
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో తనదైన శైలిలో చురుకుగా ఉండే పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక కార్టూన్‌ను తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. ఉరుకులు పరుగుల జీవితంలో వర్కింగ్ విమెన్ పడుతున్న కష్టాలను గుర్తించి, దాన్ని ట్విటర్‌లో షేర్ చేయడంతో బిజినెస్ టైకూన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అన్నిరంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ముందు వరుసలో నిలబడే క్రమంలో స్త్రీగా కొన్ని పనులు, బాధ్యతలు తప్పడం లేదనే విషయాన్ని ఈ కార్టూన్‌లో కళాకారుడు అద్భుతంగా చిత్రీకరించగా... ఉద్యోగం చేసే మహిళల ముందున్న సవాళ్లను ప్రతిబింబిస్తూ వచ్చిన కార్టూన్‌ను ఆయన షేర్ చేయడంతోపాటు. పురుషులకంటే ఎక్కువ బాధ్యతలను స్వీకరిస్తూ.. ఇంటిపనిని, ఆఫీసు పనులను సమతుల్యంగా నిర్వహిస్తూ రేసులో దూసుకుపోతున్న మహిళా ఉద్యోగినులపై ఆయన ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన అనుభవాన్ని కూడా మేళవించి.. ఇంటిపని, పిల్లల పెంపకంలో పురుషుల బాధ్యతను చెప్పకనే చెప్పారు. గత వారం రోజులుగా ఏడాది వయసున్న తన మనవరాలి ఆలనా పాలన చూస్తున్నానని ఆనంద్ మహీంద్ర సగర్వంగా చెప్పుకున్నారు.
I’ve been helping to baby-sit my year old grandson this past week & it’s brought home to me the stark reality of this image. I salute every working woman & acknowledge that their successes have required a much greater amount of effort than their male counterparts pic.twitter.com/2EJjDcK1BR
— anand mahindra (@anandmahindra) February 5, 2019
Comments
Please login to add a commentAdd a comment