24 గంటలూ ఖజానా కార్యాలయాలు | treasury offices working in 24 hours | Sakshi
Sakshi News home page

24 గంటలూ ఖజానా కార్యాలయాలు

Published Tue, May 20 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

treasury offices working in 24 hours

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలతో పాటు డీఏ బకాయిలు, ఇతర బిల్లులన్నీ ఈ నెల 24లోగా చెల్లించేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యం వేల సంఖ్యలో ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలకు బిల్లులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బిల్లుల సమర్పణ ఒక్కసారిగా పెరిగిపోవడంతో సర్వర్స్ డౌన్ అయి మొరాయిస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్థిక శాఖ ఇక నుంచి 24గంటలూ ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలు పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాల వారీ బిల్లుల సమర్పణ గడువును ఈ నెల 19 నుంచి 21 వరకు పొడిగించింది. జిల్లాల వారీగా బిల్లుల సమర్పణ సమయం ఈ విధంగా ఉంది.

  •     ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
  •     ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ పీఏవో కార్యాలయం బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
  •     మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ జిల్లాల బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
  •     సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
  •      రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని జిల్లాల బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement