వాళ్లతో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం
వాళ్లతో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం
Published Sun, Aug 25 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
‘‘స్టార్ హీరోల పక్కన సినిమాలు చేయడం చాలా అడ్వాంటేజ్. కానీ కొంతమంది మాత్రం ‘మీకేం పేరొస్తుంది. మొత్తం క్రెడిట్ అంతా హీరోలకే దక్కుతుంది కదా’ అంటారు. అయితే స్టార్ హీరోలతో సినిమా చేయడం హీరోయిన్లకు చాలా ప్లస్ అన్నది నా అభిప్రాయం’’ అంటున్నారు తమన్నా. ఈ మిల్క్‌బ్యూటీ ఇప్పటివరకు చేసినవన్నీ దాదాపు కమర్షియల్ చిత్రాలే. కథానాయిక ప్రాధాన్యం ఉన్న అరుంధతి, వేదంలాంటి చిత్రాలు చేయలేదు.
ఆ విషయంలో మీకేమైనా బాధ ఉంటుందా? అని తమన్నాని అడిగితే -‘‘ఏమాత్రం బాధ లేదు. ఒకవేళ ఆ తరహా చిత్రాలొస్తే తప్పకుండా చేస్తా. లేకపోతే మాత్రం బాధపడను. ఎందుకంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టం. ఆ తరహా సినిమాలు దాదాపు హీరోల చుట్టూనే తిరుగుతాయి. హీరోయిన్ తెరపై కనిపించేది పాటల్లో, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కాబట్టి మా పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. అందుకని తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒక రకంగా సవాల్ అనే చెప్పాలి.
అదే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకోండి.. సినిమా మొత్తం మా చుట్టూనే తిరుగుతుంది కాబట్టి నిరూపించుకోవడానికి బోల్డంత అవకాశం ఉంటుంది. ఏదేమైనా స్టార్స్‌తో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారి సినిమాలకు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అందులో నటించేవాళ్లందరూ ప్రేక్షకుల దృష్టిలో పడతారు.తెరపై కనిపించిన తక్కువ టైమ్‌లోనే ఆకట్టుకోగలిగామనుకోండి.. అప్పుడు వారి అభిమానాన్ని పొందవచ్చు. అందుకే కమర్షియల్ చిత్రాలను ఇష్టపడి చేస్తాను’’ అని చెప్పారు.
Advertisement
Advertisement