు. రానున్న రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. -
మద్యం విక్రయాలకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 17 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో భారీ సడలింపులు ప్రకటించింది. కంటెయిన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతించింది. మద్యం షాపుల వద్ద అయిదుగురు మించి గుమికూడరాదని స్పష్టం చేసింది. మద్యం, పాన్, గుట్కా, పొగాకు విక్రయించే షాపుల వద్ద ప్రజలు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని పేర్కొంది. ఇక మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం మద్యం విక్రయాలకు అనుమతించలేదని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం అందుబాటులో లేక ఇబ్బందులు పడిన మందు ప్రియులకు ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగిస్తోంది. చదవండి : మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు -
మహిళలు పెప్పర్ స్ప్రే తెచ్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్ : మెట్రోలో ప్రయాణించే మహిళలు ఆత్మరక్షణ కోసం తమ వెంట పెప్పర్ స్ప్రే తెచ్చుకునే వెసులుబాటును హైదరాబాద్ మెట్రో కల్పిస్తోంది. బెంగళూరు మెట్రోలో అమలులో ఉన్న ఈ విధానాన్ని హైదరాబాద్ మెట్రోలో పరిచయం చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మెట్రోలో భద్రతా కార్యకలాపాలు పర్యవేక్షించే అధికా రులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దిశ హత్యాచారం తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కర్ణాటకలో మహిళలకు నైట్‌షిఫ్ట్
బెంగళూరు: మహిళలు నైట్‌షిఫ్ట్‌లో (రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట పనిచేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఐటీ పరిశ్రమ, ఐటీ అనుబంధ విభాగాల్లో మాత్రమే మహిళల నైట్ షిఫ్ట్‌లకు అనుమతి ఉంది. అయితే దీనికి పలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నామని మహిళల నుంచి లేఖలు తీసుకోవాలని చెప్పింది. కనీసం 10 మంది మహిళా ఉద్యోగులు ఉండాలని, మహిళలు పనిచేసే చోట పూర్తి వెలుతురుతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. సీసీకెమెరాల రికార్డులను కనీసం 45 రోజుల పాటు నిక్షిప్తం చేయాలంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పనిచేసిన మహిళల నివేదికలను పరిశ్రమల ఇన్స్పెక్టర్తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని చెప్పింది. -
జర్నలిస్ట్‌లకు ఊరట; కోర్టు లోపలికి మొబైల్
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి విలేకరులను కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లడానికి అనుమతిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ సర్క్యులర్ అక్రిడేషన్, నాన్-అక్రిడేషన్ జర్నలిస్టులదరికీ వర్తించనుంది. సర్క్యులర్ లోని సమాచారం ప్రకారం.. ‘అక్రిడేషన్, నాన్ - అక్రిడేషన్ జర్నలిస్టులు ఎవరైనా కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవచ్చు. అయితే జర్నలిస్ట్‌లు కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లాంటే వారి వద్ద తప్పకుండా రిజిస్ట్రీ వారు ఇచ్చిన పాస్ ఉండాలి. ఈ పాస్ కాల వ్యవధి కేవలం ఆరు నెలలు మాత్రమే. అయితే కోర్టు హాల్లోకి మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లినప్పటికి, దాన్ని ‘సైలెంట్ మోడ్’లోనే ఉంచాలి. అలా కాకుండా కోర్టు కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తే రిజిస్ట్రీ వారు సదరు వ్యక్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాక ఈ నియమాలను ఉల్లఘించినందుకు గాను జరిమాన లేదా శిక్ష విధిస్తార’ని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. మే నెలలోనే జారీ అయిన ఈ సర్క్యులర్‌లో మొదట కేవలం అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులను మాత్రమే కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. కానీ కొందరు మీడియా వ్యక్తులు, జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అక్రిడేషన్ ఉన్న వారికే కాక నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్‌లను కూడా కోర్టు హాల్ లోపలికి మొబైల్ ఫోన్‌ను తీసుకువచ్చేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి ఒప్పుకోవడంతో నూతన సర్క్యులర్‌ను జారీ చేశారు. అయితే కోర్టు లోపల జరిగే ప్రోసిడింగ్స్‌ను రికార్డు చేయడం, వీడియో తీయడంపై నిషేధం ఉందని సీనియర్ లాయర్ ఒకరు తెలిపారు. ఈ విషయం గురించి సినీయర్ జర్నలిస్ట్ ఒకరు స్పందిస్తూ.. ‘ఇన్నాళ్లూ కోర్టు హల్ లోపల జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా విని, తీర్పుల సారాంశాన్ని వార్తల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొబైల్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడం వల్ల సమాచారాన్ని వెంటనే అందివ్వడానికి కాస్తా ఇబ్బందిగా ఉండేది. కానీ నేటి నుంచి ఇలాంటి ఇబ్బందులు తొలగిపోనున్నాయ’నిఅన్నారు. గతంలో కేవలం న్యాయవాదులు మాత్రమే కోర్టు హాల్‌లోపలికి మొబైల్ ఫోన్స్‌ను తీసుకెళ్లడానికి అనుమతించేవారు. -
మొబైల్‌కు ఒకే...పేమెంట్స్ బ్యాంకుకు షాక్
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు చుక్కెదురైంది. సంస్థకు చెందిన పేమెంట్స్ బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈకేవైసీ సౌకర్యాన్ని పునరుద్దరించడానికి యూఐడీఏఐ నిరాకరించింది. అయితే ఎయిర్టెల్ మొబైల్ సేవలకు మాత్రం ఈకేవైసీ సేవలు వినియోగించుకునేందుకు జనవరి 10 వరకు అనుమతినిచ్చింది. దాదాపు 55.63 లక్షల ఖాతాదారులకు రూ.138కోట్ల (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్)ను అందించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈకేవైసీ లైసెన్స్‌పై రిజర్వ్‌బ్యాంక్ అంతిమ విచారణ, ఆడిట్ నివేదిక వచ్చేంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) స్పష్టం చేసింది. ఆధార్ ఆధారిత ఈకేవైసీతో మొబైల్ చందాదారుల ధ్రువీకరణలు ఇకపైనా పూర్తి చేసేందుకు వీలు కానుంది. మార్చి 31 తర్వాత కొన్ని పరిమితుల మేరకు ఆధార్ ఈకేవైసీ లైసెన్స్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి సంబంధిత ఆడిట్ నిర్వహించాల్సిందిగా ఎయిర్‌టెల్‌ను, రిజర్వ్‌బ్యాంకును యుఐడిఎఐ ఆదేశించింది. ఎయిర్టెల్ సిస్టమ్స్, దరఖాస్తులు, డాక్యుమెంటేషన్ తదితర అంశాలు లైసెన్సింగ్ నిబంధనలకనుగుణంగా ఉన్నవీ లేనిదీ ధృవీకరించాలని కోరింది. టెలికం శాఖతో కలిసి తాము నిర్వహించిన ఆడిట్లో బయటపడిన లోపాలను కంపెనీ సవరించింది. కనుక లైసెన్స్‌ను పొడిగిస్తున్నామని యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఆధార్ చట్టం ప్రకారం ఎయిర్టెల్ ప్రతి త్రైమాసికానికి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందనీ పేర్కొంది. అటు ఈ పరిణామంపై ఎయిర్టెల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఆధార్ ఆధారిత ఈకేవైసీ సేవలకు తమకు అనుమతి లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తమ మొబైల్ రిజర్వ్ బ్యాంకు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈకేవైసీపై ఉన్న నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఎయిర్ టెల్ తన చందాదారులకు తెలియకుండానే వారి పేరిట పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఆయా చందాదారుల గ్యాస్ సబ్సిడీలు వచ్చి ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఈకేవైసీని దుర్వినియోగిం చేసిందన్న ఆరోపణలపై పేమెంట్స్ బ్యాంకుకు ఆ సేవలను యూఐడీఏఐ నిలిపివేసిన విషయం తెలిసిందే. -
శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా? వద్దా?
-
‘బురఖా’ను అనుమతించాలి
సాక్షి, ముంబై: ఈ విద్యా సంవత్సరంలో 10, 12వ తరగతి పరీక్షలు రాసే ముస్లిం విద్యార్థినిలను బురఖాతో పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని మహారాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యా బోర్డు స్పష్టం చేసింది. అందుకు అవసరమైన సర్క్యూలర్ అన్ని పాఠశాలలకు పంపించింది. దీంతో బురఖాతో పరీక్ష కేంద్రాలకు వచ్చే ముస్లిం బాలికలకు ఊరట లభించిం ది. ఈ నెల మూడో వారం నుంచి 12వ తరగతి పరీక్షలు, మార్చి ఆఖరు వారం నుంచి 10వ తరగతి పరీక్షలు జరనున్నాయి. గతంతో 10, 12 తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన ముస్లిం విదార్థినిలను కొన్ని కేంద్రాలలో ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకునే వారు. బురఖా తీసి, తనిఖీ చేసిన తరువాత మాత్రమే వారిని లోపలికి అనుమతించే వారు. దీంతో వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా బోర్డు ఓ సర్క్యులర్ జారీ చేసింది. బురఖా తీయమని చెప్పడం, తనఖీ చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మతాన్ని అవమానించినట్లవుతుందని బోర్డు అభిప్రాయపడింది. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద గందరగోళం నెలకొనే ప్రమాదముందని, దాన్ని నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. -
రద్దయిన నోట్లు మిగిలిపోయాయా? అయితే..
ముంబై: రద్దయిన పాత నోట్లు ఇంకా మిగిలిపోయాయా? రూ. 500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయడం మర్చిపోయారా..అయితే అలాంటి వారికి నిజంగా లడ్డూ లాంటి వార్తే. రద్దయిన ఈ పెద్దనోట్లను మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందట. రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందని జాతీయ మీడియా గురువారం రిపోర్ట్ చేసింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ, బ్యాంకు అధికారుల వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. తమ దగ్గర మిగిలిపోయిన పెద్దనోట్ల డిపాజిట్ కు అనుమతించాల్సిందిగా కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసినట్టు పేర్కొంది. అయితే ఈ అవకాశాన్ని చాలా తక్కువ విలువ డిపాజిట్లకు పరిమితం చేయవచ్చని తెలిపింది. ఈ పరిమితి సుమారు రూ.2వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పడి చేసేందుకు కొన్ని పరిమితులను, ఆంక్షలను విధించింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు 2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. -
రూపీ బాండ్లకు ఆర్బీఐ అనుమతి
బ్యాంకుల నిధుల సమీకరణకు వీలుగా నిర్ణయం ముంబై: మసాలా బాండ్ల (రూపీ-డినామినేటెడ్ బాండ్లు) జారీ ద్వారా విదేశీ మార్కెట్లో బ్యాంకులు నిధుల సమీకరించుకోడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. దీర్ఘకాలిక నిధుల సమీకరణకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆర్బీఐ తెలిపింది. ‘‘రూపీ బాండ్ల విదేశీ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలన్న సూత్రప్రాయ నిర్ణయం నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నాం. పరిమితులకు లోబడి ఈ బాండ్ల జారీ జరుగుతుంది’’ అని ఆర్బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇన్ఫ్రా, చౌక ఇళ్లకు తగిన నిధుల సమీకరణకు తాజా నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. మసాలా బాండ్ల జారీ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.5,000 కోట్ల సమీకరణకు ఈ ఏడాది మొదట్లో సంస్థలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే ఎక్కువ నిధుల సమీకరణకు ఆర్బీఐ ముందస్తు అనుమతి తప్పనిసరి. -
సొంత నిర్ణయం తీసుకోనివ్వండి..రాజన్
భువనేశ్వర్ : ఆర్బీఐ కు సొంత నిర్ణయాలను తీసుకొనే స్వేచ్ఛనివ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బ్యాంకుకు అందిస్తున్న పూర్తి స్వేచ్చ, మద్దతుపై సంతోషం వ్యక్తం చేస్తూనే, ఇకముందు సంస్థకు తన సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఒడిశా రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న రాజన్, మొదటిరోజు ఆర్బీఐ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. మనది వ్యవసాయ ఆధారితమైన ఎకానమీ అనీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.అందుకే వ్యవసాయ ఆధారిత చిన్న, మధ్యస్థ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇపుడు సరైన దారిలో నడుస్తోందనీ,ఈ క్రమంలో ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించనుందని వ్యాఖ్యానించారు. ఒడిషాలో ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయని, పర్యాటకపరంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆర్థిక పురోభివృద్దికి వినియోగించుకోవాలని రాజన్ సూచించారు. కోట్లాదిమంది భవిష్యత్తును నిర్దేశించే క్రమంలో ఆర్ బీఐ నిర్ణయం చాలా కీలకమైందని, ఏ చిన్న తప్పు దొర్లినా,దేశాన్ని ప్రజలను కష్టాల్లోకి నెడుతుందని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. అనంతరం ఆయన కళింగ సోషల్ సైన్సెస్ సంస్థను (కెఐఎస్ఎస్)ను సందర్శించారు. పాఠశాల నిర్వహణ, దాని ఆర్థిక నమూనాకు సంబంధించి అక్కడి అధికారులతో చర్చించారు. తన పర్యటనలో భాగంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ అధికారులను కలువనున్నారు. గ్లోబల్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే అంశంపై హరే కృష్ణ మెహతాబ్ లో మెమోరియల్ లెక్చర్ ఇవ్వనున్నారు. -
ఈపీఎఫ్ ఉపసంహరణలపై మరో మెలిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ (భవిష్య నిధి) విత్ డ్రాయల్స్‌పై ప్రతిపాదించిన పన్నుపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, ఉపసంహరణలపై మరో మెలిక పెట్టింది. సోమవారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సహకారం ఉపసంహరణకు సంబంధించిన పరిమితులను సడలిస్తూ కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకముందు కొన్ని ప్రత్యేక కారణాలతో ఈపీఎఫ్ ఖాతాలోని పూర్తి సొమ్ము ఉపసంహరణకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తాజా మార్పుల ప్రకారం ఇకముందు ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణకు ఖాతాదారుడు ఇల్లు కట్టుకోవడం, లేదా కొనడం, (హౌసింగ్) స్వీయ లేదా కుటుంబ సభ్యులు, పిల్లలకు దంత వైద్యం సహా ఇతర వైద్య ఖర్చులు నిమిత్తం, ఇంజనీరింగ్ విద్యకు లాంటి కారణాలపై మాత్రమే అనుమతిని మంజూరు చేసింది. దీంతోపాటుగా చందాదారుని పెళ్లి సమయంలో కూడా ఈ సొమ్ము విత్ డ్రా కు అనుమతి వుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చందాదారులు (అతడు లేక ఆమె) పూర్తి సంతృప్తికర సమాచారాన్ని అందించిన తరువాత, అప్పటివరకు ఖాతాలో ఉన్న సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని మంత్రిత్వ వర్గాలు ప్రకటించాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సభ్యులకు, సహాయక ప్రావిడెంట్ ఫండ్ లేదా వృద్ధాప్య పెన్షన్ల సభ్యులకు ఇది విస్తరించబడిందనీ, ఈ ఆగస్టు నుంచి ఈ నిబంధనలను అమలులోకి వస్తాయని తెలిపింది. కార్మిక సంఘాల ప్రాతినిధులతో, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో మంత్రి అరుణ్ జైట్టీ పేర్కొన్నారు. దీనిపై దేశంలోని ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రతిపాదను విరమించుకున్న సంగతి తెలిసిందే. -
అద్దె ఇల్లు.. ఆరుబయట శవం!
♦ ఇంట్లోకి అనుమతివ్వని యజమాని ♦ గ్రామ నడిబొడ్డు నుంచే అంత్యక్రియలు చండ్రుగొండ : అంటు అనే మూఢ నమ్మకంతో మృతదేహాన్ని తన ఇంట్లోకి తీసుకురావద్దన్న యజమాని. పుట్టెడు దుంఖఃలో ఉన్న ఆ కుటుంబం రామ నడిబొడ్డున టెంటు కింద మృతదేహాన్ని ఉంచాల్సిన పరిస్థితి. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన యన్నం పుల్లారావు(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి నర్సమ్మతో కలిసి కొన్నేళ్లుగా ఓ వ్యాపారి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఏడాది క్రితం కల్లూరుకు చెందిన యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన పుల్లారావు పురుగుల మందు తాగాడు. కొత్తగూడెంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పుల్లారావు మృతదేహాన్ని మంగళవారం రాత్రి అద్దె ఇంటి వద్దకు తీసుకురాగా.. యజమాని లోపలికి తెచ్చేందుకు అనుమతించలేదు. చేసేది లేక మృతదేహాన్ని గ్రామ బొడ్రాయి సెంటర్లో టెంటు కింద ఉంచారు. విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి యజమానిని ఒప్పించేందుకు యత్నించినప్పటికీ వినలేదు. దీంతో బుధవారం మధ్యాహ్నం గ్రామ నడిబొడ్డు నుంచే అంత్యక్రియలు నిర్వహించారు. సమాజం ఓ వైపు సాంకేతికపరంగా ముందడుగు వేస్తుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢ నమ్మకాలు మానవ విలువలను మంటగలుపుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారు?
ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యా దేశం విడిచి వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్... విదేశాలకు వెళ్ళకూడదంటూ ఆదేశాలు ఉన్నా... ఆయన రహస్యంగా లండన్ చెక్కేయడంపై ప్రస్తుతం రాజకీయ రచ్చగా మారింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్ళనిచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు. సమస్యల వలయంలో చిక్కుకున్న విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్ళేందుకు ఎలా అనుమతించారంటూ కేజ్రీవాల్...మోదీని సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారో తెలపాలంటూ కేజ్రీవాల్ ట్వీట్ లో కోరారు. వేల కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు ఎగవేసిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్యాను దేశం వదిలి వెళ్ళేందుకు అనుమతించరాదంటూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాల్యా మార్చి 2వ తేదీ దేశం విడిచి వెళ్ళారంటే.. ఎవరి అనుమతితో వెళ్ళారని కేజ్రీవాల్ అన్నారు. -
'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్
ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. పార్లమెంట్ ఛాంబర్లో మహిళా ఎంపీలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు అనుమతించింది. తల్లులు తమ పిల్లలకు పని వేళల్లోనే షెడ్యూల్ ప్రకారం పాలివ్వచ్చని తెలిపింది. కొత్తగా అమల్లోకి వచ్చిన 'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్‌తో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇంతకు ముందు పార్లమెంట్ ఛాంబర్లోకి పిల్లలను అనుమతించేవారు కాదు. అయితే ఇప్పుడా ఆ చట్టంలో మార్పులు తెచ్చారు. ఒక్క మహిళా ఎంపీలే కాదు... తల్లిదండ్రులు ఇద్దరిలో పిల్లల సంరక్షణను చూసే ఎవరైనా పిల్లలను తమతోపాటు ఛాంబర్లోకి తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త ఉత్తర్వులు సభ్యులందరికీ వర్తించేలా అమల్లోకి తేనున్నారు. అయితే ఇక్కడి మొత్తం హౌస్‌లో 150 మంది సభ్యుల్లో 40 మంది మహిళలే ఉన్నారు. ద ఆడైనా, మగైనా పిలల సంరక్షణా బాధ్యత ఉన్నవారు పార్లమెంట్ నిర్వహణలో పాల్గొనలేకపోతారని, అందుకే ఇటువంటి అవకాశాన్ని కల్పించినట్లు సభాధ్యక్షుడు క్రిస్టోఫర్ పైన్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ నిర్ణయాన్నిస్వాగతించారు. గతేడాది ఆస్ట్రేలియా పార్లమెంట్లో ముగ్గురు సభ్యులు ఇంచుమించుగా ఒకేసారి మాతృత్వం పొందడంతో ఇటువంటి ప్రత్యేక నిర్ణయం తీసుకోడానికి కారణంగా చెప్పొచ్చు. కాగా ఇటలీ మహిళ మెప్ లికా రొంజుల్లి 2010లో తన ఆరు వారాల బిడ్డను తీసుకొని ఓటింగ్‌లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె కుమార్తె ప్రతి చర్చలోనూ భాగమైంది. పనిచేసే చోటకి పిల్లలను అనుమతించే ఈ కొత్త చట్టాన్ని ఐరోపా సమాఖ్యలోని దేశాల్లో మొట్ట మొదటిగా ఆస్ట్రేలియా అమల్లోకి తెచ్చింది. -
400 ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం
డెహ్రాడూన్: సుమారు నాలుగు వందల ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం పాడింది. దేవాలయల్లో దళితులు, మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ డెహ్రాడూన్‌లోని ఓ ప్రసిద్ధ ఆలయం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం జౌన్సర్ బవర్ ఏరియాలోని పరుశురాం దేవాలయ అధికారులు ప్రజలందరూ ఆలయంలోకి అడుగు పెట్టొచ్చని తీర్మానించారు. భవిష్యత్తులో ఆలయ ప్రవేశానికి అందరికి అనుమతి ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటుగా దేవాలయ ఆవరణలో జంతు బలులను నిషేధించడం విశేషం. తాము గత 13 ఏళ్ల నుంచి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని దళిత నాయకుడు దౌలత్ కున్వర్ చెప్పారు. పరశురామ్ ఆలయం నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం చాలా ప్రగతిశీలమైందన్నారు. దేవాలయ అధికారులు నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన ఇతర దేవాలయాలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరమని కమిటీ చైర్మన్ జవహర్ సింగ్ చౌహాన్ చెప్పారు. తమ ప్రాంతంలో అక్షరాస్యత రేటు గణనీయంగా పెరిగిందన్నారు. ఫలితంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. పురోగతి మార్గంలో పయనిస్తున్నారని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ మార్పును ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగా కేరళ లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తుల నిషేధంపై వివాదం కొనసాగుతుంటే మరోవైపు ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ ఆలయం దేవాలయ పరిపాలనా అధికారులు నిర్ణయాన్ని పలువురు దళిత మేధావులు ప్రశంసించారు. -
శబరిమల అయ్యప్ప సన్నిధికి మహిళలను అనుమతిస్తారా ?
-
వీరింతే..
అధికారిక లెక్కల మేరకు అనుమతి పొందిన హోర్డింగులు: 2425 అధికారిక లెక్కల మేరకు అనుమతి లేనివి: 300 ఒక అంచనా మేరకు అనుమతి లేని హోర్డింగులు: 1500 అనుమతి లేని ఫ్లెక్సీలు, ఇతరత్రా : 10, 000 ప్రాణాంతకంగా మారుతున్న హోర్డింగ్‌లు అనుమతి లేకుండా ఏర్పాటు పట్టించుకోని అధికార గణం హైకోర్టు ఆదేశించినా స్పందన అంతంతే మృత్యువు చేతులు చాచినట్టు దారి పొడవునా అనుమతి లేని హోర్డింగులు వేలాడుతున్నాయి. అధికారుల కళ్ల ముందే ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే ప్రాణాలూ పోగొట్టుకున్నారు. ‘అయ్యో’ అనడమే తప్ప... అక్రమాన్ని అరికట్టాలని మన యంత్రాంగానికి అనిపించడం లేదు. న్యాయస్థానం చెబితే పట్టించుకుంటారనుకుంటే... తమదైన శైలిలో లెక్కలతో మాయ చేశారు. మరోసారి స్పందించిన న్యాయస్థానం అదే విషయాన్ని గుర్తు చేసింది. ఇదంతా తమకు అలవాటే అన్నట్టుగా ‘కదులుతున్నట్టు’ నటిస్తున్నారు. అవి మాత్రం అలాగే ఉన్నాయి. సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో అడుగడుగునా వేలాడుతున్న అనుమతి లేని హోర్డింగులు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ బ్యానర్లు ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. ప్రమాణాలు పాటించకపోవడంతో ఎప్పటికప్పుడు కింద పడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది వీటి కారణంగా గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలూ కోల్పోయారు. వీటిని తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించినప్పటికీ, అమలు చేసే వారే కనిపించడం లేదు. కనీసం కొత్తవి పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నమూ చేయడం లేదు. రాజకీయ హోర్డింగులకు 24 గంటల వరకే ప్రత్యేక అనుమతులిస్తుండగా... నెలల తరబడి తొలగించడం లేదు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్రమ హోర్డింగులను తొల గిస్తున్నామని చెబుతున్నప్పటికీ అమలులో కనిపించడం లేదు. తాజాగా రెండు వారాల క్రితం హైకోర్టు మరోసారి వీటిపై స్పం దించింది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయినా అధికారులు స్పందించలేదు. హోర్డిం గులకు స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉన్నట్లు సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించాల్సి ఉంది. ఈ విషయాన్నీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక రాజకీయ సభలు ఉంటే ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పా టు చేస్తున్న వారు వెంటనే వాటిని తొలగించడం లేరు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాత్కాలింగా ఏర్పాటు చేస్తున్న అక్రమ హోర్డింగులను తొలగించాల్సిందిగా హైకోర్టు గతంలో ఆదేశించింది. వాటిని తొలగించడంతో పాటు నిర్ణీత వ్యవధిలోగా నివేదిక అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. దీనిపై స్పందించిన అధికారులు దాదాపు 750 అక్రమ హోర్డింగులు ఉన్నాయని... వాటిలో 600కు పైగా తొలగించామని... మిగిలినవి తొలగిస్తున్నామని అప్పట్లో నివేదించారు. ఆ తర్వాత ఆ సంగతే మరచిపోయారు. ఇటీవల మరోసారి హైకోర్టు ఆదేశించడంతో తిరిగి చర్యలకు సిద్ధమవుతున్నారు. సర్కిళ్ల వారీగా అక్రమ హోర్డింగులను గుర్తించి, వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిం చారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ పనులు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లోని హోర్డింగులు ఏ క్షణాన ఎవరిపై పడతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. దాదాపు 2500 అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా... వాస్తవంగా ఈ సంఖ్య అంతకు రెట్టింపే ఉంటుందని అంచనా. అక్రమ హోర్డింగుల విషయమై జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ వద్ద గురువారం ప్రస్తావించగా, వీటిని తొలగించామని చెప్పారు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే తొలగిస్తామన్నారు. వాటిని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. -
కిస్..నో!
అనుమతి నిరాకరించిన పోలీసు అధికారులు! బెంగళూరు : మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగా నగరంలో నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఇక బ్రేక్ పడినట్లే. ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన రచితా తనేజాకు పోలీసులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో కూడా కొన్ని ప్రజా హక్కుల సంఘాలు నిర్వహించాయి. ఇక ఇందులో భాగంగానే ఉద్యాన నగరిలో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నగరానికి చెందిన ప్రజాహక్కుల కార్యకర్త రచితా తనేజా నిర్ణయించారు. ఇతర నగరాల్లో ఈ కార్యక్రమం సందర్భంలో పోలీసులతో పాటు అనేక సంఘాలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అలాంటి పరిస్థితులు నగరంలో ఏర్పడరాదనే ఆలోచనతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా రచితా తనేజా పోలీసు శాఖను కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణపై శ్రీరామసేన, ఆర్ఎస్ఎస్ తదితర సంఘాలతో పాటు రాజకీయ నేతలు, ఇతర వర్గాల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ఈ తరహా కార్యక్రమాలు భారతీయ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ఎంతమాత్రం అనుమతి ఇవ్వరాదని సైతం పోలీసులకు ఫిర్యాదు అందాయి. నగరంలో కనుక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పక అడ్డుకుంటామని శ్రీరామసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి కనుక అనుమతి ఇస్తే నగరంలో శాంతి-భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం సైతం భావించడంతో ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని రాష్ట్ర హోం శాఖ నుంచి పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని పోలీసులు ప్రజా హక్కుల కార్యకర్త రచితా తనేజాకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. -
సోమశిల హైలెవల్ కెనాల్‌కు కేబినెట్ అనుమతి
ఆత్మకూరు : జిల్లాలోని మెట్ట నియోజకవర్గాలైన ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు అందించేందుకు ఏర్పాటు కానున్న సోమశిల హైలెవల్ కెనాల్‌కు రాష్ట్ర కేబినెట్ అనుమతి ఇచ్చిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ నేత నాగులపాటి శ్రీనివాసులురెడ్డి నివాసంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ కాలువ ద్వారా ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో బీడు భూములు సాగు భూములుగా మరే అవకాశం ఉందన్నారు. ఎంతో కాలంగా మెట్ట రైతులు ఈ హైలెవల్ కాలువ కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగితే జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, రాపూరు, కావలి ప్రాంతాలు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు ఉత్తరాంచల్ రాష్ట్రానికి వెళ్లి పెట్టుబడులు పెడుతున్నారని, అదే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగితే ఎందరో పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికరణ అభివృద్ధికి ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటీవల పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక వసతులపై కూడా ఈ ప్రాంతంలో కొంత పరిశీలన జరిగిందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సోమశిల అధికారులతో మాట్లాడి ఐఏబీ సమావేశంలో తీర్మాణించేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ నిధులు అధిక శాతం రూ.5 కోట్ల మేర తాగునీటి అవసరాలకే వెచ్చించామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి రూ.1.04 కోట్లు, ఉదయగిరి నియోజవర్గానికి రూ.1.05 కోట్లు, కావలికి రూ.78 లక్షలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాగునీటి అవసరాల కోసం ఈ నిధులు వెచ్చించామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తాగునీటి అవసరాలు తీర్చేందుకు జెడ్పీ ద్వారా కూడా కృషి చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మెట్ట ప్రాంతంలోనే గాక డెల్టా ప్రాంతాల్లో కూడా బోర్లు కోసం ప్రతిపాదనలు వస్తున్నాయని తెలిపారు. బోగోలు మండలంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు కూడా కలెక్టరు ఆదేశించారన్నారు. ప్రధానమైన సమస్యలు, ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ నిధులతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వారు జిల్లాలో అమలు అవుతున్న పింఛన్ల పరిశీలనపై ఆరా తీశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, ఎంపీపీ సిద్ధం సుష్మ, మాజీ ఎంపీపీ డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు నాగులపాటి శ్రీనివాసులురెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సలర్ నాగులపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వెయ్యి మెగావాట్లకు అనుమతి
సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో భారత్, రష్యా సంయుక్త ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదికగా పెద్ద ఉద్యమం మొదలవడంతో తొలి యూనిట్ పనులు ముగిసినా ఉత్పత్తిలో జాప్యం నెలకొంది. గత ఏడాది అక్టోబరులో చడీ చప్పుడు కాకుండా తొలి యూనిట్లో ఉత్పత్తికి శ్రీకారం చుట్టేశారు. తొలుత 160 మెగావాట్ల మేరకు విద్యుత్ ఉత్పత్తి లభించగా, దాన్ని కేంద్ర గ్రిడ్‌కు పంపించారు. అక్కడ పరిశీలనానంతరం విద్యుత్ ఉత్పత్తి మరింత వేగవంతం చేశారు. నెలల వ్యవధిలో ఉత్పత్తి 400 మెగావాట్లకు చేరింది. జనవరిలో 750 మెగావాట్లుగా నమోదు అయింది. క్రమంగా ఉత్పత్తిని ఆ యూనిట్ లక్ష్యం వెయ్యి మెగావాట్లకు దరి చేర్చే పనుల్లో శాస్త్ర వేత్తలు, ఇంజనీర్లు నిమగ్నం అయ్యారు. పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలంటే అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి తప్పనిసరి. దీంతో ఆ కమిషన్ ఇది వరకు ఇచ్చిన అనుమతి మేరకు 750 మెగావాట్లకు ఉత్పత్తిని పరిమితం చేశారు. పెంచుకోండి: అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్(ఉత్పత్తి విభాగం) సుందర్ నేతృత్వంలో ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన నివేదిక కేంద్ర అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్‌కు ఇటీవల చేరింది. దీన్ని పరిశీలించిన ఆ కమిషన్ ప్రతినిధి బృందం గత వారం కూడంకుళం కేంద్రంలో సమగ్ర పరిశీలన నిర్వహించినట్టు సమాచారం. అన్నీ సజావుగా ఉండడంతో ఉత్పత్తిని నిర్ణయించిన లక్ష్యం వెయ్యికి పెంచుకోవచ్చంటూ అనుమతినిస్తూ శనివారం ఉత్తర్వులను ఆ కమిషన్ జారీ చేసింది. దీంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచే పనిలో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు నిమగ్నం అయ్యారు. ప్రస్తుతం 750 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్న దృష్ట్యా, అదనంగా 250 మెగావాట్ల ఉత్పత్తి పెంచే ందుకు అవసరమైన చర్యలను తీసుకున్నారు. మంగళవారం లేదా బుధవారం లోపు నిర్ణీత వెయ్యి మెగావాట్లను చేరడం తథ్యమని ఆ కేంద్రం వర్గాలు పేర్కొం టున్నాయి. ఆ లక్ష్యం చేరుకోగానే, ఇక ప్రతి రోజు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వివరిస్తున్నా రు. ఇది వరకు ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 350 మెగావాట్లు తమిళనాడుకు కేటాయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వెయ్యి మెగావాట్లకు లక్ష్యం చేరగానే, ఇక ప్రతి రోజు తమిళనాడుకు 562 మెగావాట్ల విద్యుత్ దక్కనుందని స్పష్టం చేస్తున్నారు. అసలే రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడంకుళం కాస్త చేయూత నిస్తుందన్న ఆనందాన్ని విద్యుత్ బోర్డు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నిర్ణీత లక్ష్యాన్ని తొలి యూనిట్ చేరుకోనుండడంతో, రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరాయి. ఈ రెండో యూనిట్ ద్వారా కూడా ఉత్పత్తి ప్రక్రియను త్వరితగతిన చేపట్టే విధం గా కార్యాచరణ రూపొందించడంలో విద్యుత్ బోర్డు తలమునకలవుతోంది. అదే సమయంలో, ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం అయ్యే కొద్ది, ఎక్కడ అణు వ్యతి రేకుల నుంచి నిరసనలు బయలు దేరుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ దృష్ట్యా, కూడంకుళం అణు విద్యుత్ కేం ద్రం పరిసరాల్లో భద్రతను పెంచారు.