సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 17 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో భారీ సడలింపులు ప్రకటించింది. కంటెయిన్మెంట్ జోన్‌లు మినహా అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతించింది. మద్యం షాపుల వద్ద అయిదుగురు మించి గుమికూడరాదని స్పష్టం చేసింది. మద్యం, పాన్, గుట్కా, పొగాకు విక్రయించే షాపుల వద్ద ప్రజలు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని పేర్కొంది.
ఇక మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం మద్యం విక్రయాలకు అనుమతించలేదని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అందుబాటులో లేక ఇబ్బందులు పడిన మందు ప్రియులకు ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment