
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన భర్త జుబిన్ ఇరానీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌లు కలిసిఉన్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ కూర్చుని సన్నిహితంగా మాట్లాడుకుంటున్నప్పటి ఫోటోకి ‘ మహిళలు మాత్రమే వదంతులకు మొగ్గుచూపుతార’ని అంటారనే క్యాప్షన్‌ను జోడించారు.
ముంబైలో ఇటీవల జరిగిన ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల ఎంగేజ్‌మెంట్ పార్టీలో జుబిన్ ఇరానీ, షారుక్ ఖాన్‌లు కలిసిన ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. ఇక స్మృతి పోస్ట్‌కు నెటిజన్లు స్పందిస్తూ పలు కామెంట్లు చేశారు. కాగా, షారుక్ ఖాన్, జుబిన్ ఇరానీలు చిన్ననాటి స్నేహితులు కావడం గమనార్హం. ఇరానీ పెద్ద కుమార్తెకు షనెల్లీగా షారుక్ పేరుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment