China Evergrande Group bankruptcy protection: చైనీస్ ప్రాపర్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే గ్రూప్ సంచనల విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న చైనా రియల్టీ రంగాన్ని ప్రతిబింబిస్తూ దేశంలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ దివాలా తీసినట్టు ప్రకటించింది. ఈ మేరకున్యూయార్క్ కోర్టులో దివాలా కోసం దాఖలు చేసింది. చైనాలో అగ్రశ్రేణి కంపెనీలు నిర్మాణాలను పూర్తి చేయడానికి డబ్బు కోసం కష్టపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన రేపింది. (అదానీలో పెట్టుబడుల జోష్: అబుదాబి ఆయిల్ మేజర్ వేల కోట్ల ప్లాన్!)
ప్రపంచంలోనే అత్యధికంగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే న్యూయార్క్ కోర్టులో చాప్టర్-15 కింద దివాలా రక్షణను దాఖలు చేసింది. వివిధ బ్యాంకులతో పలు మల్టీ మిలియన్ డాలర్ల రుణాల కోసం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆస్తులను రక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎవర్‌గ్రాండే ప్రస్తుత అప్పులు విలువ 300 బిలియన్ డాలర్లకు పైమాటే. 2021లో కంపెనీల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థలో భారీ ఆస్తి సంక్షోభాన్ని రేకెత్తించింది. పెరుగుతున్న గృహాల ధరలను అదుపు చేసే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా రుణాలు తీసుకోవడంపై చైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత సంస్థ డిఫాల్ట్ వచ్చింది. (అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్)
ఈ పరిణామాల నేపథ్యంలో 2022 మార్చి నుంచి కంపెనీ హాంకాంగ్-లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ నిలిచి పోయింది. అంతేకాదు గతరెండేళ్లలో కంపెనీ ఏకంగా 80 బిలియన్ డాలర్లు నష్ట పోయినట్లు స్వయంగాఎవర్‌గ్రాండే జూలైలో నివేదించిన సంగతి తెలిసిందే. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ఎవర్‌గ్రాండే 280 కంటే ఎక్కువ నగరాల్లో 1,300 లకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది.మరోవైపు చైనా ఆర్థిక వృద్ధి మందగమనంతో ఎగుమతులు కూడా క్షీణించాయి. చైనా యువత నిరుద్యోగం రేటు కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. డాలరు మారకంలో కరెన్సీ పతనమవుతోంది. దీంతో ఇటీవల ద్రవ్యోల్బణాన్ని కట్టి చేసే చర్యల్లో భాగంగా చైనా కేంద్ర బ్యాంకు అనూహ్యంగా కీలక వడ్డీరేట్లను రికార్డు స్థాయికి తగ్గించడం ప్రపంచ దేశాల ఆర్థిక నిపుణులను ఆందోళనలో పడేసింది.
Comments
Please login to add a commentAdd a comment