stops
-
సుప్రీం అక్షింతలు.. దర్యాప్తు నిలిపివేసిన సిట్
సాక్షి,తిరుపతి: టీటీడీ నెయ్యికల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు నిలిపివేసింది. లడ్డూ వివాదంపై సోమవారం(సెప్టెంబర్30) సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న విషయంలో సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. దీంతో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే దాకా సిట్ తన దర్యాప్తును నిలిపివేసింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యికల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డితో పాటు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: సుప్రీం వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టుకాగా, నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ మూడు రోజులపాటు దర్యాప్తు చేసింది. కల్తీపై ఫిర్యాదులో జాప్యం ఎందుకు జరిగింది అనే అంశంతో పాటు పలు కీలక విషయాలపై టీటీడీ అధికారుల నుంచి సిట్ సమాచారం రాబట్టింది. టీటీడీ మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ జీఎం కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. -
Hamas: గాజాలో దాడులు ఆపితే.. ఒప్పందానికి రెడీ
ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా రఫాపై దాడులకు తెగబడుతోంది.గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై దాడులు ఆపేస్తే.. ఇజ్రాయెల్‌తో తాము పూర్తి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ మలిటెంట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సైతం వెంటనే వదిలేస్తామని తెలిపారు.‘‘ గాజాపై ఇజ్రాయెల్ ఇలానే దాడలు, మారణహోనం కొనసాగిస్తే.. హమాస్, పాలస్తీనా వర్గాలు ఎట్టిపరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరించవు. అందుకే మేము మధ్యవర్తులకు తెలిపుతున్నాం. గాజా పౌరులపై దాడులు ఆపితే.. ఇజ్రాయెల్‌తో పూర్తి ఒప్పందం చేసుకోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్ బంధీలను వెంటనే వదిలేస్తాం’’ అని హమాస్ పేర్కొందిఅంతర్జాతీయ న్యాయ స్థానం.. గాజాలో దాడులు ఆపాలన్నా ఇజ్రాయెల్ దక్షిణ గాజాలోని రఫా నగరంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రఫా నగరంలో తల దాచుకుంటున్న అమాయక పాలస్తీనా పౌరులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హమాస్ వెనక్కి తగ్గి ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.ఇక.. గతంలో కూడా కాల్పుల విరమణ హమాస్ ముందుకు ఇచ్చినా ఇజ్రాయెల్ తిరస్కరిచిన విషయం తెలిసిందే.తమ దేశానికి ముప్పుగా ఉన్న హమాస్‌ను పూర్తిగా అంతం చేసేవరకు తమ దాడులు కొనసాగిస్తామని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,171 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
అమెరికాలో వీరసింహారెడ్డి సినిమా నిలిపివేత
-
తెలంగాణ: ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ నిలిపివేత
-
పబ్జీ ప్రియులకు బిగ్ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జీ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్. దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుంది. ఈ మేరకు పబ్జీ ఫేస్బుక్ పేజీలోఅధికారిక ప్రకటన చేసింది. నేటి (అక్టోబర్ 30,2020)నుంచి వినియోగదారులందరికీ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించబడింది. అయినప్పటికీ తమ తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్జీని ఆడుకోవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా కరోనా వైరస్ విస్తరణ, సరిహద్దు వద్ద చైనా దుశ్చర్య నేపథ్యంలో గోప్యత, భద్రత కారణాల రీత్యా భారత ప్రభుత్వం పబ్జీ సహా118 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. -
జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం
సాక్షి,న్యూడిల్లీ : ఎట్టకేలకు వివాదాస్పద బేబీ పౌడర్ అమ్మకాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నామని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వేలాది కేసులు, కోట్ల డాలర్ల పరిహారం లాంటి అంశాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆరోగ్య సమస్యల ఆరోపణలు ఖండించిన సంస్థ ఉత్తర అమెరికాలో టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలావరకు తగ్గుతోందని మంగళవారం ప్రకటించింది. వినియోగదారుల అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, వ్యాజ్యాలు దీనికి ఆజ్యం పోసాయని జాన్సన్ అండ్ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే నెలల్లో ఈ రెండు దేశాల మార్కెట్లలో అమ్మకాలను నిలిపివేస్తున్నామని నార్త్ అమెరికా కన్స్యూమర్ యూనిట్ ఛైర్మన్ కాథ్లీన్ విడ్మెర్ చెప్పారు. సరఫరా ముగిసే వరకు ఉన్న ఇతర రీటైల్ మార్కెట్లటలో అమ్మకాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు. అయితే 1980 నుండి మార్కెట్లో ఉన్న తమ కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలు అమెరికా కెనడాలో కొనసాగుతాయన్నారు. మొదట 1890 లలో బేబీ-పౌడర్ ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించిందని కంపెనీ బ్లాగ్ తెలిపింది. (కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన) కాగా 2014 నుంచి జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు న్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో వేలాది (16,000 కంటే ఎక్కువ) కేసులను సంస్థ ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. దీంతోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షలో ఒక బాటిల్ బేబీ పౌడర్‌లో కలుషిత, ప్రమాదకర అవశేషాలను కనుగొన్న తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో 33వేల బాటిళ్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటున్నట్టు జె అండ్ జె తెలిపింది. మరోవైపు న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో 16,000కు పైగా సూట్లను పర్యవేక్షిస్తున్న అలబామా న్యాయవాది లీ ఓ'డెల్ మాట్లాడుతూ అమ్మకాలను నిలిపివేసే ప్రకటన విచారణ నుంచి తప్పించుకునేందుకే అని వ్యాఖ్యానించారు. అండాశయ క్యాన్సర్‌కు కారణమైన సంస్థ ఉత్పత్తులను నిలిపివేయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) -
వివో కీలక నిర్ణయం, ఇక ఆ డీల్స్ వుండవు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకున్న వివో ఇండియా తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది (2020) నుంచి ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ సేల్స్‌అందుబాటులో వుండవని తేల్చి చెప్పింది. రిటైలర్స్‌కు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ ఉత్పత్తులను దాదాపు అవే ధరలకు మిగతా చానళ్ల ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ వెల్లడించారు. దీంతో వివోకు సంబంధించిన ఉత్పతుత్లన్నీ స్టాండర్ట్ రేట్స్‌కే లభిస్తాయన్నారు. అలాగే ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఆఫర్లు ఉంటాయని హామీ ఇచ్చారు. దేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటిగా నిలిచిన వివో ఇక ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టి పెట్టనుంది. వివో తాజా నిర్ణయాన్ని స్వాగతించిన ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఐమ్రా), అన్యాయమైన ఇ-కామర్స్ వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా, సరసమైన వ్యాపార అవకాశాలతో మొబైల్ రిటైలర్ల కోసం కొత్త మార్పును తీసుకు వస్తున్నామని శుక్రవారం ఒక ట్వీట్లో పేర్కొంది. ఇందులో వివో మొబైల్స్ ఇండియా సీఈవో లేఖ కాపీని కూడా జత చేసింది. మరోవైపు 2020 జనవరి మొదటి వారంలో ఎస్ 1 ప్రో పేరుతో తో కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫుల్-హెచ్డి + రిజల్యూషన్‌తో 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 సాక్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డైమండ్ ఆకారంలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. We thank and appreciate @Vivo_India for their support against unfair e-commerce trade practices! Together, let’s bring in the new change for mobile retailers with fair business opportunities. Team AIMRA pic.twitter.com/bKomt50db9 — Aimra (@AimraIndia) December 27, 2019 -
ఆర్టీసీ సమ్మె : బస్‌పాస్‌లతో లాభం ఉండదని..
జోగిపేట (అందోల్): సాయంత్రం 5 గంటలు.. సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రోజూ జోగిపేట వచ్చి ఖాదిరాబాద్‌కు వెళుతుంది. ఆ సమయంలో ఎక్కువగా విద్యార్థులే ఈ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. సోమవారం కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులంతా జోగిపేట బస్టాండ్‌లో ఈ బస్ కోసం వేచిచూస్తున్నారు. అయితే ఖాదిరాబాద్‌కు వెళ్లేందుకు చాలా మంది విద్యార్థులు అక్కడ వేచి ఉన్నట్లు దూరం నుంచే గమనించిన సంగారెడ్డి డిపో బస్ కండక్టర్, వెంటనే ఖాదిరాబాద్ అని ఉన్న బోర్డును తిప్పేసి, సంగారెడ్డి బోర్డు పెట్టి ప్రయాణికులను తీసుకొని బస్టాండ్ నుంచి సంగారెడ్డి రూట్లో బయలుదేరారు. దీంతో విద్యార్థులంతా వెంబడించి ఆ బస్సును అడ్డుకున్నారు. ‘ఖాదిరాబాద్ వెళ్లాల్సిన బస్సును సంగారెడ్డికి ఎందుకు తీసుకువెళుతున్నావ్’అంటూ కండక్టర్‌ను విద్యార్థులు నిలదీశారు. దీంతో రోడ్డుపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. బస్సును అరగంట సేపు నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విద్యార్థుల బస్‌పాస్‌ల కారణంగా తమకు కలెక్షన్ రాదనే ఉద్దేశంతో బోర్డు తిప్పేసినట్లు పలువురు ఆరోపించారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు దిగిపోవడంతో బస్సును తిప్పుకొని తిరిగి బస్టాండ్‌లోకి తీసుకువెళ్లారు. -
బాలయ్యా..రోడ్డు ఎక్కడయ్యా?
హిందూపురం/లేపాక్షి: ఎన్నికల తర్వాత మొదటిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆయన కారును అడ్డుకున్నారు. భూమి పూజ చేసి మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేదంటూ బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. హిందూపురం–చిలమత్తూరు మెయిన్‌రోడ్ నుంచి రూ.70 లక్షల వ్యయంతో గలిబిపల్లికి రోడ్ వేయడానికి మూడేళ్ల కిందట భూమి పూజ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఏడాది కిందట రోడ్ వేస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం మెయిన్ రోడ్‌పై బైఠాయించి.. ఆయన కారును అడ్డుకున్నారు. మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేకపోయావో చెప్పాలంటూ నిలదీశారు. వర్షం వచ్చినప్పుడల్లా నరకయాతన పడుతున్నామని.. బైక్‌ల మీద నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నామని వాపోయారు. ఇంతలో టీడీపీ నాయకులు కల్పించుకుని అప్పట్లో కోడ్ రావడంతో పనులు జరగలేదని, ఇప్పుడేమో ప్రభుత్వం మారిపోయిందని చెప్పడంతో.. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఇవే సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ స్పందిస్తూ, అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తానని చెప్పినా.. గ్రామస్తులు వెనక్కితగ్గలేదు. విధిలేని పరిస్థితిలో వారిని తప్పించుకుంటూ బాలకృష్ణ కారు ముందుకు వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. -
ముంబై-న్యూయార్క్ విమానాలు నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుంచి న్యూయార్క్ విమాన సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్గంలో తగినంత డిమాండ్ లేకపోవడంతో ఎయిరిండియా నష్టాల పాలైంది. దీంతో ఈ మార్గంలో తన విమాన సేవలను నిలిపిస్తోంది. డిసెంబర్ 2018 లో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ముంబై-న్యూయార్క్ డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించిన సంస్థ డిమాండ్ తక్కువగా ఉండటంతో ఇకపై ఈ సర్వీసులను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. ముంబై-న్యూయార్క్ మధ్య వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడిపిస్తున్న ఎయిరిండియా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత కారణంగా ఫిబ్రవరిలో తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేసింది. అయితే జూన్‌లో పునఃప్రారంభించాలని భావించినా.. ఇకపై ఈ సర్వీసులను కొనసాగించలేమని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వింటర్‌కు సంబంధించి అక్టోబర్ మూడవవారం నుంచి మార్చి రెండో వారం వరకు అందించే ఎయిరిండియా విమాన సేవలు ఇందులో భాగం కాదని వివరించారు. -
ఎయిర్ ఇండియా వివాదాస్పద నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రతిష్ట అంతకంతకూ మసకబారుతోంది. నష్టాల్లో కూరుకుపోయిన ‘మహారాజా’ ఎయిర్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేసింది. కేవలం శాకాహారమే ఇవ్వాలని నిర్ణయించింది. కాస్ట్ కట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నష్టాల ఊబిలో ఇరుక్కున్న ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఇపుడు ఎయిర్ఇండియా ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా దేశీయ విమానాల్లో మాంసాహార భోజనం ఉండదని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యర్థాలు, ఇతర వ్యయాలు తగ్గించడం, క్యాటరింగ్ సేవలను మెరుగుపరుచుకోవడం వంటివి చర్యలు తప్పనిసరని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహని చెప్పారు. ఎకానమీ క్లాస్ విమానాల్లో వెజిటేరియన్ ఆహారం మాత్రమే అందించనున్నామన్నారు. అయితే అంతర్జాతీయ విమానాల్లో మాత్రం నాన్‌వెజ్ కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ విమానాల్లో నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ వేస్ట్ అవుతోందని తెలిపింది. ఈ చర్య మూలంగా తమకు ఏడాదికి 7-8 కోట్లు ఆదా అవుతుందని ఎయిరిండియా వెల్లడించింది. కాగా ఎయిరిండియా ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పుల భారంతో కుదేలైంది. ఈ నేపథ్యంలో ఈ నేషనల్ కారియర్‌ను వదిలించుకునే పనిలో ఉంది ప్రభుత్వం. ఎయిరిండియాలో వాటా అమ్మకానికి కేంద్ర క్యాబినెట్ సూత్రం ఆమోదంకూడా లభించింది. మరోవైపు ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా కొనుగోలు ప్రయివేట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో సంసిద్ధతను వ్యక్తం చేయగా, టాటా గ్రూపు కూడా ఈ రేసులో ఉన్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. అయితే ఈ నిర్ణయంపై ఎయిర్ ప్యాసెంజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి మహేష్ వై రెడ్డి నుంచి విమర్శలు గుప్పించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాసెంజర్ సర్వే నిర్వహించాలని కోరారు. -
ప్రియుడి వివాహం అడ్డుకున్న ప్రియురాలు
కేకే.నగర్: ప్రేమ పేరుతో మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడి వివాహాన్ని ప్రియురాలు అడ్డుకుంది. వివాహ మండపంలోనే ప్రియుడిని నిలదీసింది. ఈ సంఘటన విల్లుపురం జిల్లా విక్రవాండిలో చోటుచేసుకుంది. ప్రియుడికి వేరే యువతితో వివాహం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రియురాలు అతని ఇంటి ముందు బంధువులతో ధర్నాకు దిగడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని సెండియం పాక్కంకు చెందిన గోపాలకృష్ణన్(25) చెంగల్పట్టు చెక్‌పోస్టులో ఉద్యోగి. గోపాలకృష్ణన్‌కు, సెంజికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి విక్రవాండిలో కల్యాణమండపంలో సోమవారం జరగనుంది. గోపాలకృష్ణన్ తాళికట్టే సమయంలో చెన్నై సెమ్మంజేరికి చెందిన అర్చన(21) మండపానికి చేరుకుని వివాహం అడ్డుకుంది. తాను చెన్నైలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నానని, తానూ, గోపాలకృష్ణన్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని గోపాలకృష్ణన్ నమ్మించాడని దీంతో శారీరకంగా దగ్గరయ్యామని, ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భవతి అని చెప్పి బోరున విలపించింది. దీన్ని చూసి పెళ్లికూతురు పెళ్లిపీటల మీద నుంచి లేచి తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరి వద్ద విచారణ జరిపారు. చివరకు అర్చనను పెళ్లి చేసుకోవడానికి గోపాలకృష్ణన్ ఒప్పుకోవడంతో అర్చన శాంతించింది. -
నీటి వసతి లేదని రైలు నిలిపివేత
ఖమ్మం: నీటి వసతి లేక ఇబ్బందులు పడిన ప్రయాణికులు చివరికి రైలును నిలిపివేశారు. ఖమ్మంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. త్రివేండ్రం నుంచి గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న ముఫ్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో నీటి వసతి లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చివరికి ఖమ్మం రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. రైల్వే అధికారులతో వాదులాటకు దిగారు. వసతి కల్పించేదాకా రైలును కదలనీయబోమంటూ భీష్మించారు. రెండు గంటలుగా రైలు ఆగిపోవటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
‘విద్య ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’
సాలూరు: ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. టీడీపీ యత్నాలను వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. విజయనగరం జిల్లా సాలూరులోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో బుధవారం జరిగిన ఎస్ఎఫ్ఐ డివిజన్ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాజన్నదొర చెప్పారు. అలాగే, భవన నిర్మాణం పూర్తి చేసుకున్న సంక్షేమ హాస్టళ్లను కూడా ప్రారంభించటం లేదని రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'బాబు పర్యటనను అడ్డుకుంటాం'
అనంతపురం: అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరించారు. బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్న మాటను నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. బాబు పర్యటనకు వ్యతిరేకంగా యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు జాతీయరహదారిపై ధర్నా చేశారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నా బాబు మాత్రం తాబేలుగా నత్తనడకన వ్యవహరిస్తున్నారని అన్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
తెనాలి (గుంటూరు): ఐసీడీఎస్ అధికారులు మైనర్లకు చేస్తున్న పెళ్లిని అడ్డుకున్న సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలోని రామలింగేశ్వర పేటలో చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికకు, పదేళ్ల బాలుడితో రామలింగేశ్వరపేటలో వివాహం చేస్తున్నారన్న సమాచారంతో ఐసీడీఎస్ సీపీడీవో సుజాత నేతృత్వంలో అధికారులు అక్కడకు వెళ్లారు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తికావడంతో అధికారులు బాలబాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిని ఆపించారు. బాల్యవివాహం చేస్తే తమ కుటుంబానికి పట్టిన అరిష్టం దూరమవుతుందన్న నమ్మకంతోనే తాము ఈ పెళ్లి చేస్తున్నామని వారు చెప్పారు. బాల్య వివాహం నేరమని, మీ ఉద్దేశ్యం ఏదైనా పెళ్లి జరగడానికి వీలులేదని అధికారులు హెచ్చరించి ఇరువైపుల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లిని ఆపారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
వరంగల్: బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అందుకున్న అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూనాగారం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బెత్సవాడకు చెందిన మైనర్ బాలక(16)కు ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం బెత్సగూడానికి చెందిన రామెల్ల రమేష్‌తో వివాహం జరపడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉన్నతాధికారుల నుంచి ఈ బాల్యవివాహ సమాచారం అందుకున్న ఎస్సై వినయ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీలారాణి సరైన సమయానికి అక్కడికి చేరుకొని వివాహాన్ని నిలిపివేయడంతో పాటు వధువరులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.