Advantage
-
మెరుగైన పోర్ట్‌ఫోలియోకు 8 సూత్రాలు..
ఇన్వెస్ట్ చేసి వదిలేయడం కాకుండా మధ్య మధ్యలో మన పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ కూడా ఉండాలి. అవసరమైతే రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే, ఎన్నాళ్లకు ఈ ప్రక్రియ చేపట్టాలంటే.. ఐదేళ్లకోసారి అనేది నా సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే జీవిత గమనంలో ఈ అయిదేళ్ల వ్యవధిలో లక్ష్యాలు, పరిస్థితులు, అవసరాలు మారిపోతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న పెట్టుబడులు, సాధనాలు, వాటి పనితీరును మదింపు చేసుకోవడానికి కూడా ఈమాత్రం సమయం అవసరం. నా అనుభవం మేరకు ఫండ్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి సంబంధించిన ఎనిమిది కీలక అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవేమిటంటే.. ఫండ్/ఏఎంసీ ఎంపిక .. ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ సావర్ధ్యాలు ప్రాతిపదికగా ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి ఏఎంసీకి ఒక స్పె షాలిటీ అంటూ ఉంటుంది. మిడ్‌క్యాప్, వేల్యూ లేదా గ్రోత్ అంటూ వివిధ సెగ్మెంట్లలో ప్రత్యేకానుభవం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఏఎంసీ/ఫండ్ పరిమాణం.. ఏఎంసీ పరిమాణమనేది అప్రస్తుతం. చిన్న ఏఎంసీలతో పోలిస్తే పెద్ద ఏఎంసీలు వెనకబడిన సందర్భాలు చాలానే చూశాను. ఆ చిన్న ఏఎంసీలు తర్వాత రోజుల్లో మీడియం ఏఎంసీలుగా ఎదిగాయి కూడా. భారీ బుడగలాగా పెరిగిపోయిన స్కీములకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా ఎంత మంచి పనితీరు కనపర్చినా కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ విషయంలో దీన్ని మరింతగా దృష్టిలో పెట్టుకోవాలి. నిలకడ వర్సెస్ స్టార్ పెర్ఫార్మెన్స్.. స్టార్ రేటింగ్స్ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. నా కొత్త పోర్ట్‌ఫోలియోలో, టాప్ పోర్టల్ ర్యాంకింగ్స్ లేదా 5 స్టార్ ర్యాంకింగ్స్ లేదా అందరూ ఎక్కువగా మాట్లాడుకునే ఫండ్స్ ఏవీ లేవు. నిలకడగా రాణిస్తున్న వాటిని నేను షార్ట్ లిస్ట్ చేసుకుని, వాటిల్లో నుంచి ఎంచుకున్నాను. అత్యుత్తమ పనితీరుకన్నా నిలకడకే ప్రాధాన్యమివ్వొచ్చు. సిప్ మంచిదే.. నెలవారీ సిప్‌లు బాగా పనిచేస్తాయి. సిప్ల వల్లే ఫండ్ పనితీరు కన్నా ఓ ఇన్వెస్టరుగా నా పనితీరు దాదాపు మెరుగ్గా ఉంటోంది. ఎందుకంటే.. మార్కెట్లు పడినప్పుడు కూడా నేను యూనిట్స్ కొంటూనే ఉంటాను. అంతేగాకుండా సిప్ల పని తీరు సైతం మెరుగ్గా ఉంటోంది. బీఏఎఫ్ కేటగిరీల్లో 14 శాతం పైగా, మిడ్ క్యాప్ కేటగిరీల్లో 18 శాతం పైగా రాబడులు ఇస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, పెరిగే ఆదాయాలకు అనుగుణంగా సిప్‌లను కూడా పెంచుకుంటూ ఉండటం మంచిది. పరిమిత సంఖ్యలో స్కీములు.. పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్ స్కీములు ఉండాలి అంటే.. 10 వరకూ ఫర్వాలేదు. అంతకు మించి ఉండొద్దు. స్కీముల సంఖ్యను ఒక స్థాయికి పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫండ్స్‌లో చాలా కేటగిరీలు ఉన్నందున ఇది అంత సులభం కాదు. నా మటుకు నేను ఫండ్స్‌ను ఆరు కేటగిరీల కింద వర్గీకరించుకున్నాను. ఒకో కేటగిరీలో ఒకటి లేదా రెండు స్కీములు ఉంటాయి. మొత్తం మీద 10కి మించవు. వీటిల్లో ఫ్లెక్సీ లేదా లార్జ్, మిడ్‌క్యాప్; మిడ్‌క్యాప్; స్మాల్ క్యాప్; అసెట్ అలొకేషన్ ఫండ్స్; ఇండో గ్లోబల్ ఫండ్స్ (పన్ను ప్రయోజనాలు కలి్పంచేవి); పూర్తి గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి. పన్నులపరమైన కారణాల రీత్యా చివరిది కొత్తగా జోడించాను. డైవర్సిఫికేషన్ ప్రధానం.. వైవిధ్యమైన స్టయిల్ పాటించే ఫండ్ హౌస్‌కు నేను ప్రాధాన్యం ఇస్తాను. ఏ ఏఎంసీలోనైనా ఒక్క స్కీములో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి సమయంలోనైనా మెరుగైన పనితీరు కనపర్చగలిగే వివిధ రకాల పెట్టుబడి విధానాల గురించి తెలుస్తుంది. యాక్టివ్, పాసివ్ విషయానికొస్తే నేను ఎక్కువగా యాక్టివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతాను. రిస్క్ సామర్ధ్యాలు.. నా అసెట్ అలొకేషన్ విషయంలో నేను సంప్రదాయ పద్ధతిని పాటిస్తాను. అంటే నా ఫండ్ స్కీములు చాలా వాటిల్లో ఈక్విటీ పెట్టు బడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఇంటి కొ నుగోలు వంటి ఆర్థిక లక్ష్యం అవసరం లేనందున నేను కొంత దూకుడైన విధానం వైపు మ ళ్లుతున్నాను. మా అబ్బాయి కాలేజి చదువుకు అవసరమయ్యే డబ్బు కోసం నేను ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను కూడా ప్రారంభించాను. సంక్లిష్టమైన సాధనాల జోలికెళ్లొద్దు.. పెట్టుబడుల విషయంలో దూకుడైన తీరు ఉంటే ఉండొచ్చు, కానీ పోర్ట్‌ఫోలియోలో సంక్లిష్ట సాధనాలు లేదా క్లోజ్డ్ ఎండెడ్ సాధనాలను నివారించడమే మంచిది. మీరు ఇన్వెస్ట్ చేసే పథకం గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. అలాగే ఉపసంహరణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లిక్విడిటీ, అంటే కోరుకున్నప్పుడు నగదు రూపంలోకి మార్చుకోగలిగే వెసులుబాటు చాలా ముఖ్యం. -
ఎస్బీఐ ఎంఎఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌కి సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఒడిదుడుకుల ఈక్విటీ మార్కెట్లు పెరిగేటప్పుడు ఒనగూరే అపరిమిత ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు అందించడం, పతనమైనప్పుడు వాటిల్లే నష్టాలను ఓ మోస్తరు స్థాయికి పరిమితం చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల విలువను పెంచడం ఈ ఫండ్ లక్ష్యం. క్రిసిల్ హైబ్రిడ్ 50+50 – మోడరేట్ ఇండెక్స్ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫర్ ఆగస్టు 25న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. వేల్యు యేషన్లు, ఆదాయాల వృద్ధికి కారణమయ్యే అంశాలు, అధిక రాబడులు అందించగలిగే సామర్థ్యాలు తదితర అంశాల ఆధారంగా ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ సాధనాలు, రీట్స్, ఇన్విట్స్ మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుందని సంస్థ ఎండీ వినయ్ ఎం టోన్సే తెలిపారు. -
ఉమ్మడి రుణం.. ఉభయకుశలోపరి
సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు కలసి తీసుకునే గృహ రుణాలు కూడా ఉన్నాయి. మరొకరితో కలసి గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉండొచ్చు. కారణం ఏదైనా జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఉండే సానుకూల ప్రతికూలతలు ఏంటన్నవి తెలుసుకుంటే గృహ రుణ గ్రహీతలకు సాయంగా ఉంటుంది. వాటిని తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం జాయింట్హోమ్ లోన్ అన్నది మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణం. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా తోడబుట్టిన వ్యక్తితో కలసి జాయింట్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. విడిగా ఒక్కరే తీసుకునే రుణంతో పోలిస్తే, ఇతరులతో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. విడిగా తీసుకునేందుకు అనుకూలమైన క్రెడిట్ స్కోరు లేకపోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) దరఖాస్తుదారుల రుణ చరిత్ర (క్రెడిట్ స్కోరు)ను చూసిన తర్వాతే రుణంపై తేలుస్తాయి. వారి క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించి ఒకవేళ రుణం మంజూరు చేస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం వారికి ఉందా అని ఆరాతీస్తాయి. రుణ ఎగవేతల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి. ఒకవేళ ఒకరి క్రెడిట్ రిపోర్ట్ మంచిగా ఉండి, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే, సహజంగానే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి గృహ రుణం సులభంగానే లభిస్తుంది. అయితే, క్రెడిట్ స్కోరు తగినంత లేని వారి పరిస్థితి ఏంటి? వీరు ఆశ కోల్పోనవసరం లేదు. క్రెడిట్ స్కోరు మంచిగా ఉన్న మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే పరిష్కారం. మీరు ఎంచుకునే ఆ భాగస్వామి క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే, అప్పుడు సులభంగానే రుణం లభిస్తుంది. ఇక తీసుకున్న రుణాన్ని తాము ఒక్కరమే తిరిగి చెల్లించడం కష్టమని భావించే వారు కూడా ఉమ్మడిగా రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే, భార్యాభర్తలు ఇరువురూ వేతన జీవులు అయి ఉంటే, పన్ను ప్రయోజనం ఇరువురికీ అవసరం కనుక జాయింట్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపుతారు. సానుకూలతలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే సాధారణ హోమ్‌లోన్‌తో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభించే అవకాశాలు ఎక్కువ. ఖరీదైన ప్రాపర్టీ అయితే పెద్ద మొత్తంలోనే గృహ రుణాన్ని పొందొచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం జాయింట్ హోమ్‌లోన్‌లో ఇద్దరూ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు గాను ఒక్కొక్కరు విడిగా రూ.2లక్షలను మినహాయింపు చూపించుకోవచ్చు. అలాగే, రుణం అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలపై అదనంగా తమ ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. బలహీన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి కూడా జాయింట్ హోమ్‌లోన్‌లో సులభంగా రుణం లభిస్తుంది. ప్రతికూలతలు జాయింట్ లోన్ తీసుకునే వారు గుర్తించుకోవాల్సిన ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత వారిలో ఒకరు తమవాటా చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఇద్దరి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఇక భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని, అది చెల్లించే కాలంలో విభేదాల కారణంగా వారు విడిపోతే న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రాపర్టీ అనేది ఒకరి పేరిట నమోదై ఉండి, ఇద్దరూ కలసి రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారనుకోండి. అయినప్పటికీ ప్రాపర్టీ ఉన్న వారికే దానిపై చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. అపోహలకు చెక్ ► జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఎన్నో సందేహా లు ఉన్నాయి. రుణం తీసుకునే వారు ముందుగా వీటిపై స్పష్టత తెచ్చుకోవాలి. ప్రాథమిక రుణ దరఖాస్తుదారునితో సమానంగా సహ దరఖాస్తుదారునిపైనా గృహ రుణం చెల్లించాల్సిన బాధ్యత సమంగానే ఉంటుంది. అందుకే రుణ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి ముందే నిబం ధనలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకోవాలి. బ్యాంకుతో చేసుకునే ఒప్పందం గురించి సందేహాలు తీర్చుకోవాలి. ► ఉమ్మడిగా తీసుకునే రుణంలో ఒక్కరికే పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అంటే... ఇద్దరు గ్రహీతలకూ ప్రయోజనాలు సమానంగా వర్తిస్తాయి. కానీ, ఉమ్మడిగా తీసుకునే రుణాలపై పన్ను స్పష్టత కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24ను చూడాల్సి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం... సహ రుణ గ్రహీత పన్ను ప్రయోజనాలు క్లెయి మ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత ఆస్తికి అతను లేదా ఆమె సైతం సహ యజమాని అయి ఉండాలి. ► ఒక్కరు విడిగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే మరొకరితో కలసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని సులభంగా పొందడం అన్నది నిజమే. అయితే, కచ్చితంగా రుణం వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే గృహ రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అధిక రిస్క్‌తో కూడినవిగానే పరిగణిస్తాయి. కనుక సహ దరఖాస్తుదారునితో కలసి రుణం తీసుకునే ప్రయత్నం చేసే వారు... వారి క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండి, ఈఎంఐ చెల్లించేంత ఆదాయం కలిగి ఉంటేనే రుణాన్ని పొందగలరు. ఉమ్మడి గృహ రుణం విషయంలో ఈ అంశాలతోపాటు వడ్డీ రేటు సహా చూడాల్సినవి మరి కొన్ని కూడా ఉన్నాయి. ఒక్కసారి రుణం తీసుకుంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కనుక ముందే సమగ్రంగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలి. గృహ రుణానికి అర్హతలు ఇంటి రుణం దరఖాస్తును ఆమోదించడానికి ముందు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఏఏ అంశాలను చూస్తాయి? రుణం ఇస్తే ఎగవేతకు అవకాశం లేదని ఎలా తేలుస్తాయి? ఇవి తెలిస్తే దరఖాస్తుదారులు తమకు రుణం వస్తుందో లేదో తెలుసుకోవడం సులభం. ఇంటి రుణం విషయానికి వస్తే ప్రతీ దరఖాస్తుదారుని అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. వయసు దరఖాస్తుదారుని వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి రుణంలో గరిష్ట టర్మ్ 30 ఏళ్ల వరకే ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వారు అయితే దీర్ఘకాలానికి ఇంటి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే మధ్య వయసుకు వచ్చిన వారికి దీర్ఘకాలిక రుణానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసుతో పోలిస్తే, 40–45 ఏళ్ల వయసున్న వ్యక్తి పదవీ కాలం తక్కువగా ఉంటుంది కనుక. ఈ నేపథ్యంలో యుక్తవయసులో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణం, దీర్ఘకాలానికి లభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ప్రాపర్టీ వయసు, సైజును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలంటే గ్రహీత ఆదాయం దాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఎంత ఆదాయం వస్తోంది, స్థిరత్వం ఏ మేరకు తదితర అంశాలు రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. క్రెడిట్ హిస్టరీ దరఖాస్తుదారుని రుణ చరిత్ర కూడా కీలకం అవుతుంది. గతంలో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లింపులు ఏ విధంగా చేశారన్నది క్రెడిట్ రిపోర్ట్‌లో తెలుస్తుంది. మంచి స్కోరు ఉందంటే రుణ ఎగవేత అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఇతర బాధ్యతలు అలాగే, దరఖాస్తుదారునిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక, రుణ బాధ్యతలు కూడా పరిశీలనకు వస్తాయి. కారు రుణం, క్రెడిట్ కార్డు వంటివి తీసుకుంటే వాటిని కూడా ఇంటి రుణం దరఖాస్తు పరిశీలనలో భాగంగా బ్యాంకులు చూసి, చెల్లింపుల సామర్థ్యంపై అంచనాకు వస్తాయి. వ్యక్తిగత ప్రొఫైల్ వీటితోపాటు దరఖాస్తుదారుని వ్యక్తిగత ప్రొఫైల్ కూడా కీలకం అవుతుంది. విద్యార్హతలు, బ్యాక్‌గ్రౌండ్‌ను రుణదాతలు చెక్ చేసుకుంటారు. మంచి విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. వీరికి రుణం ఇచ్చినా తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాంకులు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. హామీదారుగా ఉంటే ఇప్పటికే ఏదైనా రుణానికి హామీదారుగా ఉన్నారనుకుంటే... ఆ మేరకు దరఖాస్తుదారుని అర్హత నుంచి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహాయించి చూస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ బాధ్యత హామీగా ఉన్న వారిపైనే పడుతుంది. కనుక ఇది కూడా రుణ దరఖాస్తుదారుని అర్హతలను ప్రభావితం చేసే అంశంగా గుర్తు పెట్టుకోవాలి. అర్హత ఉంటే... అర్హత ఉందని నిర్ధారణకు వస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తర్వాతి అంశాలపై దృష్టి పెడతాయి. వీటిల్లో ఆదాయంతో రుణ వాయిదా రేషియో ఒకటి. రుణ వాయిదా చెల్లింపుల కోసం వచ్చే ఆదాయంలో పక్కన పెట్టాల్సిన మొత్తం. ఆదాయంలో సగాన్ని సాధారణ ఖర్చుల కింద మినహాయించి మిగిలిన మొత్తంలో బాధ్యతలను చూస్తాయి. అంటే అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని వాటికి వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే ఆదాయంలో కచ్చితమైన బాధ్యతల కింద ఆ మొత్తాన్ని మినహాయిస్తాయి. లోన్ కాస్ట్ రేషియో కూడా ఒకటి. ప్రాపర్టీకి ఇచ్చే రుణంలో దరఖాస్తుదారుని వాటాను చూస్తాయి. అర్హతను పెంచుకునే మార్గాలు ► జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో సన్నిహిత వ్యక్తిని సహ దరఖాస్తుదారునిగా చేర్చుకుంటే రుణం లభించడం సులువు అవుతుంది. ► క్రమం తప్పకుండా ఆదాయం, పొదుపు, పెట్టుబడుల చరిత్ర ఉంటే రుణం లభించడం తేలిక. ► అదనపు ఆదాయ వనరుల గురించి కూడా దరఖాస్తుతోపాటు తెలియజేయడం అవసరం. అద్దె ఆదా యం, వ్యాపారం, వృత్తి పరంగా ఇతర ఆదాయ వనరుల గురించి తప్పక తెలియజేయడం లాభిస్తుంది. ► ఇక ఇంటి రుణం అవసరం అనుకునే వారు ముందు నుంచే తమ క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ముందుగా చెల్లించేయడం, బకాయిలు ఉంటే వెంటనే తీర్చేయడం చేయాలి. చాలా వరకు రుణమిచ్చే సంస్థలు క్రెడిట్స్కోరును తెలుసుకునే అవకాశాన్ని ఆన్లైన్లో ఉచితంగానే కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. -
బుల్లి పరికరం.. గొప్ప ప్రయోజనం
గుండెజబ్బులతోపాటు కేన్సర్లను కూడా చిటికెలో గుర్తించేందుకు యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గౌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమై పరికరాన్ని అభివద్ధి చేశారు. మల్టీకార్డర్ అని పిలుస్తున్న ఈ పరికరం అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నది కూడా. మన కెమరాల్లో ఉండే సీమాస్ సెన్సర్ లాంటిది ఒకటి దీంట్లో ఉంటుంది. నాలుగు భాగాలుగా విభజించిన ఈ సెన్సర్ నాలుగు ప్రత్యేక రసాయనాలను గుర్తించగలదు. మూత్రం, రక్తనమూనాల్లో ఈ నాలుగు రసాయనాల మోతాదును బట్టి వ్యాధి ఉందో లేదో.. ఉంటే ఎలా విస్తరిస్తోంది? లేదా ఎంతమేరకు నయమైంది? అన్నది తెలుసుకోవచ్చు. మైక్రోయూఎస్బీ సాయంతో దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు తగిలించుకుని పనిచేయించవచ్చునని, అతి చౌకగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉండటం దీని ప్రత్యేకత అని అంటారు ఈ పరికరాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన సమాధాన్ పాటిల్. ప్రస్తుతం దీన్ని గుండెజబ్బులతోపాటు ప్రొస్టేట్ కేన్సర్ నిర్ధారణకు ఉపయోగించవచ్చునని చెప్పారు. ప్రపంచంలో ఏమూలన ఉన్న వారి వివరాలనైనా డాక్టర్లు ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చునని వివరించారు. స్మార్ట్ఫోన్ల ద్వారా ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఇప్పటికే బోలెడన్ని అప్లికేషన్లు, గాడ్జెట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మరిన్ని వినూత్నమైన పరికరాల తయారీ కోసం మైక్రోప్రాసెసర్ తయారీ సంస్థ క్వాల్కామ్ భారీ నగదు బహుమతితో ఓ పోటీ కూడా నిర్వహిస్తోంది. -
డిజిటల్ యాడ్స్‌లో ‘అడ్వాంటేజ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెట్‌టాప్ బాక్సుల తయారీలో ఉన్న ఎక్స్‌జా ఇన్ఫోసిస్టమ్స్ డిజిటల్ ప్రకటనలకై కొత్త వేదికను అభివృద్ధి చేసింది. ‘అడ్వాంటేజ్’ పేరుతో తొలుత కేబుల్ టీవీ ద్వారా వీక్షకులకు చేరువ కానుంది. టీవీ రిమోట్‌ను ఆపరేట్ చేస్తున్న సమయంలో మాత్రమే చిన్న సైజులో ప్రకటనలు తెరపై ప్రత్యక్షమవుతాయి. వీక్షకులు అవసరమైతే ఆ ప్రకటనను రిమోట్లో ప్రత్యేక బటన్‌ను నొక్కడం ద్వారా స్క్రీన్ మీద పెద్దగా చూసుకోవచ్చు. అడ్వాంటేజ్ ద్వారా కేబుల్ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్స్‌జా ఎండీ జాయ్ కొక్కట్ తెలిపారు. డైరెక్టర్లు సోన్యా రాయ్, విశాల్ మల్హోత్రా, అద్నాన్ ధులియావాలాతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. అతి తక్కువ ఖర్చుతో: అడ్వాంటేజ్ సేవలను మొదట తెలంగాణలో ప్రారంభిస్తున్నట్టు జాయ్ కొక్కట్ చెప్పారు. ‘కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రకటనలు నియంత్రిస్తాం. ట్రాయ్ పరిమితులకు లోబడే ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేశాం. వీక్షకులున్న ప్రాంతం, భాష ఆధారంగా ప్రకటనలు మార్చవచ్చు. ఇతర ప్రకటనలతో పోలిస్తే 1/8 వంతు మాత్రమే ప్రకటనదారుల నుంచి చార్జీ వసూలు చేస్తాం. వీడియో యా డ్స్కు సైతం టెక్నాలజీ రూపొందించాం. భారత్‌లో 14 మంది, విదేశాల్లో ఇద్దరు కేబుల్ ఆపరేటర్లు మా కస్టమర్లు’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా 35 లక్షల గృ హాల్లో ఎక్స్‌జా సెట్‌టాప్ బాక్సులు వాడుతున్నారు. -
అదే మాకు అడ్వాంటేజ్: పూజారా
మొహాలీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆల్ రౌండర్లు అశ్విన్, జడేజా అద్భుతంగా రాణించారని సహచర ఆటగాడు చటేశ్వర పూజారా కితాబిచ్చాడు. అశ్విన్, జడేజాల బ్యాటింగ్ భారత్‌కు సానుకూలంగా మారిందని అన్నారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుజారా.. మూడో రోజు తొలి సెషన్ భారత్‌కు కీలకమైందన్నారు. తొలి ఇన్నింగ్స్ లో 75 నుంచి 100 పరుగుల ఆధిక్యం ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ సైతం కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేశాడని పూజారా కితాబిచ్చాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఒక దశలో 204 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్‌ను అశ్విన్(57 పరుగులు నాటౌట్), జడేజా(31 పరుగులు నాటౌట్) ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో చటేశ్వర పూజారా 51(104 బంతుల్లో 8 ఫోర్లు) పరుగులు సాధించాడు. -
కన్హయ్య ఉద్యమంలోకి ఐఎస్ చొరబాటు?
న్యూఢిల్లీ: దేశ రాజధాని జేఎన్ యూలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడటానికి ప్రయత్నించినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ)వెల్లడించింది. ఫిబ్రవరి 19 నాటి ఉదంతంలో జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడిని విడిచిపెట్టాలని దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనను నిర్వహించారు. దీన్నిఆసరాగా చేసుకొని దేశంలో విధ్వంసం సృష్టించాలని ఐసిస్ రిక్రూట్ మెంట్ విభాగమైన జనద్ అల్ ఖలీఫా- ఇ- హింద్ కు చెందిన ఉగ్రవాది అహ్మద్ అలీ హుగ్లీకి చెందిన ఆషిక్ అహ్మద్(19) కి సూచించినట్లు సమాచారం. ఇలా విధ్వసం సృష్టించి దేశంలో అలజడులు సృష్టిండానికి కుట్ర జరిగిందని, దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు ఉన్నట్లుటు ఐఎన్ఏ తెలిపింది. తర్వాత పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్నాటకల్లో ఐసిస్ సమావేశాలు ఏర్పాటు చేసిందని, దీనికి సంబంధించి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. -
దానధర్మాలు... అల్లాహ్ ఆదేశాలు
అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు. కనుక పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు. దైవం మానవుడికి ప్రసాదించిన సంపద అతనొక్కడికే పరిమితం కాదు. అందులో పశుపక్ష్యాదులక్కూడా వాటా ఉంది. బంధువులు, బాటసారులు, పేదలు, అనాథలు అందరికీ ఎంతోకొంత హక్కుంది. వీటన్నిటినీ నెరవేరిస్తేనే దైవం అనుగ్రహిస్తాడు. సంపదలో వృద్ధిని ప్రసాదిస్తాడు. అలా కాకుండా ఏ సత్కార్యానికీ పైసా ఖర్చు పెట్టకుండా, ఏ నిరుపేదకూ, పట్టెడన్నం పెట్టకుండా పైసా పైసా కూడబెట్టి అనుభవిస్తాడో, లేక దాచి పెడతాడో అలాంటి వారిని అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు. ఏదో ఒకరోజు ఆ సంపదనంతా లాక్కొని బిచ్చగాడిగా మారుస్తాడు. పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద పళ్లతోట ఉండేది. పంటకాలంలో అతను చాలా ఉదారంగా వ్యవహరించేవాడు. తోటలో పనికి వచ్చే కూలీల పట్ల దయతో మసలుకుంటూ కాస్త అదనంగానే కూలి ఇచ్చేవాడు. బాటసారులకు, పేదసాదలకు పళ్లు పంచిపెట్టేవాడు. ఇంకా వివిధ రకాలుగా నిరుపేదలను ఆదుకునేవాడు. ఆ వ్యక్తికి ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురిలో ఇద్దరికి మాత్రం తండ్రి ైవె ఖరి నచ్చేది కాదు, ఒక కొడుకుది మాత్రం తండ్రి గుణమే. అయితే మిగతా ఇద్దరూ ‘నాన్నా! మీరిలా పేదసాదలు, ఆర్తులు, అనాథలంటూ దానధర్మాలు చేస్తూ పోతే చివరికి మనకేమీ మిగలదు.’ అనేవారు. తండ్రి వారికి నచ్చచెబుతూ ‘బిడ్డలారా! మీ ఆలోచన తప్పు. పరులకు సహాయం చేయడం వల్ల సంపద వృద్ధి అవుతుందే తప్ప తరిగిపోదు. అయినా, మన దగ్గర ఉన్న సంపద అంతా నిజానికి మనది కాదు. మనం కేవలం దాని పర్యవేక్షకులం, అమానతుదారులం మాత్రమే. ఈ సంపదకు అసలు యజమాని అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన ఆదేశాలు, హితవుల ప్రకారమే మనమీ సంపదను వినియోగించాలి. మన అవసరాలకు మించి, మిగిలి ఉన్న సంపదలో పేదసాదలు, బంధువులు, బాటసారులు, అనాథలు, అన్నార్తులు అందరికీ వాటా ఉంది. అందరి హక్కులు మనం నెరవేర్చవలసి ఉంది. అంతే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాదులకూ ఈ సంపదపై హక్కు ఉంది. ఎందుకంటే అవి కూడా దేవుని సృష్టిలోనివే కదా! ఈ అందరి హక్కులు పోగా మిగిలినదే మనది. అందులోనే అల్లాహ్ సమృద్ధిని ప్రసాదిస్తాడు. ఈవిధంగానే మనం మనం సంపదను పరిశుద్ధం చేసుకోగలం. నా తదనంతరం మీరు కూడా ఇదే విధానాన్ని అవలంబించండి.’’ అంటూ హితోపదేశాలు చేశాడు. కాని తండ్రి మరణానంతరం పంట సమయంలో కూలీలకు చేదు అనుభవం ఎదురైంది. తోట యజమానులైన ఆ కుమారులు పేదసాదలెవరినీ ఆ దరిదాపులకు రానివ్వలేదు. కూలీల పట్ల కూడా క్రూరంగా ప్రవర్తించారు. అయితే మూడవ కొడుకు మాత్రం మిగతా ఇద్దరి వైఖరిని వ్యతిరేకిస్తూ ‘ఇప్పుడు మనం ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. నాన్నగారు ఉన్నప్పుడు వీరందరిలో ఎలా వ్యవహరించేవారో మనం కూడా వీరితో అలాగే వ్యవహరిద్దాం. అందులోనే మన శ్రేయస్సు ఉంది’ అన్నాడు. కాని ఇద్దరు సోదరులు అతని మాటలను ఖాతరు చేయలేదు. ఎంతో ఆశతో వచ్చిన పేదసాదలకు, అనాథలను ఛీత్కరించి రిక్తహస్తాలతో వెనక్కి పంపించి వేశారు. మరునాడు తోటలోని పంటనంతా తామే కోసి పంచుకోవాలనే ఉద్దేశ్యంతో సోదరునికి కూడా చెప్పకుండా తెల్లవారుజామునే తోటకి వెళ్లారు. కాని అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. నిండు పంటతో కళకళలాడుతూ ఉన్న ఆ తోట నామరూపాల్లేకుండా నాశనమై పోయి ఉంది. అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు. కనుక పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు. లేకపోతే ఏదో ఒకరోజు దాన్ని మన నుండి దూరం చేసి కఠినంగా శిక్షిస్తాడు. ఈ వృత్తాంతానికి సంబంధించి పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది: ‘‘ఆ సోదరులు నిద్రిస్తుండగానే అల్లాహ్ తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టింది. అంతే! తెల్లవారేసరికల్లా ఆ తోట కోత కోసిన చేనులా అయిపోయింది (ఖురాన్ 68:19,20). - యండీ ఉస్మాన్‌ఖాన్ -
గ్యాస్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ :గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ కోరారు. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎల్పీజీ (డీబీటీఎల్) పథకాన్ని ఆదివారం స్థానిక మంగమూరురోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో ఆయన ప్రారంభించారు. అనంతరం గ్యాస్ వినియోగదారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెండో విడత ఈ పథకం ప్రారంభమైనట్లు వివరించారు. సబ్సిడీ నగదు నేరుగా వినియోగదారుల ఖాతాకు జమవుతుందన్నారు. సంవత్సరానికి తొమ్మిది సిలిండర్లు సబ్సిడీపై అందిస్తారన్నారు. వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే వారి బ్యాంకు ఖాతాలో రూ.500 సబ్సిడీ నగదు జమవుతుందన్నారు. ప్రస్తుతం వినియోగదారుడు రూ.457 చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. గ్యాస్ ధరలు పెరిగితే పెరిగిన ధరలకు అనుగుణంగా వినియోగదారుడు నగదు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా, సబ్సిడీ నగదు పక్కదారి పట్టకుండా ఉండేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎల్పీజీ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. తాజాగా ప్రవేశపెట్టిన విధానం వల్ల ఎక్కువ మంది కొత్త వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లు పొందే వీలు కలుగుతుందన్నారు. గ్యాస్ సబ్సిడీ పొందాలంటే సంబంధిత వినియోగదారులు విధిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, గ్యాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను తమ ఏజెన్సీల్లో అందించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీలకు సంబంధించి 57 ఏజెన్సీలు ఉన్నాయన్నారు. వీటి పరిధిలో 5లక్షల 66వేల 958మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కేవలం లక్షా 53 వేల 333 మంది మాత్రమే నగదు బదిలీ పథకానికి వివరాలు అందించారన్నారు. క్యాష్ ట్రాన్స్ఫర్ కన్జూమర్(సీటీసీ) కింద గుర్తించి నగదు బదిలీ పథకం కింద ఆధార్, ఇతర వివరాలు అందించిన వారిని గుర్తించినట్లు తెలిపారు. ఆధార్, ఇతర వివరాలు అందించని వారిని నాన్ క్యాష్ ట్రాన్స్ఫర్ కన్జూమర్(ఎన్సీటీసీ) కింద పరిగణించి మూడు నెలల వరకు గడువు ఇస్తారని చెప్పారు. ఈ మూడు నెలలు వారికి సబ్సిడీపైనే గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నారు. ఆ తరువాత కూడా ఇవ్వకుంటే మార్కెట్ ధర ప్రకారం వారు గ్యాస్ సిలిండర్‌కు పూర్తి నగదు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా గ్యాస్ వినియోగదారుడు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చి నగదు సబ్సిడీ పొందాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ కోరారు. సమావేశంలో ఎల్డీఎం ప్రసాద్ పాల్గొన్నారు. -
వాళ్లతో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం
‘‘స్టార్ హీరోల పక్కన సినిమాలు చేయడం చాలా అడ్వాంటేజ్. కానీ కొంతమంది మాత్రం ‘మీకేం పేరొస్తుంది. మొత్తం క్రెడిట్ అంతా హీరోలకే దక్కుతుంది కదా’ అంటారు. అయితే స్టార్ హీరోలతో సినిమా చేయడం హీరోయిన్లకు చాలా ప్లస్ అన్నది నా అభిప్రాయం’’ అంటున్నారు తమన్నా. ఈ మిల్క్‌బ్యూటీ ఇప్పటివరకు చేసినవన్నీ దాదాపు కమర్షియల్ చిత్రాలే. కథానాయిక ప్రాధాన్యం ఉన్న అరుంధతి, వేదంలాంటి చిత్రాలు చేయలేదు. ఆ విషయంలో మీకేమైనా బాధ ఉంటుందా? అని తమన్నాని అడిగితే -‘‘ఏమాత్రం బాధ లేదు. ఒకవేళ ఆ తరహా చిత్రాలొస్తే తప్పకుండా చేస్తా. లేకపోతే మాత్రం బాధపడను. ఎందుకంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టం. ఆ తరహా సినిమాలు దాదాపు హీరోల చుట్టూనే తిరుగుతాయి. హీరోయిన్ తెరపై కనిపించేది పాటల్లో, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కాబట్టి మా పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. అందుకని తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒక రకంగా సవాల్ అనే చెప్పాలి. అదే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకోండి.. సినిమా మొత్తం మా చుట్టూనే తిరుగుతుంది కాబట్టి నిరూపించుకోవడానికి బోల్డంత అవకాశం ఉంటుంది. ఏదేమైనా స్టార్స్‌తో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారి సినిమాలకు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అందులో నటించేవాళ్లందరూ ప్రేక్షకుల దృష్టిలో పడతారు.తెరపై కనిపించిన తక్కువ టైమ్‌లోనే ఆకట్టుకోగలిగామనుకోండి.. అప్పుడు వారి అభిమానాన్ని పొందవచ్చు. అందుకే కమర్షియల్ చిత్రాలను ఇష్టపడి చేస్తాను’’ అని చెప్పారు.