తెనాలి (గుంటూరు): ఐసీడీఎస్ అధికారులు మైనర్లకు చేస్తున్న పెళ్లిని అడ్డుకున్న సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలోని రామలింగేశ్వర పేటలో చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికకు, పదేళ్ల బాలుడితో రామలింగేశ్వరపేటలో వివాహం చేస్తున్నారన్న సమాచారంతో ఐసీడీఎస్ సీపీడీవో సుజాత నేతృత్వంలో అధికారులు అక్కడకు వెళ్లారు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తికావడంతో అధికారులు బాలబాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిని ఆపించారు. బాల్యవివాహం చేస్తే తమ కుటుంబానికి పట్టిన అరిష్టం దూరమవుతుందన్న నమ్మకంతోనే తాము ఈ పెళ్లి చేస్తున్నామని వారు చెప్పారు.
బాల్య వివాహం నేరమని, మీ ఉద్దేశ్యం ఏదైనా పెళ్లి జరగడానికి వీలులేదని అధికారులు హెచ్చరించి ఇరువైపుల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లిని ఆపారు.