అదే మాకు అడ్వాంటేజ్: పూజారా
మొహాలీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆల్ రౌండర్లు అశ్విన్, జడేజా అద్భుతంగా రాణించారని సహచర ఆటగాడు చటేశ్వర పూజారా కితాబిచ్చాడు. అశ్విన్, జడేజాల బ్యాటింగ్ భారత్‌కు సానుకూలంగా మారిందని అన్నారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుజారా.. మూడో రోజు తొలి సెషన్ భారత్‌కు కీలకమైందన్నారు. తొలి ఇన్నింగ్స్ లో 75 నుంచి 100 పరుగుల ఆధిక్యం ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ సైతం కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేశాడని పూజారా కితాబిచ్చాడు.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఒక దశలో 204 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్‌ను అశ్విన్(57 పరుగులు నాటౌట్), జడేజా(31 పరుగులు నాటౌట్) ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో చటేశ్వర పూజారా 51(104 బంతుల్లో 8 ఫోర్లు) పరుగులు సాధించాడు.