వర్కింగ్‌ మదర్‌ కష్టాలు ఇవే: స్మృతి ఇరానీ | Smriti Irani Instagram Post On Struggles Of A Working Mom | Sakshi
Sakshi News home page

‘వర్కింగ్‌ మదర్‌ కష్టాలు ఇలా ఉంటాయి’

Published Wed, Dec 23 2020 12:21 PM | Last Updated on Wed, Dec 23 2020 2:31 PM

Smriti Irani Instagram Post On Struggles Of A Working Mom - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన భావాలను పోస్ట్ లుగా పెట్టడమే కాకుండా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతుంటారు. మంత్రిగా తాను చేస్తున్న కార్యకలాపాలతోపాటు తన లైఫ్‌‌లోని పలు విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా ఓ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో వర్కింగ్‌ మదర్‌ జీవిత కష్టాలు ఎలా ఉంటుందో వివరించారు. దీనిని ఫన్నీ కామెంట్‌ను జత చేశారు. స్మృతికి భర్త జుబిన్‌ ఇరానీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ

ఈ పోస్టులో తన కుటుంబాన్ని, పిల్లలను, వర్క్‌ మీటింగ్స్‌ మధ్య జీవితాన్ని ఎలా సమన్వయం చేస్తున్నారో వెల్లడించారు. ‘ఇంటి నుంచి పనిచేసే అమ్మలకు ఆన్‌లైన్ సమావేశాలను, ఇంట్లో బాధ్యతలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది’. అని పేర్కొన్నారు. దీనికి వర్కింగ్‌ మామ్స్‌ అనే హ్యష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే ఇంట్లో నుంచి వర్చువల్‌ మీటింగ్స్‌కు హాజరవుతున్న మంత్రికి తమ పిల్లలు అరవడం వల్ల అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర మంత్రి  పోస్టుపై పలువురు ప్రముఖలు స్పందిస్తున్నారు. ఆమె మల్టీ టాస్కర్‌ అని ప్రశంసిస్తున్నారు. కాగా ఇటీవల తాజా ట్యూస్‌డే(మంగళవారం ) అంటూ యాంగ్రీ లుక్స్‌తో మరోసారి అలరించిన విషయం తెలిసిందే. కోపంతో  ఉన్న స్మృతి చిన్ననాటి ఫోటో, ఇప్పటి ఫోటోను షేర్‌ చేస్తూ.. నన్ను ఆగ్రహానికి గురిచేయొద్దు (డోంట్‌ యాంగ్రీ మీ) అంటూ ‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఫోటోను పోస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement