ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా రఫాపై దాడులకు తెగబడుతోంది.గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై దాడులు ఆపేస్తే.. ఇజ్రాయెల్‌తో తాము పూర్తి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ మలిటెంట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సైతం వెంటనే వదిలేస్తామని తెలిపారు.
‘‘ గాజాపై ఇజ్రాయెల్ ఇలానే దాడలు, మారణహోనం కొనసాగిస్తే.. హమాస్, పాలస్తీనా వర్గాలు ఎట్టిపరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరించవు. అందుకే మేము మధ్యవర్తులకు తెలిపుతున్నాం. గాజా పౌరులపై దాడులు ఆపితే.. ఇజ్రాయెల్‌తో పూర్తి ఒప్పందం చేసుకోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్ బంధీలను వెంటనే వదిలేస్తాం’’ అని హమాస్ పేర్కొంది
అంతర్జాతీయ న్యాయ స్థానం.. గాజాలో దాడులు ఆపాలన్నా ఇజ్రాయెల్ దక్షిణ గాజాలోని రఫా నగరంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రఫా నగరంలో తల దాచుకుంటున్న అమాయక పాలస్తీనా పౌరులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హమాస్ వెనక్కి తగ్గి ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ఇక.. గతంలో కూడా కాల్పుల విరమణ హమాస్ ముందుకు ఇచ్చినా ఇజ్రాయెల్ తిరస్కరిచిన విషయం తెలిసిందే.తమ దేశానికి ముప్పుగా ఉన్న హమాస్‌ను పూర్తిగా అంతం చేసేవరకు తమ దాడులు కొనసాగిస్తామని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,171 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment