హయత్‌నగర్ (రంగారెడ్డి) : మే డే రోజు కూడా కార్మికులతో గోదాముల్లో పని చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో లేబర్ అధికారులు దాడులు జరిపారు. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని ఫతుల్లాగూడలో జరిగింది.
ఫతుల్లాగూడలోని మధురా కోట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ గోదాముల్లో మేడే రోజు కూడా కార్మికులతో పని చేయిస్తున్నట్లు లేబర్ డిపార్ట్మెంట్‌కు సమాచారం అందింది. దీంతో గోదాములపై దాడి చేసి కారకులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.