అనంతపురం: అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరించారు. బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్న మాటను నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
బాబు పర్యటనకు వ్యతిరేకంగా యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు జాతీయరహదారిపై ధర్నా చేశారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్‌లు విడుదల చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నా బాబు మాత్రం తాబేలుగా నత్తనడకన వ్యవహరిస్తున్నారని అన్నారు.