బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | officers stops child marriage in eturunaagaram | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Published Wed, May 6 2015 10:32 AM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM

officers stops child marriage in eturunaagaram

వరంగల్: బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అందుకున్న అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూనాగారం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బెత్సవాడకు చెందిన మైనర్ బాలక(16)కు ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం బెత్సగూడానికి చెందిన రామెల్ల రమేష్‌తో వివాహం జరపడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఉన్నతాధికారుల నుంచి ఈ బాల్యవివాహ సమాచారం అందుకున్న ఎస్సై వినయ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రమీలారాణి సరైన సమయానికి అక్కడికి చేరుకొని వివాహాన్ని నిలిపివేయడంతో పాటు వధువరులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement