సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్‌బీఐ బ్రాంచ్‌లు | 52 SBI Branches Will Be Working On March 26th And 27th | Sakshi
Sakshi News home page

సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్‌బీఐ బ్రాంచ్‌లు

Published Sat, Mar 26 2022 10:56 AM | Last Updated on Sat, Mar 26 2022 2:31 PM

52 SBI Branches Will Be Working On March 26th And 27th - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 26, 27 తేదీలు (నేడు, రేపు) సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. ఈ రెండు రోజులు రిజిస్ట్రేషన్‌ ఫీజులు, స్టాంపు ఫీజుల చలానాలు కట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 ఎస్‌బీఐ బ్రాంచ్‌లు ప్రత్యేకంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: 29న కొత్త జిల్లాలకు తుది రూపు?

ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏర్పాటు చేసింది. ఎస్‌బీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజుల చలానాలు కట్టించుకునేలా ఒప్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్‌ రామకృష్ణ కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement