![Greenko collaborates with BITS Pilani WILP to empower its working professionals - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/23/bits.jpg.webp?itok=PLPFYwb1)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనర్జీ స్టోరేజి సంస్థ గ్రీన్‌కో తాజాగా బిట్స్ పిలానీలో భాగమైన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (విల్ప్) విభాగంతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం బిట్స్ పిలానీ అందించే వివిధ డిగ్రీ/సరి్టఫికేషన్ ప్రోగ్రామ్‌లలో గ్రీన్‌కో గ్రూప్ సిబ్బంది చేరవచ్చు. ఇంజినీరింగ్, టెక్నికల్, ఫంక్షనల్, మేనేజ్‌మెంట్ మొదలైనవి వీటిలో ఉంటాయి.
ఎంప్లాయీ ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ విధానంలో భాగంగా తమ ఉద్యోగులను గ్రీన్‌కో స్పాన్సర్ చేస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే బిట్స్ పిలానీతో భాగస్వామ్యం .. తమ సిబ్బంది నైపుణ్యాలు మరింతగా మెరుగుపడేందుకు తోడ్పడగలదని గ్రీన్‌కో వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి తెలిపారు. గ్రీన్‌కో సిబ్బందికి ఉపయుక్తమైన విద్యా కార్యక్రమాలను రూపొందించడంపై దృష్టి పెడుతున్నట్లు బిట్స్ పిలానీ ఆఫ్–క్యాంపస్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్
జి. సుందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment