కన్హయ్య ఉద్యమంలోకి ఐఎస్ చొరబాటు?
న్యూఢిల్లీ: దేశ రాజధాని జేఎన్ యూలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడటానికి ప్రయత్నించినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ)వెల్లడించింది. ఫిబ్రవరి 19 నాటి ఉదంతంలో జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడిని విడిచిపెట్టాలని దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనను నిర్వహించారు.
దీన్నిఆసరాగా చేసుకొని దేశంలో విధ్వంసం సృష్టించాలని ఐసిస్ రిక్రూట్ మెంట్ విభాగమైన జనద్ అల్ ఖలీఫా- ఇ- హింద్ కు చెందిన ఉగ్రవాది అహ్మద్ అలీ హుగ్లీకి చెందిన ఆషిక్ అహ్మద్(19) కి సూచించినట్లు సమాచారం. ఇలా విధ్వసం సృష్టించి దేశంలో అలజడులు సృష్టిండానికి కుట్ర జరిగిందని, దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు ఉన్నట్లుటు ఐఎన్ఏ తెలిపింది. తర్వాత పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్నాటకల్లో ఐసిస్ సమావేశాలు ఏర్పాటు చేసిందని, దీనికి సంబంధించి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది.