Delhi Metro Allows To Carry Two Sealed Alcohol Bottles Per Person - Sakshi
Sakshi News home page

మెట్రోలో మద్యం అనుమతి.. ఎన్ని బాటిళ్ల వరకు తెలుసా..?

Published Fri, Jun 30 2023 2:58 PM | Last Updated on Fri, Jun 30 2023 4:00 PM

Alcohol Now Allowed On Delhi Metro Per Person Limits - Sakshi

ఢిల్లీ: మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే.. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ వ్యక్తి ట్విట్టర్‌ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్‌ఆర్‌సీ ) సమాధానం తెలిపింది. 

రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు లైన్‌లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది.

ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్‌ఎఫ్‌, డీఎమ్‌ఆర్‌సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్‌లోనైనా  ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది. 

ఇదీ చదవండి: దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement