మెరుగైన పోర్ట్‌ఫోలియోకు 8 సూత్రాలు.. | Portfolio Rebalancing: Better portfolio for 8 principles | Sakshi
Sakshi News home page

మెరుగైన పోర్ట్‌ఫోలియోకు 8 సూత్రాలు..

Published Mon, Aug 14 2023 6:24 AM | Last Updated on Mon, Aug 14 2023 6:24 AM

Portfolio Rebalancing: Better portfolio for 8 principles - Sakshi

రాధికా గుప్తా, ఎండీ, ఎడెల్విజ్‌ ఏఎంసీ

ఇన్వెస్ట్‌ చేసి వదిలేయడం కాకుండా మధ్య మధ్యలో మన పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ కూడా ఉండాలి. అవసరమైతే రీబ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉండాలి. అయితే, ఎన్నాళ్లకు ఈ ప్రక్రియ చేపట్టాలంటే.. ఐదేళ్లకోసారి అనేది నా సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే జీవిత గమనంలో ఈ అయిదేళ్ల వ్యవధిలో లక్ష్యాలు, పరిస్థితులు, అవసరాలు మారిపోతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న పెట్టుబడులు, సాధనాలు, వాటి పనితీరును మదింపు చేసుకోవడానికి కూడా ఈమాత్రం సమయం అవసరం. నా అనుభవం మేరకు ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్‌ చేసుకోవడానికి సంబంధించిన ఎనిమిది కీలక అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవేమిటంటే..    

ఫండ్‌/ఏఎంసీ ఎంపిక ..
ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ సావర్ధ్యాలు ప్రాతిపదికగా ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి ఏఎంసీకి ఒక స్పె షాలిటీ అంటూ ఉంటుంది. మిడ్‌క్యాప్, వేల్యూ లేదా గ్రోత్‌ అంటూ వివిధ సెగ్మెంట్లలో ప్రత్యేకానుభవం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు.  

ఏఎంసీ/ఫండ్‌ పరిమాణం..
ఏఎంసీ పరిమాణమనేది అప్రస్తుతం. చిన్న ఏఎంసీలతో పోలిస్తే పెద్ద ఏఎంసీలు వెనకబడిన సందర్భాలు చాలానే చూశాను. ఆ చిన్న ఏఎంసీలు తర్వాత రోజుల్లో మీడియం ఏఎంసీలుగా ఎదిగాయి కూడా. భారీ బుడగలాగా పెరిగిపోయిన స్కీములకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా ఎంత మంచి పనితీరు కనపర్చినా కూడా స్మాల్‌ క్యాప్‌ కేటగిరీ విషయంలో దీన్ని మరింతగా దృష్టిలో పెట్టుకోవాలి.

నిలకడ వర్సెస్‌ స్టార్‌ పెర్ఫార్మెన్స్‌..
స్టార్‌ రేటింగ్స్‌ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. నా కొత్త పోర్ట్‌ఫోలియోలో, టాప్‌ పోర్టల్‌ ర్యాంకింగ్స్‌ లేదా 5 స్టార్‌ ర్యాంకింగ్స్‌ లేదా అందరూ ఎక్కువగా మాట్లాడుకునే ఫండ్స్‌ ఏవీ లేవు. నిలకడగా రాణిస్తున్న వాటిని నేను షార్ట్‌ లిస్ట్‌ చేసుకుని, వాటిల్లో నుంచి ఎంచుకున్నాను. అత్యుత్తమ పనితీరుకన్నా నిలకడకే ప్రాధాన్యమివ్వొచ్చు.  

సిప్‌ మంచిదే..
నెలవారీ సిప్‌లు బాగా పనిచేస్తాయి. సిప్‌ల వల్లే ఫండ్‌ పనితీరు కన్నా ఓ ఇన్వెస్టరుగా నా పనితీరు దాదాపు మెరుగ్గా ఉంటోంది. ఎందుకంటే.. మార్కెట్లు పడినప్పుడు కూడా నేను యూనిట్స్‌ కొంటూనే ఉంటాను. అంతేగాకుండా సిప్‌ల పని తీరు సైతం మెరుగ్గా ఉంటోంది. బీఏఎఫ్‌ కేటగిరీల్లో 14 శాతం పైగా, మిడ్‌ క్యాప్‌ కేటగిరీల్లో 18 శాతం పైగా రాబడులు ఇస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, పెరిగే ఆదాయాలకు అనుగుణంగా సిప్‌లను కూడా పెంచుకుంటూ ఉండటం మంచిది.

పరిమిత సంఖ్యలో స్కీములు..
పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్‌ స్కీములు ఉండాలి అంటే.. 10 వరకూ ఫర్వాలేదు. అంతకు మించి ఉండొద్దు. స్కీముల సంఖ్యను ఒక స్థాయికి పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫండ్స్‌లో చాలా కేటగిరీలు ఉన్నందున ఇది అంత సులభం కాదు. నా మటుకు నేను ఫండ్స్‌ను ఆరు కేటగిరీల కింద వర్గీకరించుకున్నాను. ఒకో కేటగిరీలో ఒకటి లేదా రెండు స్కీములు ఉంటాయి. మొత్తం మీద 10కి మించవు. వీటిల్లో ఫ్లెక్సీ లేదా లార్జ్, మిడ్‌క్యాప్‌; మిడ్‌క్యాప్‌; స్మాల్‌ క్యాప్‌; అసెట్‌ అలొకేషన్‌ ఫండ్స్‌; ఇండో గ్లోబల్‌ ఫండ్స్‌ (పన్ను ప్రయోజనాలు కలి్పంచేవి); పూర్తి గ్లోబల్‌ ఫండ్స్‌ ఉంటాయి. పన్నులపరమైన కారణాల రీత్యా చివరిది కొత్తగా జోడించాను.  

డైవర్సిఫికేషన్‌ ప్రధానం..
వైవిధ్యమైన స్టయిల్‌ పాటించే ఫండ్‌ హౌస్‌కు నేను ప్రాధాన్యం ఇస్తాను. ఏ ఏఎంసీలోనైనా ఒక్క స్కీములో మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తాను. డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి సమయంలోనైనా మెరుగైన పనితీరు కనపర్చగలిగే వివిధ రకాల పెట్టుబడి విధానాల గురించి తెలుస్తుంది. యాక్టివ్, పాసివ్‌ విషయానికొస్తే నేను ఎక్కువగా యాక్టివ్‌ ఫండ్స్‌ వైపు మొగ్గు చూపుతాను.  

రిస్క్‌ సామర్ధ్యాలు..
నా అసెట్‌ అలొకేషన్‌ విషయంలో నేను సంప్రదాయ పద్ధతిని పాటిస్తాను. అంటే నా ఫండ్‌ స్కీములు చాలా వాటిల్లో ఈక్విటీ పెట్టు బడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఇంటి కొ నుగోలు వంటి ఆర్థిక లక్ష్యం అవసరం లేనందున నేను కొంత దూకుడైన విధానం వైపు మ ళ్లుతున్నాను. మా అబ్బాయి కాలేజి చదువుకు అవసరమయ్యే డబ్బు కోసం నేను ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను కూడా ప్రారంభించాను.  

సంక్లిష్టమైన సాధనాల జోలికెళ్లొద్దు..
పెట్టుబడుల విషయంలో దూకుడైన తీరు ఉంటే ఉండొచ్చు, కానీ పోర్ట్‌ఫోలియోలో సంక్లిష్ట సాధనాలు లేదా క్లోజ్డ్‌ ఎండెడ్‌ సాధనాలను నివారించడమే మంచిది. మీరు ఇన్వెస్ట్‌ చేసే పథకం గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. అలాగే ఉపసంహరణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లిక్విడిటీ, అంటే కోరుకున్నప్పుడు నగదు రూపంలోకి మార్చుకోగలిగే వెసులుబాటు చాలా ముఖ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement