సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జీ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్. దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుంది. ఈ మేరకు పబ్‌జీ ఫేస్‌బుక్ పేజీలోఅధికారిక ప్రకటన చేసింది. నేటి (అక్టోబర్ 30,2020)నుంచి వినియోగదారులందరికీ పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించబడింది. అయినప్పటికీ తమ తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్‌జీని ఆడుకోవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా కరోనా వైరస్ విస్తరణ, సరిహద్దు వద్ద చైనా దుశ్చర్య నేపథ్యంలో గోప్యత, భద్రత కారణాల రీత్యా భారత ప్రభుత్వం పబ్‌జీ సహా118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment