30 ఏళ్ల చైనీస్ వ్యక్తి ఒకే ఒక్క రోజు సెలవుతో వరుసగా 104 రోజులు పనిచేసిన తర్వాత అవయవ వైఫల్యంతో బాధపడుతూ మరణించాడు. తరువాత, అతని మరణానికి 20 శాతం యజమాని యజమాని కారణమని కోర్టు తీర్పు చెప్పింది.
ఓ వ్యక్తి సెలవు తీసుకోకుండా, కనీసం ఆఫ్ కూడా వినియోగించకుండా 100 రోజులకు పైగా నిరంతరం పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. వృత్యిరీత్యా పెయింటర్ అయిన అబావో అనే 30 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ పని ప్రాజెక్టు కోసం ఒప్పందంపై సంతకం చేశాడు.ఫిబ్రవరి నుంచి మేరకు ప్రతిరోజు పనిచేశాడు. కేవతం ఏప్రిల్ 6న ఒకరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు.
ఈ క్రమంలో మే 25న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అబావోకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తేల్చారు. చివరికి చికిత్స పొందుతూ జూన్ 2023లో ప్రాణాలు విడిచాడు. అయితే పని ఒత్తిడి, ఎక్కువ సమయం పనిచేయడం వల్లే అబావో మరణించాడని, ఇందుకు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది
కానీ అతడి యజమాని మాత్రం తన చర్యలను సమర్థించుకున్నాడు. అబావో కేవలం సమయానుసారమే పనిచేసినట్లు తెలిపాడు. తనే స్వచ్చందంగా అదనంగా పని చేశాడని, ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నాడు.
కానీ యజమాని వ్యాఖ్యలతో న్యాయస్థౠనం ఏకీభవించలేదు. అబావో మరణానికి కంపెనీ 20 శాతం బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. 104 రోజులు నిరంతరం పనిచేయడం అనేది చైనీస్ లేబర్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘగించినట్లేనని పేర్కొంది.
చట్టం ప్రకారం రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు, వారానికి సగటున 44 గంటలు మాత్రమే పనిచేయాలని తెలిపింది. అనంతరంఅబావో కుటుంబానికి 4,00,000 యువాన్లు (సుమారు రూ. 47,46,000), అతడి మానసిక క్షోభకు సంబంధించి 10,000 యువాన్లను (సుమారు రూ. 1,17,000) పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment