సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో భారత్, రష్యా సంయుక్త ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదికగా పెద్ద ఉద్యమం మొదలవడంతో తొలి యూనిట్ పనులు ముగిసినా ఉత్పత్తిలో జాప్యం నెలకొంది. గత ఏడాది అక్టోబరులో చడీ చప్పుడు కాకుండా తొలి యూనిట్‌లో ఉత్పత్తికి శ్రీకారం చుట్టేశారు. తొలుత 160 మెగావాట్ల మేరకు విద్యుత్ ఉత్పత్తి లభించగా, దాన్ని కేంద్ర గ్రిడ్‌కు పంపించారు. అక్కడ పరిశీలనానంతరం విద్యుత్ ఉత్పత్తి మరింత వేగవంతం చేశారు. నెలల వ్యవధిలో ఉత్పత్తి 400 మెగావాట్లకు చేరింది. జనవరిలో 750 మెగావాట్లుగా నమోదు అయింది. క్రమంగా ఉత్పత్తిని ఆ యూనిట్ లక్ష్యం వెయ్యి మెగావాట్లకు దరి చేర్చే పనుల్లో శాస్త్ర వేత్తలు, ఇంజనీర్లు నిమగ్నం అయ్యారు. పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలంటే అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి తప్పనిసరి. దీంతో ఆ కమిషన్ ఇది వరకు ఇచ్చిన అనుమతి మేరకు 750 మెగావాట్లకు ఉత్పత్తిని పరిమితం చేశారు.
పెంచుకోండి: అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్(ఉత్పత్తి విభాగం) సుందర్ నేతృత్వంలో ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన నివేదిక కేంద్ర అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్‌కు ఇటీవల చేరింది. దీన్ని పరిశీలించిన ఆ కమిషన్ ప్రతినిధి బృందం గత వారం కూడంకుళం కేంద్రంలో సమగ్ర పరిశీలన నిర్వహించినట్టు సమాచారం. అన్నీ సజావుగా ఉండడంతో ఉత్పత్తిని నిర్ణయించిన లక్ష్యం వెయ్యికి పెంచుకోవచ్చంటూ అనుమతినిస్తూ శనివారం ఉత్తర్వులను ఆ కమిషన్ జారీ చేసింది. దీంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచే పనిలో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు నిమగ్నం అయ్యారు. ప్రస్తుతం 750 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్న దృష్ట్యా, అదనంగా 250 మెగావాట్ల ఉత్పత్తి పెంచే ందుకు అవసరమైన చర్యలను తీసుకున్నారు. మంగళవారం లేదా బుధవారం లోపు నిర్ణీత వెయ్యి మెగావాట్లను చేరడం తథ్యమని ఆ కేంద్రం వర్గాలు పేర్కొం టున్నాయి. ఆ లక్ష్యం చేరుకోగానే, ఇక ప్రతి రోజు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వివరిస్తున్నా రు. ఇది వరకు ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 350 మెగావాట్లు తమిళనాడుకు కేటాయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వెయ్యి మెగావాట్లకు లక్ష్యం చేరగానే, ఇక ప్రతి రోజు తమిళనాడుకు 562 మెగావాట్ల విద్యుత్ దక్కనుందని స్పష్టం చేస్తున్నారు. అసలే రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడంకుళం కాస్త చేయూత నిస్తుందన్న ఆనందాన్ని విద్యుత్ బోర్డు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నిర్ణీత లక్ష్యాన్ని తొలి యూనిట్ చేరుకోనుండడంతో, రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరాయి. ఈ రెండో యూనిట్ ద్వారా కూడా ఉత్పత్తి ప్రక్రియను త్వరితగతిన చేపట్టే విధం గా కార్యాచరణ రూపొందించడంలో విద్యుత్ బోర్డు తలమునకలవుతోంది. అదే సమయంలో, ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం అయ్యే కొద్ది, ఎక్కడ అణు వ్యతి రేకుల నుంచి నిరసనలు బయలు దేరుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ దృష్ట్యా, కూడంకుళం అణు విద్యుత్ కేం ద్రం పరిసరాల్లో భద్రతను పెంచారు.
వెయ్యి మెగావాట్లకు అనుమతి
Published Sat, May 3 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement