
సమన్వయంతో పనిచేస్తా
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని డీఈఓగా బాధ్యతలు చేపట్టిన పండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. అందరి సహకారంతో పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మొదటిస్థానంలో జిల్లాను నిలుపేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జిల్లా డీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తాను చిత్తూరు డీఈఓగా పనిచేస్తున్నప్పుడు ఆందరి సహకారంతో ఆ జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపామన్నారు. మధ్యాహ్న భోజనం, యూనిఫాం తదితర విషయూలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తామన్నారు. కాగా ప్రతాప్‌రెడ్డి మొదటగా 2008లో అనంతపురం డిప్యూటీ డీఈఓగా పనిచేశారు.
2011లో డిప్యూటీ డీఈఓగా తిరుపతికి బదిలీ అయ్యూరు. 2012 ఏప్రిల్‌లో డీఈఓగా పదోన్నతి పొంది చిత్తూరుడీఈఓగా బాధ్యతలు చేపట్టారు. కడప డీఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రతాపరెడ్డికి ఆర్‌ఐపీఓ భానుమూర్తి, డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు, డీఈఓ కార్యాలయ ఏడీలు సుబ్రమణ్యం, దేవదాసు, ఎంఈఓ నాగమునిరెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది అభినంద నలు తెలిపారు.